For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఓట్ మీల్ యొక్క టాప్ 10 ఆరోగ్య ప్రయోజనాలు

By Super
|

ఒక కప్పు వోట్మీల్ అనేది మంచి ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి ఒక అద్భుతమైన ధాన్యపు అల్పాహారం అని చెప్పవచ్చు. తృణధాన్యాల గింజలు అయిన వోట్స్ లో ప్రోటీన్,ఇనుము,మెగ్నీషియం, పొటాషియం, సెలీనియం, ఫోలేట్, మరియు ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు వంటి పోషకాలు ఉన్నాయి. అంతేకాక, మీ ఆరోగ్యానికి అవసరమైన శక్తివంతమైన ఫోటో న్యూ త్రియంత్స్ మరియు యాంటీఆక్సిడాంట్స్ ఉంటాయి.

వోట్మీల్ యొక్క ఆరోగ్య ప్రయోజనాలను పెంచడానికి,నట్స్,పండ్లు లేదా మసాలా దినుసులను జోడించండి. అయితే,ఎక్కువ చక్కరను జోడించవద్దు. దానికి బదులుగా, రుచిని పెంచటానికి సహజమైన రుచులు అయిన పండ్లు,మసాలాను జోడించండి.

READ MORE: ఓట్స్ ను ఆరోగ్యకరంగా-రుచికంగా తీసుకోవడానికి టిప్స్

ఇక్కడ వోట్మీల్ 10 ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది

కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది

వోట్మీల్ లో ఉండే ఫైబర్ లో లిపిడ్ ని తగ్గించే ప్రయోజనాలు ఉన్నాయి. దీనిలో ఉండే బీటా-గ్లూకాన్ అనే కరిగే ఫైబర్ LDL ("చెడు" కొలెస్ట్రాల్) స్థాయిలను తగ్గిస్తుంది. అలాగే కొలెస్ట్రాల్ యొక్క ప్రేగు శోషణను తగ్గిస్తుంది.

అదనంగా,వోట్మీల్ లో ఉండే వేనంత్రమిడ్ అనే యాంటి ఆక్సిడెంట్ LDL ఆక్సీకరణకు వ్యతిరేకంగా రక్షిస్తుంది. కాబట్టి, కొలెస్ట్రాల్ తగ్గించే ప్రభావాలను విస్తరించటానికి నారింజ వంటి విటమిన్ సి అధికంగా ఉన్న ఆహారంతో వోట్మీల్ కలిపి తీసుకోండి.

కార్డియోవాస్క్యులర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది

కార్డియోవాస్క్యులర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది

వోట్మీల్ లో సమృద్దిగా ఉండే యాంటి ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్ మీద పోరాటం చేయటానికి మరియు అథెరోస్క్లెరోసిస్ దోహదపడే ఆక్సీకరణ ఒత్తిడి మరియు వాపును తగ్గిస్తుంది. ధమనులు గట్టిపడటం అనేది హార్ట్ ఎటాక్ కి దారి తీస్తుంది.

అంతేకాక, వోట్స్ లో ఉండే లిగ్నన్ గుండె జబ్బులను నివారించడానికి సహాయం మరియు బీటా-గ్లూకాన్స్ గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి మరియు ఇస్కీమిక్ గుండె గాయంను మెరుగుపరుస్తుందని కనుగొన్నారు. ఈ సూపర్ ఆహారం ఋతుక్రమం ఆగిపోయిన స్త్రీల కోసం ముఖ్యమైన కార్డియోవాస్క్యులర్ ప్రయోజనాలను అందిస్తుంది.

బరువు తగ్గడానికి సహాయం

బరువు తగ్గడానికి సహాయం

వోట్మీల్ అల్పాహారం అదనపు పౌండ్లు కోల్పోవటానికి మరియు ఒక ఆరోగ్యకరమైన శరీర బరువును నిర్వహించడానికి ఎంతో బాగుంటుంది. దీనిలో ప్రోటీన్ మరియు ఫైబర్ ఉండుట వలన కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది.

2013 అధ్యయనంలో వోట్మీల్ ఇతర తృణధాన్యాలు కంటే ఎక్కువ ఫైబర్ ని అందిస్తుందని కనుగొన్నారు. పరిశోధకులు రుచిలేని ఇన్స్టంట్ వోట్మీల్ మరియు వోట్ ఆధారిత చల్లని తృణధాన్యాల ప్రభావాలతో పోల్చారు. మీ తదనంతర శక్తి తీసుకోవడం తగ్గిందని మరియు మిమ్మల్ని సంతృప్తిగా ఉంచుతుందని కనుగొన్నారు.

బ్లడ్ షుగర్ ని స్థిరపరస్తుంది

బ్లడ్ షుగర్ ని స్థిరపరస్తుంది

ఇతర అల్పాహార ఎంపికలతో పోలిస్తే, వోట్మీల్ ఒక స్థిరమైన వనరు అందించే అధిక నాణ్యత గల కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉండటం వలన,శరీరంలో అది నెమ్మదిగా జీర్ణం అయ్యి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను స్థిరపరస్తుంది.

అంతేకాక, వైజ్ఞానిక అధ్యయనాలలో వోట్స్ వంటి తృణధాన్యాల యొక్క సాధారణ వినియోగం వలన టైప్ 2 మధుమేహ ప్రమాదం తగ్గుతుందని కనుగొన్నారు.

అధిక రక్తపోటును తగ్గుతుంది

అధిక రక్తపోటును తగ్గుతుంది

2002 నాటి ఒక అధ్యయనంలో వోట్స్ తేలికపాటి లేదా రక్తపోటు బోర్డర్ లో ఉన్న ప్రజలలో సిస్టోలిక్ మరియు విస్ఫారణ రక్తపోటును తగ్గిస్తుందని కనుగొన్నారు.

వోట్స్ ఊక మరియు సంపూర్ణ వోట్స్ అధిక రక్తపోటు నియంత్రణ కోసం ముఖ్యంగా ఉపయోగపడతాయి. అంతేకాక, వోట్మీల్ లో ఉండే ఫైబర్ మరియు మెగ్నీషియం కంటెంట్ ఫలకం ఏర్పడే వేగాన్ని తగ్గించి రక్త ప్రవాహం పెంచడానికి సహాయం చేస్తుంది.

మీ ఆహారంలో సంపూర్ణ ఓట్స్ మరియు సంపూర్ణ ధాన్యాలను జోడిస్తే అధిక రక్తపోటు నియంత్రణ మరియు హార్ట్ ఎటాక్ ప్రమాదాలు తగ్గటానికి సహాయం చేస్తుంది.

రొమ్ము క్యాన్సర్ నుంచి రక్షిస్తుంది

రొమ్ము క్యాన్సర్ నుంచి రక్షిస్తుంది

వోట్మీల్ లో క్యాన్సర్లను ఆపటానికి లిగ్నన్ మరియు ఎన్తెరోలక్టోనే అనే ఫైటోకెమికల్స్ సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా, ఎన్తెరోలక్టోనే అనేది రొమ్ము మరియు ఇతర హార్మోన్ సంబంధిత క్యాన్సర్లు నివారించడంలో సమర్థవంతమైనదని గుర్తించారు.

అదనంగా, వోట్స్, వరి మరియు ఇతర సారూప్య ఆహారాలలో కరిగే ఫైబర్ రొమ్ము క్యాన్సర్ కణాల మీద ప్రత్యక్ష ప్రభావంను కలిగి ఉంటుంది.

ప్రేగుల ఆరోగ్యానికి మద్దతు

ప్రేగుల ఆరోగ్యానికి మద్దతు

వోట్మీల్ లో అధిక ఫైబర్ కంటెంట్ ఉండుట వలన మీ పెద్దప్రేగు మరియు ప్రేగు ఆరోగ్యం కోసం ముఖ్యమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఇది వ్రణోత్పత్తి పెద్ద ప్రేగుతో బాధపడుతున్న వ్యక్తుల కోసం మంచిది మరియు పెద్దప్రేగు క్యాన్సర్ అభివృద్ధి ప్రమాదంను తగ్గిస్తుంది. అంతేకాకుండా, వోట్మీల్ ఆరోగ్యకరమైన ప్రేగు పనితీరుకు దోహదం మరియు మలబద్ధకం నుండి ఉపశమనానికి సహాయపడుతుంది.

సెలియాక్ రోగులకు ఈ సంపూర్ణ ధాన్యం ఆహారం కూడా మంచి గోధుమకు ప్రత్యామ్నాయంగా చెప్పవచ్చు. చిన్న మొత్తంలో గ్లూటెన్ ఉండుట వలన నియంత్రణలో తినాలి.

మీ ఆహారంలో ఫైబర్ జోడించినప్పుడు, పైబర్ దాని పని బాగా చేయాలంటే నీరు పుష్కలంగా త్రాగాలని నిర్ధారించుకోండి.

ఒత్తిడిని తగ్గిస్తుంది

ఒత్తిడిని తగ్గిస్తుంది

వెచ్చని మరియు ఉపశమనం కలిగించే తృణధాన్యాల బ్రేక్ ఫాస్ట్ ఆందోళన మరియు ఒత్తిడిని దూరంగా ఉంచేందుకు సహాయపడుతుంది. ఇది సెరోటోనిన్ ఉత్పత్తిని పెంచి మెదడు,మానసిక స్థితి,నిద్ర మరియు ఆకలిని నియంత్రించే ఒక న్యూరోట్రాన్స్మిటర్ ని ప్రేరేపిస్తుంది.

అదనంగా, మెగ్నీషియం ఉండుట వలన నిద్ర నాణ్యత పెరిగి విశ్రాంతికి సహాయపడుతుంది.

ఈ సంక్లిష్ట కార్బోహైడ్రేట్ ఆహారం తక్కువ మొత్తంలో తీసుకుంటే ఒత్తిడి ఉపశమనానికి సహాయపడుతుంది. ఆరోగ్యం మరియు మూడ్ ప్రయోజనాలను విస్తరించేందుకు వోట్మీల్ సౌకర్యవంతమైన ఆహారంగా ఉంటుంది. బ్లూ బెర్రీలలో అధిక యాంటీ ఆక్సిడెంట్ మరియు విటమిన్ సి కంటెంట్ ఉండుట వలన ఉత్తమ ఒత్తిడిని బస్టింగ్ ఆహారాలలో ఒకటిగా పరిగణిస్తారు.

వ్యాధినిరోధక శక్తిని పెంచటానికి

వ్యాధినిరోధక శక్తిని పెంచటానికి

సంపూర్ణ ధాన్య వోట్స్ లో రోగనిరోధక శక్తిని పెంచే పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి. వాటిలో ఫైబర్ ఒక మంచి మూలంగా ఉంది. ఇది రోగనిరోధక కణాల కార్యకలాపాల మార్పులతో ముడిపడి ఉంటుంది.

అంతేకాక, వోట్మీల్ బీటా-గ్లూకాన్స్,యాంటీమైక్రోబయాల్ మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. అధ్యయనాలు బీటా-గ్లూకాన్స్ బాక్టీరియా అంటువ్యాధులకు రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందనను విస్తరించేందుకు సహాయం చేస్తాయని చెప్పుతున్నాయి.

వోట్మీల్ రోగనిరోధక శక్తిని పెంచి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. పాత రకం ఓట్స్ కి బదులుగా చక్కెరలతో నిండిన తక్షణ శక్తిని ఇచ్చే వోట్మీల్ రకాలు ఉన్నాయి.

చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది

చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది

వోట్మీల్ తినటం వలన మీ చర్మం మృదువుగా మరియు తేమగా ఉండటానికి సహాయపడుతుంది. అంతేకాక, వోట్ స్నానాలను తరచుగా చేస్తే చర్మం మీద ఎరుపు, దురద, మరియు చికాకు నుండి ఉపశమనం కలుగుతుంది. ఇది అన్ని రకాల చర్మాల వారికీ అనుకూలంగా ఉంటుంది. అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు ఎక్స్ ఫ్లోట్ ప్రభావాలను కలిగి ఉంటుంది.

వోట్మీల్ ఒక సహజ క్లీన్సర్ వలె పనిచేస్తుంది. అది చర్మం నుంచి అధిక నూనె,ధూళి మరియు మలినాలను తొలగిస్తుంది. అంతేకాక, కొన్ని వోట్ ఫినాల్స్ సూర్యుడు నష్టం నుండి చర్మంను రక్షించేందుకు బలంగా అతినీలలోహిత శోషకాలపై పనిచేస్తాయి.

English summary

Top 10 Health Benefits of Oatmeal You Should Know

Having a steaming bowl of oatmeal is an excellent whole grain breakfast to promote better health. Oats are cereal grain loaded with fiber, protein, and nutrients like iron, magnesium, potassium, selenium, folate, and omega-3 fatty acids. Moreover, they contain powerful phytonutrients and antioxidants for your health.
Desktop Bottom Promotion