For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రాత్రిపూట ఫాలో అవ్వాల్సిన సింపుల్ అండ్ హెల్తీ డైట్

By Swathi
|

రాత్రిపూట ఎలాంటి ఆహారం తీసుకోవాలి అన్న డైలమాలో ఉన్నారా ? ఏం తింటే ఏమవుతుందో అని కంగారు పడుతున్నారా ? కొందరు రైస్ తినకూడదు అంటారు, మరికొందరు పెరుగు తినకూడదు అంటారు. కొంతమంది ఫ్రూట్స్ తినాలి అని చెప్తే.. మరికొంతమంది నాన్ వెజ్ తినకూడదని సూచిస్తారు. అసలు రాత్రిపూట ఏం తినాలి ?

READ MORE: బెడ్ టైమ్ డ్రింక్స్ తో 15 రోజుల్లో బెల్లీ ఫ్యాట్ మాయం

పడుకునే ముందు ఆహారం ఎంత తేలికగా ఉంటే అంత మంచిది. తేలికైన ఆహారం వల్ల త్వరగా జీర్ణమవుతుంది. అలాగే.. కంటినిండా నిద్ర పడుతుంది. పడుకోవడానికి ముందు ఎలాంటి ఆహారం హెల్తీగా ఉంటుంది అనేదానిపై స్టడీస్ జరిగాయి. కొన్ని రకాల ఆహార పదార్థాలు పడుకోవడానికి ముందు తీసుకుంటే.. మంచిదని ఈ అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇంతకీ ఆ ఫుడ్ ఐటమ్స్ లిస్ట్ ఏంటో చూసేద్దామా...

కప్పు రైస్

కప్పు రైస్

రాత్రిపూట భోజనంలో ఒక చిన్న కప్పునిండా రైస్ తీసుకోవడం వల్ల మంచి నిద్ర వస్తుందని అధ్యయనాలు నిరూపించాయి. ఇది నిద్రలేమి సమస్య రిస్క్ ని తగ్గిస్తుంది. అలాగే కంటినిండా నిద్రపట్టేలా చూస్తుందట.

వాల్ నట్స్

వాల్ నట్స్

రాత్రి పూట వాల్ నట్స్ తీసుకోవడం వల్ల శరీరంలో బ్లడ్ లెవెల్స్ పెరుగుతాయట. అలాగే ప్రశాంత నిద్ర పొందడానికి సహాయపడతాయట.

పాప్ కార్న్

పాప్ కార్న్

ప్రతి ఒక్కరూ పాప్ కార్న్ తినడానికి ఇష్టపడతారు. కానీ కొంతమంది వీటిని రాత్రిపూట తినకూడని చెబుతుంటారు. కానీ అది తప్పు. రోజూ రాత్రి పూట పాప్ కార్న్ తీసుకోవడం వల్ల.. మెటబాలిజం స్థాయి పెరిగి.. మంచి నిద్ర పొందగలుగుతారని అధ్యయనాలు చెబుతున్నాయి.

అరటిపండు

అరటిపండు

అరటిపండులో విటమిన్ డి, క్యాల్షియం ఎక్కువగా ఉంటాయి. ఇవి మనిషికి సుఖవంతమైన నిద్ర అందించడానికి సహాయపడతాయి. ఒకవేళ అరటిపండుతోపాటు కాస్త పంచదార కలుపుకుని తీసుకుంటే.. మెగ్నీషియం పెరిగి, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవడానికి సహాయపడుతుంది.

అల్లం టీ

అల్లం టీ

రాత్రి నిద్రకు ముందు అల్లం టీ చాలా మంచిదని అనేక అధ్యయనాలు నిరూపించాయి. అల్లం టీ తాగడం వల్ల అది మీ మెదడుకి రెస్ట్ తీసుకోవాలని సూచిస్తుందతట. పనిచేయడం ఆపేయాలని సంకేతం పంపుతుంది.

పాలు

పాలు

ఒక గ్లాసు పాలు రాత్రిపూట తాగడం వల్ల.. మీ నరాలు రిలాక్స్ అవడానికి సహాయపడుతుంది. అలాగే బ్లడ్ సర్క్యులేషన్ సజావుగా సాగడానికి సహాయపడుతుంది.

ఎండు కర్జూరాలు

ఎండు కర్జూరాలు

జీర్ణక్రియ సమస్యలను తగ్గించే పదార్థాలు ఎండు కర్జూరాల్లో దాగున్నాయి. రోజూ 3 నుంచి 4 ఎండు కర్జూరాలు తినవచ్చు. దీనివల్ల నిద్ర కూడా హ్యాపీగా పడుతుంది.

సూప్

సూప్

సూప్ తాగవచ్చా ? బేషుగ్గా తాగవచ్చు. ఎందుకంటే రాత్రిపూట సూప్ తాగడం వల్ల.. జీర్ణక్రియ తేలికగా జరుగుతుంది. ఈసారి నిద్రకు ముందు వేడివేడి సూప్ ట్రై చేయండి.

ఆల్మండ్ బట్టర్

ఆల్మండ్ బట్టర్

ఒక స్పూన్ ఆల్మండ్ బట్టర్ తీసుకోవడం వల్ల మీ శరీరానికి కావల్సిన మెగ్నీషియం అందించి, జీర్ణక్రియ సజావుగా సాగడానికి సహాయపడుతుంది.

చెర్రీ జ్యూస్

చెర్రీ జ్యూస్

చెర్రీ ఫ్రూట్ లో మెలటోనిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది నిద్రపట్టడానికి సహాయపడే హార్మోన్. అలాగే ఇందులో ఉండే ఆంటీ ఆక్సిడెంట్స్ ఇన్ల్ఫమేషన్ ని తగ్గిస్తాయి. కాబట్టి వీలైనప్పుడు నిద్రకు ముందు చెర్రీ జ్యూస్ తీసుకోండి.

English summary

10 Best Foods You Should Eat Before Bed

10 Best Foods You Should Eat Before Bed. Health professionals most probably debate how a particular food is healthy for a person or sometimes not! There are so many specific foods that you must actually eat before you go to bed, the reason is they will help you to sleep good. Here is the list.
Story first published: Wednesday, February 3, 2016, 17:46 [IST]
Desktop Bottom Promotion