For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రోజూ ఉదయం పరగడపున హాట్ వాటర్ విత్ హనీ తాగితే అద్భుత ప్రయోజనాలు

హనీ వాటర్ త్రాగితే ఏమవుతుంది? హార్ట్ వాటర్ మరియు లెమన్ వాటర్ త్రాగడం వల్ల అనేక ప్రయోజనాలు పొందవచ్చని మనందరికీ తెలిసిన విషయమే..మరి మీరు హనీ విత్ వాటర్ ను ఎప్పుడైనా ట్రై చేశారా? హాని వాటర్ లో కూడా చాలా

|

మన జీవన విధానంలో వేడి నీళ్ళు కొన్ని అద్భుతాలనే చేస్తాయి. ఇంకా ఎక్కువగా నీరుత్రాగడం వల్ల కూడా మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది . వేడి నీళ్ళు లేదా గోరువెచ్చనీ నీరు త్రాగడం వల్ల అందులో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయన్న విషయం చాలా మందికి తెలియదు . కాబట్టి, ఇంతటి ఎఫెక్టివ్ వేడినీళ్ళను వదిలేసి, చల్లటి నీరు త్రాగడంలో ప్రయోజనం లేదు.

ఆరోగ్య నిపుణుల ప్రకారం, ఒక రోజుకు 7-8గ్లాసుల నీరు, ప్రతి ప్రాణికీ అవసరం అవుతుంది. అందువల్ల చాలా మంది కోల్డ్ వాటర్ లేదా నార్మల్ వాటర్ తీసుకోవడం జరుగుతుంటుంది. అయితే, కోల్డ్ వాటర్ లేదా నార్మల్ వాటర్ కు బదులు వేడి నీళ్ళు లేదా గోరువెచ్చని నీటితో తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అంధిస్తుందని ఆరోగ్య నిపుణులు అభిప్రాయం. అయితే చాలా మందికి వట్టి వేడి నీళ్లు తాగడం ఇష్టముండదు , కాబట్టి, అందులో కొద్దిగా తేనె జోడించి తాగితే మరింత అద్భుతమైన ప్రయోజనాలను అందిపుచ్చుకుంటారు.

13 Amazing things Happens When You Drink Honey With Warm Water

హనీ వాటర్ త్రాగితే ఏమవుతుంది? హార్ట్ వాటర్ మరియు లెమన్ వాటర్ త్రాగడం వల్ల అనేక ప్రయోజనాలు పొందవచ్చని మనందరికీ తెలిసిన విషయమే..మరి మీరు హనీ విత్ వాటర్ ను ఎప్పుడైనా ట్రై చేశారా? హాని వాటర్ లో కూడా చాలా ఆశ్చర్యం కలిగించే అనేక ప్రయోజనాలున్నాయి.

మనకు నేచురల్ గా అందుబాటులో ఉండే తేనెలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉండటం వల్ల అనేక ప్రయోజనాలను అందిస్తాయి. ముఖ్యంగా ఉదయం నిద్రలేవగానే ఒక గ్లాసు వేడి నీళ్ళల్లో తేనె మిక్స్ చేసి త్రాగడం వల్ల మరింత ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు.

ముఖ్యంగా వార్మ్ హనీ వాటర్ త్రాగడం వల్ల అలసట తగ్గుతుంది, వ్యాధినిరోధకత పెరుగుతుంది మరియు చర్మం మీద గాయాలను నివారిస్తుంది మరియు బరువు తగ్గిస్తుంది. అంతే కాదు, వీటితో పాటు మరిన్ని ప్రయోజనాలు తెలుసుకోవడానికి ఈ క్రింది స్లైడ్ క్లిక్ చేయాల్సిందే...

వ్యాధినిరోధకత పెరుగుతుంది

వ్యాధినిరోధకత పెరుగుతుంది

తేనెలో ఉండే విటమిన్స్, మినిరల్స్ మరియు ఇతర న్యూట్రీషియన్స్ వల్ల వ్యాధినిరోధకత పెరుగుతుంది.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

తేనె జీర్ణక్రియకు కూడా చాలా మేలు చేస్తుంది. తేనె రెగ్యులర్ గా తినడం వల్ల పొట్ట ఉబ్బరాన్ని తగ్గించుకోవచ్చు.

బాడ్ బ్రీత్ నివారిస్తుంది

బాడ్ బ్రీత్ నివారిస్తుంది

గోరు వెచ్చని హానీ వాటర్ లో తేనె మిక్స్ చేయడం వల్ల చెడు శ్వాసను నివారిస్తుంది. ముఖ్యంగా ఈ మూడింటి మిశ్రమం యొక్క నీరు త్రాగడం వల్ల ఫలితం మరింత బెటర్ గా ఉంటుంది. ముఖ్యంగా బాడ్ బ్రీత్ నివారిస్తుంది. దంతసంరక్షణగా సహాయపడుతుంది.

హార్ట్ సమస్యలను నివారిస్తుంది

హార్ట్ సమస్యలను నివారిస్తుంది

తేనెలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ హార్ట్ సంబంధిత సమస్యలను నివారిస్తుంది . ఇది ఒక పెద్ద లాభం.

బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి

బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి

గోరువెచ్చని హానీ వాటర్ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ మరింత బెటర్ గా ఉంటుంది.

బరువు తగ్గించడానికి

బరువు తగ్గించడానికి

తేనెలోని నేచురల్ స్వీట్ గుణం ఉండటం వల్ల బరువు తగ్గించడంతోపాటు, కొద్దిగా తేనె తినడం వల్ల ఆకలి ఎక్కువగా అనిపించదు

గొంతునొప్పి, దగ్గు, మరియు శ్వాస సమస్యలు

గొంతునొప్పి, దగ్గు, మరియు శ్వాస సమస్యలు

గొంతునొప్పి, దగ్గు, మరియు శ్వాస సంబంధిత సమస్యలు నివారించడంలో హానీ వాటర్ చాలా మంచిది. హానీ వాటర్ తో ఇది ఒక ఉత్తమ ప్రయోజనం.

జీవక్రియలు మరింత వేగవంతం

జీవక్రియలు మరింత వేగవంతం

వర్కౌట్స్ తర్వాత గోరువెచ్చని హానీ వాటర్ త్రాగడం వల్ల జీవక్రియలు మరింత వేగవంతం అవుతాయని కొందరు హెల్త్ ఎక్స్ పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు.

శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది:

శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది:

హాట్ వాటర్ ను తీసుకోవడం వల్ల శరీరంను డిటాక్సిఫై చేస్తుంది మీరు అజీర్తి సమస్యలను తగ్గించుకోవాలన్నా లేదా శరీరంలోని మలినాలను బయటకు నెట్టివేయాలంటే ప్రతి రోజూ క్రమం తప్పకుండా ఉదయం మరియు రాత్రి పడుకొనే ముందు వేడి నీళ్ళు త్రాగడం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. వేడి నీళ్ళు త్రాగడం వల్ల శరీరంలో వేడి పుట్టి, చెమట పట్టడం ప్రారంభం అవుతుంది దాంతో శరీరంలోని టాక్సిన్స్ చెమట రూపంలో బయటకు నెట్టివేస్తుంది. మరింత మంచి ఫలితాల కోసం నిమ్మరసం మరియు తేనెను మిక్స్ చేసుకోవచ్చు.

మొటిమలు మచ్చలు తొలగిస్తుంది:

మొటిమలు మచ్చలు తొలగిస్తుంది:

రెగ్యురల్ గా క్రమంతప్పకుండా వేడి నీళ్ళు తీసుకోవడం ద్వారా మీ శరీరాన్ని తేమగా మరియు వెచ్చగా ఉంచుకోవచ్చు. ఇది డ్రై మరియు ఫ్లాకీ స్కిన్ కు చాలా గొప్పగా సహాయపడుతుంది. మరియు ఆరోగ్యకరమైన చర్మం నిర్వహించడానికి అద్భుతంగా సహాయపడుతుంది. ఇది శరీరం మొత్తంలో బ్లడ్ సర్కులేషన్ పెంచి శరీరానికి పింక్ గా చర్మఛాయను అంధిస్తుంది. అంతే కాదు ముఖంలో మొటిమలు మచ్చలు ఏర్పడకుండా సహాయపడుతుంది. హాట్ వాటర్ తో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల చర్మంలోపలి నుండి శుభ్రం చేస్తుంది.

శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది:

శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది:

హాట్ వాటర్ వల్ల మరో అద్భుతమైనటువంటి ప్రయోజనం, ఇది బ్లడ్ సర్కులేషన్ ను పెంచుతుంది. ముఖ్యంగా బాడీఫ్యాట్ ను కరిగిస్తుంది. అదే సమయంలో నాడీవ్యవస్థలో కొవ్వు కణాలను విచ్ఛిన్నం చేయడంలో అద్భుతంగా సహాయపడుతుంది.

బౌల్ మూమెంట్ ను మెరుగుపరుస్తుంది:

బౌల్ మూమెంట్ ను మెరుగుపరుస్తుంది:

వేడి నీళ్ళను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా క్రోనిక్ సమస్యలతో పోరాడి, మలబద్దక సమస్య నుండి ఉపశమనం కలిగిస్తుంది. తిన్న ఆహారం ప్రేగుల్లో స్మూత్ గా ముందుకు జరిగి జీర్ణం అవ్వడానికి హాట్ వాటర్ లేదా గోరువెచ్చని నీళ్ళు అద్భుతంగా సహాయపడుతుంది. కాబట్టి, ప్రతి రోజూ ఉదయం నిద్రలేచిన వెంటనే, గోరువెచ్చని నీటిని కాలీ కడుపున తీసుకోవాలి.

చిన్న వయస్సులో వృద్ధాప్యం యొక్క లక్షణాలను నివారిస్తుంది:

చిన్న వయస్సులో వృద్ధాప్యం యొక్క లక్షణాలను నివారిస్తుంది:

ప్రతి రోజూ రెగ్యులర్ గా వేడీనీళ్ళు త్రాగడం వల్ల అకాల వృద్ధాప్యంను నివారించి యవ్వనంగా మరియు మెరిసేటా చర్మకాంతిని పొందవచ్చు. ఇది శరీరం నుండి టాక్సిన్స్ ను బయటకు నెట్టడం వల్ల చర్మకణాలను రిపేర్ చేస్తుంది. అది హానికరమైన ఫ్రీరాడిక్స్ మీద ఎఫెక్టివిగ్ గా పనిచేస్తుంది. హాట్ వాటర్ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల స్కిన్ ఎలాసిటి పెరుగుతుంది.

English summary

13 Amazing things Happens When You Drink Honey With Warm Water

Honey is anti-bacterial, it can shield us against certain minor infections. That is why drinking honey with hot water in the morning may help you a lot.
Story first published: Thursday, December 8, 2016, 7:47 [IST]
Desktop Bottom Promotion