For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు ఖచ్చితంగా తెలుసుకోవల్సిన కరివేపాకు పొడిలోని అద్భుత ప్రయోజనాలు..!!

|

కర్ణుడు లేని భారతం,కరివేపాకు లేని కూర ఒకటేనని అంటారు మన పెద్దలు. భారతదేశంలో కరివేపాకు లేని తాలింపు ఉండదంటే అతిశయోక్తి కాదు. "కూరలో కరివేపాకులా తీసిపారేసేరు" అనే సామెత నానుడు ఉంది. కరివేపాకు చెట్టులో అన్నిటికీ ఔషధపరమైన ఉపయోగాలున్నాయి. కరివేపాకు ఆకులు, కరివేపాకు కాయలు, వేరు పై బెరడు, కాండం పై బెరడు ఇలా అన్నిటినీ ఔషధ రూపంలో వాడతారు. కరివేపాకు మంచిదని అందరికీ తెలుసు. కానీ, ఇష్టంలేకో లేక అలవాటులో పొరపాటో... కరివేపాకుని తినకపోవడానికి సవాలక్ష కారణాలు వెతుక్కుంటారు.

అయితే దాని ఔషధ గుణాలను తెలుసుకున్న వారెవరూ ఇక అలా తీసిపారేయరు. ఇందులోని ఔషధ గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కరివేపాకులో లభించే ల్యూటిన్‌ అనే యాంటి ఆక్సిడెంట్‌ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఫోలిక్‌ యాసిడ్‌, నియాసిన్‌, బీటా కెరటిన్‌, ఇనుము, క్యాల్షియం, పాస్ఫరస్‌, పీచు, మాంసకృత్తులు, కార్బొహైడ్రేట్‌లు కరివేపాకులో పుష్కలంగా లభిస్తాయి.

కరివేపాకులో శరీరానికి ఎంతో అవసరమైన కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లూ, బి విటమిన్, కెరోటిన్ పుష్కలంగా ఉండటమే కాదు.. తాజా కరివేపాకు నుంచి ప్రొటీన్లు, కొవ్వు పదార్ధాలు, పిండి పదార్ధాలు, పీచు పదార్ధాలు, ఖనిజ లవణాలు, క్యాలరీలు కూడా లభిస్తాయి. ఇలా పౌష్టిక విలువలలో ఏ కూరకీ ఏమాత్రం తీసిపోని కరివేపాకుని కేవలం రుచి గురించి మాత్రమే వాడతాం మనం. పూర్వమయితే కరివేపాకు పొడులు, కరివేపాకు పచ్చడి అంటూ కరివేపాకు వినియోగం కొంచెం ఎక్కువగానే వుండేది.

కూరలో కరివేపాకు వేస్తే ఆ రుచి అద్భుతం. అలానే కరివేపాకు వలన మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. కరివేపాకు ఆకులు, కరివేపాకు కాయలు, వేరు పై బెరడు, కాండం పై బెరడు ఇలా అన్నిటినీ ఔషధ రూపంలో వాడతారు. కరివేపాకు మంచిదని అందరికీ తెలుసు. ఇది తెలిసినా కూడా.. కూరలో కరివేపాకుని పక్కన పెట్టి తినడం అందరికీ అలవాటు. వంటింట్లో కరివేపాకు లేకపోతే చాలా కూరలకు రుచి, సువాసన రాదని అంటారు. క‌రివేపాకుతో ఆరోగ్య లాభాలు అన్నీ..ఇన్నీ కాదు. కానీ చాలామంది కూర‌ల్లో క‌రివేపాకుని తీసి ప‌డేస్తుంటారు. కానీ ఇది మంచిది ప‌ద్ధ‌తి కాదు. క‌రివేపాకుని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. కరివేపాకు పొడి చాలా వేడి అ౦టారు. కానీ రోజూ వేడి అన్న౦ లో ఒక స్పూను పొడి వేసుకుని నెయ్యి కలుపుకుని తి౦టే మ౦చిది. కరివేపాకు పొడి వలన ఉపయోగాలు:

 జీర్ణ శక్తిని పెంచుతుంది:

జీర్ణ శక్తిని పెంచుతుంది:

చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ఏ వయసులో ఉన్నవారు అయినా.. కరివేపాకు పొడిని అన్నంలో కలుపుకుని తినడం వలన ముఖ్యంగా జీర్ణ వ్యవస్థని శుభ్ర పరిచి.. జీర్ణ వ్యవస్థ వృద్ధికి తోడ్పడుతుంది. ఆకలి పెరుగుతుంది. అజీర్తి సమస్యలు తగ్గుతాయి. కరివేపాకు పొడి అంటే కేవలం ఒట్టి కరివేపాకు మాత్రమే కాదు, మెంతులు, మిరియాలు, జీలకర్ర వంటి మసాల దినుసులు ఉపయోగించి తయారుచేస్తారు.

అనీమియా నివారిస్తుంది:

అనీమియా నివారిస్తుంది:

కరివేపాకులో ఐరన్, ఫోలిక్ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. శరీరంలో ఐరన్ లోపంతోనే కాదు, శరీరం ఐరన్ గ్రహించకపోయినా..అనీమియాకు దారితీస్తుంది. కరివేపాకు పొడిలో కొద్దిగా తేనె మిక్స్ చేసి ప్రతి రోజూ ఉదయం పరగడుపు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. కర్జూరాలతో కలిపి.. కొన్ని కరివేపాకు ఆకులను ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా తీసుకుంటే.. అనీమియాను న్యాచురల్ గా నివారించవచ్చు.

 డయాబెటిక్ వారికి మంచిది:

డయాబెటిక్ వారికి మంచిది:

కరివేపాకులోని కొయినిజన్ వంటి కొన్ని రసాయనాలు షుగర్ వ్యాధిగ్రస్తుల పాలిట వరం. అదెలా అంటే.. తీసుకున్న ఆహారాన్ని గ్లూకోజ్‌ గా మార్చి రక్తంలో చక్కెర శాతాన్ని పెంచేందుకు క్లోమగ్రంధి నుంచి విడుదలయ్యే అల్థాఎమిలేజ్ అనే ఎంజైమే కారణం. కరివేపాకులోని ప్రత్యేక పదార్ధాలు ఈ ఎంజైమ్ స్రావాన్ని తగ్గిస్తాయని గుర్తించారు నిపుణులు.జన్యుపరంగా లేదా స్థూలకాయం కారణంగా వచ్చే మధుమేహాన్ని కరివేపాకు ద్వారా నియంత్రివచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

ఓవర్ వెయిట్ తగ్గిస్తుంది:

ఓవర్ వెయిట్ తగ్గిస్తుంది:

కరివేపాకును ముద్దగా నూరి మోతాదుకు టీ స్పూన్ చొప్పున మజ్జిగతోగాని నీళ్లతోగాని రెండుపూటలా తీసుకుంటుంటే స్థూలకాయం తగ్గి తద్వారా మధుమేహం నియంత్రణలోకి వస్తుంది. కరివేపాకు పండ్లను లేదా కరివేపాకు చెట్టు బెరడును కషాయంగా కాచి తీసుకుంటే అధిక రక్తపోటు వల్ల వచ్చే రుగ్మతలు తగ్గుతాయి. ప్రతిరోజూ ఉదయం 10 కరివేపాకుల చొప్పున 3 నెలలపాటు తింటే స్థూలకాయం, అలాగే రక్తంలో చక్కెర శాతం కూడా తగ్గుతాయంటారు ఆయుర్వేద వైద్యులు.

డయేరియాకు.:

డయేరియాకు.:

డయేరియా వంటి వాటికి రెండు టీస్పూన్ల కరివేపాకు రసం బాగా పనిచేస్తుందిట. అలాగే మజ్జిగలో కాసిన్ని కరివేపాకుల్ని నలిపి లేదా రసం తీసి వేస్తే కడుపులోని బాధలు ఏవైనా తగ్గుతాయిట. అలాగే ఒట్టి కరివేపాకుని వేయించిగానీ, ఎండబెట్టిగానీ పొడిచేసి పెట్టుకుని రోజూ ఓ స్పూన్ తేనెతో ఓ స్పూన్ కరివేపాకు పొడిని కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.

లివర్ డ్యామేజ్ ను నివారిస్తుంది:

లివర్ డ్యామేజ్ ను నివారిస్తుంది:

ఆల్కహాల్ తీసుకునే వారు రెగ్యులర్ డైట్లో తప్పనిసరిగా కరివేపాకు చేర్చుకోవాల్సిందే. ఇందులో ఉండే కెంఫెరెల్ మరియు యాంటీఆక్సిడెంట్స్ విటమిన్ ఎ, సి లతో కలిసినప్పుడు లివర్ డ్యామేజ్ కాకుండా రక్షణ కల్పిస్తుంది . అలాగే ఇందులో ఉండే యాంంటీఆక్సిడెంట్స్ లివర్ మీద ఆక్సిడేటివ్ స్ట్రెస్, హానికరమైన టాక్సిన్స్ ను తొలగిస్తుంది.

హార్ట్ సమస్యలను తగ్గిస్తుంది:

హార్ట్ సమస్యలను తగ్గిస్తుంది:

కరివేపాకు పొడిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల రక్తప్రసరణ పెరుగుతుంది. దాంతో గుండె వ్యాధులు నిరోధించడంలో కరివేపాకు అద్భుతమైన ప్రయోజనాలు అందిస్తుంది. తాజా కరివేపాకు ఆకులను.. ఉదయాన్ని పరగడుపున ప్రతిరోజూ తినాలి. లేదా కరివేపాకు పొడిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

చర్మ వ్యాధులు రాకుండా చేస్తుంది:

చర్మ వ్యాధులు రాకుండా చేస్తుంది:

ఈ మాట వినడానికి కొత్తగా అనిపించినా, ఇది మాత్రం వాస్తవం. ఎందుకంటే, కరివేపాకులో ఉండే స్ట్రాంగ్ యాంటీఆక్సిడెంట్స్ , పవర్ ఫుల్ యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ మరియు యాంటీ ప్రోటోజోల్ లక్షణాలు గ్రేట్ గా సహాయపడుతాయి. ఇవి సాధారణ చర్మ సమస్యలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. స్కిన్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది.

 తెల్లజుట్టు నివారణకు

తెల్లజుట్టు నివారణకు

నేటి యూత్‌కు చిన్న వయస్సులోనే తెల్లజుట్టు వస్తోంది. తెల్లజుట్టుకు చెక్ పెట్టాలంటే రోజూ మనం తీసుకునే ఆహారంలో కరివేపాకును తీసుకుంటే సరిపోతుంది. ఉసిరికాయ ముక్కలు, పుదీనా, కరివేపాకును ఓ గుడ్డలో చుట్టి సూర్య కిరణాలు పడేలా మూడు రోజుల పాటు ఉంచండి. మూడు రోజులు తర్వాత పొడి చేసుకుని.. ఈ పొడితో వారానికి ఒక సారి తలకు ప్యాక్ వేసుకుని ఎండిన తర్వాత వాష్ చేసుకోవాలి. ఉసిరి పొడి ప్యాక్‌ను ఎలా తయారు చేయాలంటే.. నిమ్మరసం, బీట్‌రూట్ రసం, పెరుగు, టికాషన్‌తో ఈ పొడిని చేర్చి తలకు రాసుకోవాలి. తద్వారా మీ జుట్టు దృఢంగా ఉంటుంది. ఇలా చేస్తే తెల్లజుట్టు మాయమైపోతుంది. ఆహార నియ‌మాలు పాటించి న‌ప్పుడే బాడీ ఫిట్ గా ఉంటుంది.

కీమో థెరఫీ సైడ్ ఎఫెక్ట్స్ ను తగ్గిస్తుంది:

కీమో థెరఫీ సైడ్ ఎఫెక్ట్స్ ను తగ్గిస్తుంది:

కొన్ని పరిశోధనల ప్రకారం కీమోథెరఫీ, రేడియో థెరిఫీల ప్రభావం లేకుండా సహాయపడుతుంది. ఇది క్రోమోజోమ్స్ డ్యామేజ్ అవ్వకుండా రక్షణ కల్పించడం మాత్రమే కాదు, శరీరంలో బోన్ మారో మరియు రాడికల్స్ ను ఉత్పత్తిని పెంచుతుంది. దాంతో క్యాన్సర్ రిస్క్ ఉండదు.

సూచన:

సూచన:

ఇది తెలిసినా కూడా.. కూరలో కరివేపాకుని పక్కన పెట్టి తినడం అందరికీ అలవాటు. మరి కరివేపాకుని అలా తినలేని వారు.. ఎలా తినాలి? అని పెద్దలు అలోచించి మనకు మంచి వంటకం రూపంలో అందించారు. అదే 'కరివేపాకు పొడి'. ఇది ఎప్పటి నుండో వాడకంలో ఉన్నా.. నేడు మారిన ఫాస్ట్ ఫుడ్ కల్చర్ లో కరివేపాకు వాడుకం తగ్గి పోయింది. మరి కొద్దిగా కష్టపడి ఈ పొడి ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం.

కావలసిన పదార్ధాలు:

కావలసిన పదార్ధాలు:

కరివేపాకు : 1 కట్ట పచ్చిశనగపప్పు : 1/2 కప్పు వెల్లుల్లి రెబ్బలు : 12 పెద్దవి లేక 20 చిన్నవి పచ్చిమిరపకాయలు : 4 లేక 5 మెంతులు : 1/2 టీ స్పూన్ జీలకర్ర : 1 టీ స్పూన్ చింతపండు : సరిపడినంత ఆవాలు : 1/2 టీ స్పూన్ నూనె : 1 టేబుల్ స్పూన్ మిరియాలు : 1 టేబుల్ స్పూన్ ఉప్పు : తగినంత ఇంగువ : చిటికెడు

కరివేపాకు పొడి తయారీ విధానం:

కరివేపాకు పొడి తయారీ విధానం:

మొదట పాన్ పెట్టి అందులో నూనె వేసి ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసి వేయించి పచ్చిశనగపప్పు, మిరియాలు, చింతపండు వేసి చిన్న మంట మీద వేయించాలి. పచ్చిశనగపప్పు రంగు రాగానే పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు వేసి పచ్చిమిరపకాయలు బాగా వేగిపోతున్నాయని అనిపించినప్పుడు.. కరివేపాకు, ఇంగువ వేసి కరివేపాకు బాగా వేగేవరకూ వేయించాలి. కరివేపాకును ముట్టుకుంటే విరిగిపోయేంత వరకూ వేయించాలి. ఉప్పు వేసి వేపి దానిని చల్లార్చి మిక్సీ పట్టుకుని పొడి చేసుకోవాలి. ఇలా చేసుకున్న పొడిలో ఏమైనా ఉప్పు తగ్గితే కొద్దిగా ఉప్పు కలుపుకోవచ్చు.

English summary

13 amazing health benefits of curry leaves powder you should know about!

Curry leaves, known as kadi patta in hindi, is one of the common seasoning ingredients that is added to almost every dish to enhance its taste and flavour. However, rather than eating this humble leaf (which is slightly bitter in taste), most of us just throw it away. But have you ever wondered if you have to throw this leaf then why did our mothers (even our ancestors) use this leaf to every food preparation.
Story first published: Monday, November 7, 2016, 18:00 [IST]