For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

"జామ ఆకు టీ" లో 10 అద్భుతమైన ప్రయోజనాలు..!!

పెరట్లో ఉన్న జామ చెట్టులోని, జామ ఆకలును కోసుకొచ్చి, వాటిని నీలిలో వేసి మరిగించడం వల్ల టీ డికాషన్ తయారవుతుంది. దీన్ని రోజులో కొద్దికొద్దిగా తాగుతుంటే మంచి ప్రయోజనాలను పొంందుతారు మనకు తెలియని, జామ ఆకుల

|

ఔషధపరమైన ఉపయోగాలు నాటు వైద్యంలో 1950 సంవత్సరం నుంచి జామ ఆకులు వాటిలోని విభాగాలు, ఔషధ లక్షణాలు పరిశోధ నలలో అంశంగా ఉన్నాయి. జామ ఆకులు, బెరడు ఆకుకూరలలో లభించే పీచు కంటే రెండింతలు పీచు జామకాయ లో ఉంటుంది . ఇది మనం ఇంట్లో పెంచుకునే దివ్య ఔషదం. అంతేకాదు భారత దేశంలో చాలా మంది ఇంటి పెరట్లో ఈ చెట్టు దాదాపు ఉంటుంది. జామ ఏడాది పొడవునా అడపాదడపా లబిస్తున్నా శీతాకాలం లోనే వీటి రుచి బలే గమ్మత్తుగా ఉంటుంది . ప్రపంచంలో అన్ని దేశాలలో ను లభిస్తుంది . . ఆసియా దేశాలలొ విసృఉతం గా పండుతుంది .

చాలా మంది జామపండును ఇష్టపడతారు. ఇది మంచి రుచిని మాత్రమే కాకుండా, చాలా రకాలుగా ఆరోగ్యానికి ప్రయోజనాలను కలిగిస్తుంది. కానీ, మనలో చాలా మందికి, జామ ఆకుల వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలియక పోవటం గమినించతగ్గ విషయంగా చెప్పవచ్చు. జామకాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఆరోగ్యానికి జామకాయ ఎంతో జామ ఆకులు కూడా అంత ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ, యంటీ ఆక్సిడెంట్ గుణాలను మరియు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను కలిగి ఉన్న జామ ఆకులు చాలా రకాల సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయి. జామఆకులు డయోరియా, క్యాన్సర్ వంటి సమస్యలను గ్రేట్ గా నివారిస్తాయి.

పెరట్లో ఉన్న జామ చెట్టులోని, జామ ఆకలును కోసుకొచ్చి, వాటిని నీలిలో వేసి మరిగించడం వల్ల టీ డికాషన్ తయారవుతుంది. దీన్ని రోజులో కొద్దికొద్దిగా తాగుతుంటే మంచి ప్రయోజనాలను పొంందుతారు మనకు తెలియని, జామ ఆకుల వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాల గురించి కింద తెలుపబడింది.

 బరువు తగ్గిస్తాయి:

బరువు తగ్గిస్తాయి:

జామఆకులతో తయారుచేసిన టీ ని రెగ్యులర్ గా తాగడం వల్ల షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయి. దాంతో ఆకలి తక్కువగా ఉంటుంది. ఈ హెల్తీ బెవరేజ్ లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. చాక్లెట్స్, ఇతర ఆహారాల మీద కోరికలు కలిగినప్పుడు, జామ టీ తీసుకుని కొద్ది రోజులు గమనించండి. తప్పనిసరిగా, క్రమం తప్పకుండా బరువు తగ్గడం గమనిస్తారు.జామ ఆకులు శరీరంలో సంక్లిష్ట పిండి పదార్థాలు, చక్కెరలు గా మారటాన్ని నివారించి, శరీర బరువు తగ్గటాన్ని ప్రేరేపిస్తుంది. జామ ఆకులుస్ కాలేయంలో కార్బోహైడ్రేట్లు విచ్చిన్నం జరిగి, అవసరమయ్యే పదార్థాలుగా మారే ప్రక్రియను నియంత్రించటం ద్వారా శరీర బరువు తగ్గటాన్ని ప్రేరేపిస్తుంది.

 డయాబెటిస్ ను మ్యానేజ్ చేయడానికి సహాయపడుతుంది :

డయాబెటిస్ ను మ్యానేజ్ చేయడానికి సహాయపడుతుంది :

హైబ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్లో ఉండచం వల్ల, డయాబెటిక్ వారికి షుగర్ లెవల్స్ కంట్రోల్ చేసుకోవడానికి సహాయపడుతుంది. జపాన్ లోని "యకుల్ట్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్" వారు జామ ఆకుల నుండి తయారు చేసిన టీపై పరిశోధనలు జరిపారు. జామ ఆకుల నుండి తయారు చేసిన టీ ని మధుమేహ వ్యాధి గ్రస్తులు తాగటం వలన వారి శరీరంలో ఆల్ఫా-గ్లూకోసైడేజ్ ఎంజైమ్ చైతన్యత తగ్గటం వలన సమర్థవంతంగా రక్తంలోని చక్కెర స్థాయిలు తగ్గుతాయి. అంతేకాకుండా, ఇది శరీరంలో సుక్రోజ్ మరియు మాల్టోజ్ గ్రహించటాన్ని తగ్గించి వేయటం వలన రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. కనీసం 12 వారాల పాటూ జామ ఆకుల నుండి తయారు చేసిన టీని తాగటం వలన ఇన్సులిన్ ఉత్పత్తి అధికం అవకుండా, శరీర రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయని ఈ పరిశోధనల ఫలితంగా వెల్లడించారు.

బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది:

బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది:

రెగ్యులర్ గా జామ ఆకు టీ తాగడం వల్ల శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గిస్తుంది. ఈ టీలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. జామఆకుతో తయారుచేసిన టీని రెగ్యులర్ గా తీసుకుంటూ, ఆహారపు అలవాట్లు, వ్యాయామం వంటి క్రమం తప్పకుండా చేస్తుంటే మంచి మంచి ఫలితం ఉంటుంది.

హార్ట్ డిసీజ్ ను తగ్గిస్తుంది:

హార్ట్ డిసీజ్ ను తగ్గిస్తుంది:

జామ ఆకుల నుండి తయారు చేసిన టీ రక్త ప్రసరణ వ్యవస్థకు మరియు గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. 2005 లో ఒక ప్రయోగశాల అధ్యయనం ప్రచురించిన దాని ప్రకారం, జామ ఆకులలో రక్త పీడనం మరియు హృదయ స్పందనల రేటును తగ్గించే సమ్మేళనాలు ఉంటాయని కనుగొనబడింది. జామ ఆకుల నుండి తయారు చేసిన టీని తాగటం వలన రక్తంలో లిపిడ్ ల స్థాయి మెరుగుపడి, చెడు కొవ్వు పదార్థాల మరియు అనారోగ్యకర ట్రై-గ్లిసరైడ్ ల స్థాయిలు తగ్గుతాయి.దాంతో గుండె సంబంధిత సమస్యలను తగ్గించుకోవచ్చు . అలాగే జామఆకులలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ హైబ్లడ్ ప్రెజర్ ను తగ్గించడంతో హార్ట్ సమస్యలను తగ్గుతాయి.

ప్రాణాంతక క్యాన్సర్ ను నివారిస్తుంది:

ప్రాణాంతక క్యాన్సర్ ను నివారిస్తుంది:

జామ ఆకు టీలో ఉండే యాంటీ యాంటీఆక్సిడెంట్స్ ప్రాణాంతక క్యాన్సర్ ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. జామ ఆకు టీలో ఉండే లికోపిన్ ఓరల్, ప్రొస్టేట్, బ్రెస్ట్ క్యాన్సర్ నివారణిగా సహాయపడుతుంది.

దంత సమస్యలను నివారిస్తుంది

దంత సమస్యలను నివారిస్తుంది

దంత క్షయం, దంతాలలో నొప్పి వంటి సమస్యలను నివారించడంలో జామ ఆకు గ్రేట్ గా సహాయపడుతుంది. ఒక కప్పు జామ ఆకుల టీని బాయియిల్ చేసి గోరువెచ్చగా అయిన తర్వాత ఆ నీటితో నోటిని రోజుకు రెండు, మూడు సార్లు శుభ్రం చేసుకోవాలి. అలాగే లేతగా ఉండే జామ ఆకులను పేస్ట్ చేసి, నొప్పి, సమస్య ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి.

జీర్ణ సమస్యలను నివారిస్తుంది:

జీర్ణ సమస్యలను నివారిస్తుంది:

జామ ఆకుల నుండి తయారు చేసిన టీ, జీర్ణాశయంలో, జీర్ణ ఎంజైమ్ ల ఉత్పత్తిని ప్రోత్సహించి, జీర్ణక్రియను మెరుగుపడేలా చేస్తుంది. జామ ఆకులలో ఉండే యాంటీ బ్యాక్టీరియా గుణాలు, జీర్ణాశయ గోడలపై ఉండే హానికర బ్యాక్టీరియాను మరియు వాటి నుండి విడుదలయ్యే రసాలను సమర్థవంతంగా తొలగిస్తుంది. జామ ఆకులు వాంతులు మరియు డోకుల నుండి తక్కువ సమయంలో ఉపశమనం కలిగిస్తాయి. డయోరియాతో బాధపడుతున్న వారు జామ ఆకుల టీ తాగడం వల్ల ఉపశమనం పొందుతారు. ఎందుకంటే జామ ఆకు టీలో ఉండే యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు, డయోరియాకు కారణమయ్యే బ్యాక్టీరియాను తొలగిస్తుంది. అలాగే ఈ టీ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల గ్యాస్ట్రో ఇంటెన్షినల్ సిస్టమ్ ఫంక్షన్ ను నార్మల్ గా ఉంచుతుంది. మ్యూకస్ ను తగ్గిస్తుంది.

స్కిన్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది:

స్కిన్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది:

జామ ఆకు టీలో ఉండే విటమిన్ సి చర్మ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఈ టీని రెగ్యులర్ గా తాగడం వల్ల ప్రీమెచ్చ్యుర్ ఏజింగ్ లక్షణాలను తగ్గిస్తుంది. జామ ఆకు టీలో బ్యాక్టీరియలను తొలగించే లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీ ఏజింగ్ లక్షణాలను కారణమయ్యే బ్యాక్టీరియాను తొలగిస్తుంది.

జుట్టు పల్చబడటాన్ని తగ్గిస్తుంది:

జుట్టు పల్చబడటాన్ని తగ్గిస్తుంది:

జుట్టు సమస్యలను నివారించడంలో జామ ఆకు టీ గ్రేట్ గా సహాయపడుతుంది. జామ ఆకు టీ జుట్టు రాలడం తగ్గించి, పల్చగా మారకుండా చేస్తుంది. జామఆకు టీని రెగ్యులర్ గా తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది

డయేరియా & రక్త విరేచనాల నుండి ఉపశమనం

డయేరియా & రక్త విరేచనాల నుండి ఉపశమనం

డయేరియా & రక్త విరేచనాలను తగ్గించుటలో జామ ఆకులు శక్తివంతమైన హెర్బల్ ఔషదంగా పని చేస్తుంది. రెండు గ్లాసుల నీటిలో ఒక పిడికెడు బియ్యపు పిండి మరియు 30 గ్రాముల జామ ఆకులను వేడి చేయండి. రోజు రెండు సార్లు ఈ మిశ్రమాన్ని తాగటం వలన విరేచనల నుండి ఉపశమనం పొందుతారు. రక్త విరేచనలను తగ్గించుటకు- 90 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద జామ వేర్లను మరియు ఆకులను కలిపి 20 నిమిషాల పాటూ వేడి చేయండి. ఈ మిశ్రమాన్ని నీటిలో కలిపి, రక్త విరేచనాలు తగ్గే వరకు రోజు తాగండి..

English summary

10 Surprising Guava Leaf Tea Benefits and Uses..!!

If in the backyard you have a guava tree, you can gain lots of benefits from the healing characteristics of young guava leaves by making a tea from them. You just have to take some young guava leaves, then thoroughly wash them. After that soak them in a cup with hot water. After some shot time, discard the leaves and drink the guava leaf tea sip by sip. Below are few of the things that are amazing and it is known that a mug of guava leaf tea can offer them.
Desktop Bottom Promotion