For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అల్లం సర్వరోగ నివారిణి: అల్లంలో టాప్ 10 మిరాకిల్ బెనిఫిట్స్

|

అల్లం అంటే తెలియని వారుండరు 5000 సంవత్సరాల నుండి అల్లంను వంటల్లోనే కాదు, అనేక ఔషధాలుగా కూడా ఉపయోగిస్తున్నారు. ఆసియా దేశాల్లో చేసే చాలా వంటకాల్లో ఇది విడదీయలేని భాగం. పచ్చళ్ళలోనూ, కూరల్లో వేసే మసాలా లోనూ దీన్ని విస్తృతంగా వాడుతారు. అల్లం ఒక దుంప లేదా వేరు లాంటిది. ఇందులో విటమిన్స్ మరియు మాంగనీస్ మరియు కాపర్ వంటి విలువైన పోషకాంశాలున్నాయి. ఇవి మన శరీరంలోని అనేక జీవక్రియలకు అత్యవసరం అయినవి.

అల్లం ట్రెడిషనల్‌ మెడిసిన్‌. మాంసాహారంలో అల్లం పడితే ఆ టేస్టే వేరు. అలాగే అల్లంతో టీ చేసుకుని తాగితే ఆ హాయి చెప్పనక్లర్లేదు. ఘాటుగా ఉండి వెజ్ నాన్వెజ్ తేడా లేకుండా అన్ని కూరలలో వాడేది అల్లం. అల్లం పచ్చడి గురించి చెప్పనవసరం లేదు.ఇద్లీలో, దోశలో నంచుకు తింటే అహా..!చెప్పనవసరంలేదుగా..!అల్లంలో మనకు తెలియని ఔషధీయ గుణాలు ఎన్నో పుష్కలంగా ఉన్నాయి. ఇది అనేక ఆరోగ్య సమస్యలకు చక్కటి మందులా పనిచేస్తుంది.

READ MORE: జింజర్ జ్యూస్(అల్లం రసం)లోని గొప్ప ఆరోగ్యప్రయోజనాలు

అల్లంలో విటమిన్, మెగ్నీషియం, పొటాషియం, కాపర్ మరియు మాంగనీస్ లు పుష్కలంగా ఉన్నాయి . ఇది ఒక హేర్బల్ మెడిసిన్ . ముఖ్యంగా ఇది ప్రేగుల్లోని గ్యాస్ ను నివారించడానికి సహాయపడుతుంది . మరియు ఇన్ టెన్షినల్ ట్రాక్ ను స్మూత్ చేస్తుంది, విశ్రాంతి పరుస్తుంది. అంతే కాదు అల్లం ఆకలిని పెంచుతుంది. లాలాజల ఉత్పత్తికి సహాయపడుతుంది మరియు జీర్ణ రసాలను ఉత్పత్తి చేస్తుంది . శ్వాస సంబంధిత సమస్యలను నివారిస్తుంది. ఎక్సెస్ గ్యాస్ ను నివారిస్తుంది . ఆర్థరైటిస్ పెయిన్ నివారిస్తుంది. అంతేకాదు వీటితో పాటు మరికొన్ని ప్రయోజనాలు ఈ క్రింది లిస్ట్ లో తెలపడం జరగింది.

ఖాళీ కడుపుతో వెల్లుల్లి తీసుకోండి.. ఆరోగ్యాన్ని మెరుగుప‌రుచుకోండి..

మరి ఇన్ని ప్రయోజనాలను తెలుసుకొన్నాక అల్లం తినకుంటే ఆనారోగ్య పాలైనట్లే . కొందరు అల్లాన్ని అన్నింటిలో వాడితే మరి కొంత మంది మాత్రం అల్లాన్ని చూస్తే ఆమడ దూరంలో ఉంటారు. అల్లాన్ని దూరం చేసుకుంటే మన ఆరోగ్యాన్ని దూరం చేసుకున్నట్టే. మరి అల్లం అవ్షధీయ సంగతులు తెలుసుకుందామా..!

జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది:

జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది:

జింజెర్ గాస్ట్రో ఇంటెస్టినల్‌ డిస్ట్రెస్‌ అంటే జీర్ణ సంబంధమైన ఇబ్బందులన్నిటికీ అల్లం రామ బాణంలా పనిచేస్తుంది.

 క్యాన్సర్ నివారిణి:

క్యాన్సర్ నివారిణి:

రక్త క్యాన్సర్‌ను నిరోధించ డంలో బాగా పని చేస్తుంది. కనుక అల్లాన్ని ఆహారంలో వాడడం ఎంతో మంచిది. అల్లం టీ త్రాగడం, రోజు ఉదయం ఓ చిన్న అల్లం.

 కోల్డ్ , కఫ్, మరియు ఫ్లూ :

కోల్డ్ , కఫ్, మరియు ఫ్లూ :

జలుబు, ఫ్లూను నివారించేందుకు చికిత్స చేయటానికి కూడా అనాదిగా వైద్యులు, ఆయుర్వేద శాస్తక్రారులు అల్లాన్ని ఉపయోగించారు.

వికారం నుంచి ఉపశమనం:

వికారం నుంచి ఉపశమనం:

ప్రయాణం ముందు అల్లం టీ ఒక కప్పు త్రాగటం వలన మోషన్ అనారోగ్యంతో సంబంధం కలిగిన వికారం మరియు వాంతులను నిరోధిస్తుంది. ఈ రోగలక్షణం ఉపశమనానికి వికారం వచ్చేటప్పుడు ఉండే మొదటి సంకేత సమయంలో ఒక కప్పు టీ త్రాగాలి.

మెనుష్ట్రువల్ సమస్యలు:

మెనుష్ట్రువల్ సమస్యలు:

జింజర్ లో ;ఉండే జిన్జేరోల్స్ ఈ హార్మోన్ల ఉత్పత్తిని అరికట్టి, రుతుసమయంలో వచ్చే నొప్పుల నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది. జింజర్ రుతుసమయంలో తిమ్మిరులు లాగ వచ్చే శరీరంలోని పిత్త ను కూడా తగ్గిస్తుంది, తద్వారా రుతుసమయ నొప్పి కూడా తగ్గుతుంది. ప్రతిరోజూ ఒక కప్పు జింజర్ టీ తాగితే (రుతుసమయానికి 2-3 రోజుల ముందు) రుతుక్రమం ఆలస్యంగా రావడం, రుతుసమయంలో నొప్పి లను అరికట్టవచ్చు.

బోన్ హెల్త్ :

బోన్ హెల్త్ :

కీళ్లనొప్పుల్ని తరిమికొట్టేందుకు అల్లం అద్భుతంగా పని చేస్తుందని ఒక పరిశోధనలో తేలింది.

డయోరియా:

డయోరియా:

డయోరియా, మోషన్‌ సిక్‌నెస్‌, సీసిక్‌నెస్‌లను తగ్గిస్తుంది. కడుపులో వాయువును అల్లం హరించి వేస్తుంది..

ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది:

ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది:

అల్లం పెయిన్‌ కిల్లర్‌. అలానే మంట ఎక్కడ ఉన్నా తగ్గిస్తుంది.జింజర్ టీ వల్ల ఇది ఒక మ్యాజికల్ బెనిఫిట్. ముఖ్యంగా స్పోర్ట్స్ లో ఉన్నవారు, రుమటాయిడ్, ఆర్థరైటిస్ తో బాధపడేవారుకి ఇన్ఫ్లమేషన్ నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది . బర్నింగ్ సెన్షేషన్, ఇన్ఫ్లమేషన్, ఇమ్మెన్సి పెయిన్, వాపు, కండరాలు మరియు జాయింట్ పెయిన్ నివారిస్తుంది .

వ్యాధినిరోధకతను పెంపొందిస్తుంది:

వ్యాధినిరోధకతను పెంపొందిస్తుంది:

అల్లం టీ త్రాగటం వలన,అల్లంలో అధిక స్థాయిలో అనామ్లజనకాలు ఉండుట వలన మీ రోగనిరోధక శక్తి బలోపేతం చేయటానికి సహాయపడుతుంది. మరియు కొలెస్ట్రాల్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది. కొవ్వు కణాలను విచ్ఛిన్నం చేస్తుంది. దాంతో స్ట్రోక్ వంటి వాటిని అరికట్టవచ్చు.

ఒత్తిడి తగ్గిస్తుంది:

ఒత్తిడి తగ్గిస్తుంది:

ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడి ప్రధాన ఆరోగ్య సమస్యగా ఉండి. అల్లం టీ మీ ఒత్తిడి మరియు ఉద్రిక్తతను తగ్గించే లక్షణాలను కలిగి ఉంది. దీనికి కారణం బలమైన వాసన మరియు వైద్య లక్షణాలు కలయిక అయ్యివుండవచ్చు. ఒత్తిడిగా ఉన్నప్పుడు ఒక కప్పు అల్లం టీ త్రాగడం వల్ల తక్షణం ఉపశమనం పొందవచ్చు.

English summary

TOP 10 Miraculous Health Benefits Of Ginger

TOP 10 Miraculous Health Benefits Of Ginger, Ginger is one of the oldest spices that is known for its strong and spicy aroma and thus has secured its own place in the Indian cuisine. It is one of the most used ingredients in any spicy dish that we prepare. It can be used either fresh or dried. Ginger is used to treat innumerable ailments because of its powerful therapeutic and preventive effects.
Story first published: Thursday, December 10, 2015, 18:08 [IST]
Desktop Bottom Promotion