For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వెన్ను నొప్పి పై అపోహాలు -వాస్తవాలు

By Super
|

బ్యాక్ పెయిన్(వెన్ను నెప్పి) సర్వ సాధారణం.నిజం చెప్పాలంటే 80 శాతం మంది ఎప్పుడో ఒకప్పుడు దీనితో బాధపడతారు.బ్యాక్ పెయిన్ లక్షణాలు అందరిలో ఒకేలాగ ఉండవు.కొంతమందిలో ఈ నెప్పి బాగా ఉంటే కొంత మందిలో తక్కువగా ఉంటుంది.బ్యాక్ పెయిన్ కి సంబంధించిన అపోహలు, నిజాలు తెలుసుకుందామా..

అపోహ: నిటారుగా కూర్చోవాలి

అపోహ: నిటారుగా కూర్చోవాలి

కుర్చీలలో వంగి కూర్చోవడం మన వెన్ను కి మంచిది కాదని తెలుసు. కానీ నిటారుగా కూర్చోవడం కూడా వెన్ను కి చేటే.

అపోహ: బరువులు ఎత్తకూడదు

అపోహ: బరువులు ఎత్తకూడదు

ఒక బరువు ఎత్తేతప్పుడు ఎత్తే వస్తువు బరువు కన్నా మీరు దానిని ఎలా ఎత్తుతున్నారనేదే ముఖ్యం.ఏదైనా వస్తువు ని ఎత్తేటప్పుడు దానికి వీలయినంత దగ్గరగా ఉండి గొంతుకు కూర్చుని ఎత్తండి. ఎత్తేటప్పుడు వంగటం లేదా ఒక్కసారి గా కదలడం లాంటివి చెయ్యకండి.

అపోహ:బెడ్ రెస్ట్ పరమౌషధం :

అపోహ:బెడ్ రెస్ట్ పరమౌషధం :

బెడ్ రెస్ట్ తీవ్ర వెన్ను నెప్పి లేదా గాయాలనుండి కోలుకోవడం లో సహాయపడుతుంది.కానీ పూర్తిగా బెడ్ రెస్ట్ వల్ల తగ్గుతుంది అన్నది అపోహే.ఒక్కోసారికదలక మెదలక అలా మంచం లో ఉండటం మీ వెన్ను నెప్పిని మరింత తీవ్రతరం చేస్తుంది.

అపోహ:

అపోహ:

శరీరం బరువు పెరిగితే వెన్ను నొప్పి కూడా పెరుగుతుంది

శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవడం వల్ల వెన్ను నెప్పి ని నివారించవచ్చు లేదా మరింత ముదరకుండా చేయచచ్చు. శారీరకం గా ఫిట్ గా లేని వాళ్ళు లేదా స్థూలకాయులలో వెన్ను నెప్పి సర్వసాధారణం.వారాంతాలలో మాత్రమే వ్యాయామం చేసే(వీనెండ్ వారియర్స్) లో వెన్ను నెప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ.

అపోహ:బక్కగా ఉంటే నెప్పి ఉండదు

అపోహ:బక్కగా ఉంటే నెప్పి ఉండదు

బాగా బలహీనం గా ఉన్నవారిలో వెన్ను నెప్పి అవకాశాలెక్కువ. ముఖ్యం గా సరిగా తినకపోవడమనే రుగ్మత(ఈటింగ్ డిజార్డర్ ) మరియు ఆస్టియోపోరోసిస్ ఉన్నవారిలో వెన్ను నెప్పి వచ్చే అవకాశం మరింత అధికం.

అపోహ:వ్యాయామం వెన్ను నెప్పికి చేటు

అపోహ:వ్యాయామం వెన్ను నెప్పికి చేటు

క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల వెన్ను నెప్పిని నివారించవచ్చు.వెన్ను నెప్పి తీవ్రం గా ఉన్నవారు నిపుణుల పర్యవేక్షణలో చేసే తేలికపాటి వ్యాయామాలు మంచివి.మొదట తేలికగా ఉండే వ్యాయామాలతో మొదలెట్టి మెల్లిగా తీవ్రత ని పెంచుకుంటూ పోవాలి. యదార్ధం: చిరోప్రాక్టిక్ వెన్ను నెప్పి కి బాగా ఉపయోగం. స్పైనల్ మానిప్యులేషన్ (స్పైనల్ అభిసంధానం )లేదా మసాజ్ లు వెన్ను నెప్పి నివారణకి ఉపయోగకర మార్గాలు.

యదార్ధం:ఆక్యూపంక్చర్ నెప్పి ని నివారిస్తుంది

యదార్ధం:ఆక్యూపంక్చర్ నెప్పి ని నివారిస్తుంది

మిగతా ట్రీట్మెంట్ల వల్ల లొంగని వెన్ను నెప్పులు ఆక్యూపంక్చర్ విధానం లో తగ్గుముఖం పడతాయి.యోగా, రిలాక్సేషన్,కాగ్నిటివ్ బెహావియోరల్ థెరపీలు (అభిజ్ఞా ప్రవర్తన చికిత్స) కూడా ఉపయోగకరమే.

అపోహ:పరుపు గట్టిగా ఉండాలి

అపోహ:పరుపు గట్టిగా ఉండాలి

వెన్ను నెప్పి ఉంటే పరుపు ఎంత గట్టిగా ఉండాలి అన్న విషయాన్ని అనేకమంది అనేక రకాలుగా చెప్తారు. స్పెయిన్ లో జరిపిన ఒక అధ్యయనంలో మధ్యస్త గట్టిదనం ఉన్న పరుపు(5.6 నుండి 10 పాయింట్లు హార్డ్ స్కేల్ లో)మీద పడుకున్న వాళ్ళలో వెన్ను నెప్పి మరీ గట్టి గా ఉన్న పరుపు(2.3 పాయింట్లు) మీద పడుకున్న వారి కంటే తక్కువ ఉంది.


English summary

The Truth About Back Pain: Health Tips in Telugu

Back pain is extremely common. In fact, 80% of people will have significant back pain at some point. Back pain symptoms vary from individual to individual. They can be sharp or dull. Myths regarding back pain are also common. Can you recognize the myths and facts that follow?
Desktop Bottom Promotion