For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు సరిపడా నిద్రపోవడం లేదని తెలిపే భయంకరమైన లక్షణాలు..!!

By Swathi
|

10 గంటల సమయం నిద్రపోవడానికి కేటాయించి, నిద్రపోయినా.. మళ్లీ ఉదయం నిద్రమత్తుతోనే లేవాల్సి వస్తుంటుంది. ప్రతి రోజు మీరు ఇలానే లేవాల్సి వస్తుంటే.. బద్ధకంగా భావించి నిర్లక్ష్యం చేయకండి. ఆవలింతలు, అలసట వంటి లక్షణాలు.. మీరు ఆరోగ్యంగా లేరని తెలుపుతున్నాయేమో గ్రహించండి.

రోజూ సరిపడా నిద్ర, పౌష్టికాహారం హెల్తీ లైఫ్ స్టైల్ కి చిహ్నం. ఒకే ఈ రెండింటిలో ఏది గాడీ తప్పినా.. ముప్పే. జీవనశైలి ఆరోగ్యవంతంగా లేకపోవడం, చెడు అలవాట్లు, పౌష్టికాహారలోపం, వ్యాయామం లేకపోవడం, సరైన నిద్ర పొందలేకపోవడం వల్ల అనేక రకాల జబ్బులకు గురికావాల్సి వస్తుంది. నిద్రలేమి సమస్య కూడా సీరియస్ హెల్త్ డిజార్డర్లను సూచిస్తుంది.

ముఖ్యంగా.. మీలో ప్రతిరోజూ ఇక్కడ చెప్పబోయే లక్షణాలు కనిపించాయంటే.. మీరు కావాల్సినంత నిద్రపొందడం లేదని సూచిస్తాయి. ఈ లక్షణాలన్నీ.. మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేస్తారు. ఈ లక్షణాలు కనిపిస్తే.. వెంటనే అలర్ట్ అవడం మంచిది.

ఎల్లప్పుడూ ఆకలిగా

ఎల్లప్పుడూ ఆకలిగా

ఎన్ని ఇష్టమైన ఆహారాలు తింటున్నా.. మళ్లీ కాసేపటికే ఆకలిగా అనిపించడం, సంతృప్తిగా లేదు అంటే.. మీరు కంటినిండా నిద్రపొందలేదని అర్థం. నిద్రలేమి కారణంగా.. ఒత్తిడి పెరిగి, ఆకలి మరింత ఎక్కువ అవడానికి, హార్మోనల్ చేంజెస్ కి కారణమవుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే.. అన్ హెల్తీ ఫుడ్స్ ఎక్కువగా తీసుకునే అవకాశాలు ఉంటాయి.

బరువు పెరగడం

బరువు పెరగడం

ఎలాంటి కారణం లేకుండా బరువు పెరుగుతున్నారంటే.. మీరు ఎంతసేపు నిద్రపోతున్నారో.. చెక్ చేసుకోండి. నిద్రలేమి కారణంగా.. గ్రెలిన్ అనే హార్మోన్ ఆకలిని పెంచుతుంది. మీకు ఇష్టమైన, రుచికరమైన ఆహారాలు తినడం వల్ల.. క్యాలరీలు కరిగిపోక.. త్వరగా, తేలికగా బరువు పెరుగుతారు.

ఎక్కువగా యూరిన్ కి వెళ్లడం

ఎక్కువగా యూరిన్ కి వెళ్లడం

రాత్రిపూట మధ్యరాత్రి చాలా సార్లు నిద్రలేచి యూరిన్ వెళ్తున్నారా ? ప్రొస్టేట్ కారణంగా.. రాత్రిపూట తరుచుగా యూరిన్ కి వెళ్తారు. ఇలా పదే పదే నిద్రలేవడం వల్ల.. సరైన క్రమంలో నిద్రపొందడం కుదరదు.

తలనొప్పితో నిద్రలేవడం

తలనొప్పితో నిద్రలేవడం

ఉదయాన్నే.. తలనొప్పితో నిద్రలేస్తున్నారంటే.. మీరు రాత్రి సరిగా నిద్రపోలేదని తెలుపుతుంది. సరిపడా నిద్రపట్టకపోవడం, నిద్రలేమి వంటి సమస్యల వల్ల తలనొప్పి వస్తుంది.

కోపం

కోపం

ఎమోషనల్ గా హ్యాపీగా ఉండాలంటే.. నిద్రముఖ్యపాత్ర పోషిస్తుంది. నిద్ర సరిపడా అందకపోతే.. ఒత్తిడి కారణంగా కోపం పెరుగుతుంది.

సెక్స్ లైఫ్

సెక్స్ లైఫ్

కంటినిండా నిద్రపోకపోతే.. మీ భాగస్వామిని హ్యాపీగా ఉంచలేరు. మగవాళ్లకు ఈ సమస్య ఎక్కువగా ఎదురవుతూ ఉంటుంది. హార్మోనల్ చేంజెస్, టెస్టోస్టెరాన్ వల్ల.. నిద్రకు ఆటంకం ఏర్పడుతుంది. దీనివల్ల శారీరక సంబంధంపై దుష్ర్పభావం చూపుతుంది. నిద్రలేమి కారణంగా.. టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గుతాయి.

ఉదయాన్నే మళ్లీ నిద్రపోవడం

ఉదయాన్నే మళ్లీ నిద్రపోవడం

ఒత్తిడి, నిద్రలేకపోవడం వల్ల.. తెల్లవారుజామున లేదా మళ్లీ ఉదయాన్నే మళ్లీ నిద్రపోతారు. ఇది ఎక్కువగా.. చాలా ఎక్కువగా ఒత్తిడికిలోనయ్యే ఉద్యోగాలు చేసేవాళ్లలో కనిపిస్తుంది.

తెల్లవారుజామునే లేవడం

తెల్లవారుజామునే లేవడం

ఉదయాన్నే నిద్రలేవాలన్న ఆలోచనతో నిద్రపోవడం వల్ల అలారమ్ మోగకముందే.. నిద్రలేస్తారు. ఇది చాలా వరకు వయసు సంబంధిత ఇన్సోమియా వల్ల ఏర్పడుతుంది. ఉదయాన్నే నిద్రలేవడం వల్ల చాలా అలసటకు లోనవుతారు.

ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది

ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది

రాత్రిపూట సరిగా నిద్రపట్టకపోవడం, మీరు మరుసటి రోజు ఇవ్వాల్సిన ప్రెజంటేషన్ కోసం మధ్యరాత్రి వరకు కష్టపడటం వల్ల.. ఉదయం సరైన ఫలితాలు పొందలేరు. నిద్రలేమి కారణంగా.. ఏకాగ్రత కోల్పోతారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది యంగ్ జనరేషన్ లో ఎక్కువగా కనిపిస్తుంది.

తడిఆరిన నోటితో లేవడం

తడిఆరిన నోటితో లేవడం

తరచుగా కొంతమంది.. అబ్ స్ట్క్రక్టివ్ స్లీప్ అప్నియాతో బాధపడతారు. అంటే.. తడి ఆరిపోయిన గొంతుతో నిద్రలేస్తారు. దీనికి కారణంగా.. శ్వాస తీసుకోవడానికి కావాల్సిన ఎయిర్ పొందలేకపోవడమే కారణం.

English summary

10 signs you aren't getting enough sleep

10 signs you aren't getting enough sleep. Do you wake up feeling sleepy and lethargic even after ten hours of sleep? If this is how you wake up every day, then don't dismiss this as mere laziness.
Story first published:Thursday, August 4, 2016, 10:58 [IST]
Desktop Bottom Promotion