For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హార్ట్ బర్న్- ఎసిడిటిని నివారించే ఆయుర్వేదిక్ రెమెడీస్ ..

|

పైకి మామూలుగానే కనిపించినా కడుపులో తట్టుకోలేని మంట... అగ్నిపర్వతాలు రగులుతున్నాయా? అన్నంత బాధ... కంటి నిండా నిద్ర పట్టదు.. స్థిమితంగా కూర్చోనివ్వదు.. ఇదంతా యాసిడిటి మహిమ. ఈ ఆధునిక జీవనంలో నూటికి అరవై శాతానికి పైగా యాసిడిటితో బాధపడుతున్నవారే.

క్రమపద్ధతిలోని ఆహారపు అలవాట్లు యాసిడిటి దారితీస్తాయి. కొన్ని రకాల మందులు వాడడం వలన కూడా కడుపులో మంట వస్తుంది. ముఖ్యంగా ఆహారం ద్వారానే ఎక్కువచ్చే ఎసిడిటి మందులకన్నా ఇంటి వైద్యమే మేలు. అవి ఏవేంటో చూద్దాం...

తులసి ఆకులు:

తులసి ఆకులు:

తులసి ఆకుల్లో ఉండే కర్మినేటివ్ లక్షణాల వల్ల ఎసిడిటి నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. గ్యాస్ మరియు వికారం తగ్గిస్తుంది. సింపుల్ గా కొన్ని తులసి ఆకులను నోట్లో వేసుకుని నమలి మింగాలి. లేదా తులసి ఆకులను నీటిలో వేసి మరిగించి తులసి టీ తాగడం వల్ల ఎసిడిటి వల్ల తక్షణ ఉపశమనం పొందుతారు.

దాల్చిన్ చెక్క:

దాల్చిన్ చెక్క:

జీర్ణ సమస్యలను నివారించడంలో దాల్చిన చెక్క గ్రేట్ గా సహాయపడుతుంది, ఇది నేచురల్ యాంటాసిడ్ గా పనిచేస్తుంది . స్టొమక్ గ్యాస్ ను నివారిస్తుంది. అర టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని ఒక కప్పు వేడి నీటిలో వేసి బాగా మరిగించి గోరువెచ్చగా తయారయిన తర్వాత రోజులో రెండు మూడు సార్లు తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. లేదా దాల్చిన చెక్క పొడిని సూప్స్ లేదా సలాడ్స్ లో చేర్చుకోవాలి.

బట్టర్ మిల్క్ :

బట్టర్ మిల్క్ :

ఎసిడిటిని నివారించే హోం రెమెడీస్ లో బట్టర్ మిల్క్ ఒకటి. ఇందులో లాక్టిక్ యాసిడ్స్ పుష్కలంగా ఉండటం వల్ల పొట్టలోని ఎసిడిటి లక్షణాలను నార్మల్ చేస్తుంది.

కొన్ని మెంతులను నీటిలో నానబెట్టి, మెత్తగా పేస్ట్ చేసి బట్టర్ మిల్క్ లో మిక్స్ చేసి తాగడం వల్ల పొట్ట నొప్పి మరియు ఎసిడిటి నుండి తక్షణ ఉపశమనం పొందవచ్చు.

ఆపిల్ సైడర్ వెనిగర్ :

ఆపిల్ సైడర్ వెనిగర్ :

ఆపిల్ సైడర్ వెనిగర్ నేచురల్ ఆయుర్వేదిక్ రెమెడీ. ఆపిల్ సైడర్ వెనిగర్ లో ఆల్కనైజింగ్ ఎఫెక్ట్స్ కలిగి ఉంటాయి. ఇది స్టొమక్ ఎసిడిటిని నివారిస్తుంది.

ఒక కప్పు నీటిలో ఒకటి లేదా రెండు టీస్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ మిక్స్ చేసి రోజుకు ఒకటి రెండు సార్లు తాగుతుంటే మంచి ఫలితం ఉంటుంది.

లవంగాలు:

లవంగాలు:

ఎలివేటివ్ ఎసిడిటి లక్షణాలను నివారించడంలో , గ్యాస్ తగ్గించడంలో గ్రేట్ రెమెడీస్ లో లవంగాలు బెస్ట్, ఇది పొట్టలో హైడ్రోలిక్ యాసిడ్ ను పెంచుతుంది. దాంతో ఎసిడిటి తగ్గించుకోవచ్చు. పొట్టలో యాసిడ్స్ తగ్గడం వల్ల ఎసిడిటి పెరుగుతుంది.

భోజనం తర్వాత నోట్లో రెండు మూడు లవంగాలు వేసుకుని నమలడం వల్ల పొట్టలో జీర్ణరసాలు ఉత్పత్తి అవుతాయి, దాంతో త్వరగా జీర్ణం అవుతుంది ఎసిడిటి సమస్యలను తగ్గిస్తుంది. అలాగే బ్యాడ్ బ్రీత్ సమస్య ఉండదు.

జీలకర్ర:

జీలకర్ర:

జీలకర్ర మీ జీర్ణ ప్రక్రియ మరియు శక్తి ఉత్పత్తిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా మీ నిరోధక వ్యవస్థ పెంచడానికి సహాయపడుతుంది. మరియు వాయువు మరియు ఇతర గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గిస్తుంచడానికి సహాయపడుతుంది. లాలాజల ఉత్పత్తి ఉద్దీపన ఆ లక్షణాలను కలిగి ఉంటుంది. నీళ్ళలో జీలకర్ర వేసి బాగా మరిగించి తర్వాత చల్లారిన తర్వాత తీసుకోవడం వల్ల తక్షణ ఉపశమనం కలుగుతుంది. .

బ్లాక్ పెప్పర్:

బ్లాక్ పెప్పర్:

పొట్ట ఉదరంలో బర్నింగ్ సెన్సేషన్ ను నివారించడంలో బ్లాక్ పెప్పర్స్ గ్రేట్ గా సహాయపడుతాయి. అజీర్థి వల్ల కలిగే పొట్టనొప్పి, కడుపు మంటను తగ్గించడం కోసం కొన్ని మిరియాలను పొడి చేసి, మజ్జిగలో మిక్స్ చేసి తాగడం వల్ల ఇన్ స్టాంట్ గా ఉపశమనం కలిగిస్తుంది.

యాలకలు:

యాలకలు:

ఆయుర్వేద ఆచారాల్లో , ఏలకులు మూడు దోషాలను కఫా , పిత్తాశయ మరియు వాత సమతుల్యం చేసే ఒక ఆహారంగా భావిస్తున్నారు . ఈ మసాలా మీ జీవక్రియ పెంచడానికి మరియు మీ శరీరం యొక్క సామర్థ్యాన్ని మెరుగుపర్చడానికి సహాయం చేసి కొవ్వును కరిగిస్తుంది. ఇది జీర్ణక్రియ ఉద్దీపన మరియు కడుపు దుస్సంకోచాలకు బాగా సహాపడుతుంది. తీపి రుచిని మరియు స్వల్ప చల్లదనం కారణంగా ఆమ్లత సంబంధం గుండె, కడుపు బర్నింగ్ సంచలనాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది .

అల్లం:

అల్లం:

అల్లంతో నియంత్రణ: యాసిడ్ రిఫ్లెక్షన్ కు అల్లం ఒక ఉత్తమ ఆహారం. అల్లంను యాంటీఇన్లమేటరీ మరియు జీర్ణకోశ వ్యాధులకు కొరకు పురాతన కాలం నుండి చికిత్సకు ఉపయోగిస్తున్నారు. అల్లంలో ఉండే జింజరాల్ మరియు షోగోల్స్ జీర్ణక్రియను ప్రోత్సహిస్తాయి . పొట్ట ఉదరభాగంలో గ్యాస్ చేరకుండా నివారిస్తుంది.యాసిడ్ రిఫ్లెక్షన్ కు అల్లం ఒక ఉత్తమ ఆహారం. అల్లంను యాంటీఇన్లమేటరీ మరియు జీర్ణకోశ వ్యాధులకు కొరకు పురాతన కాలం నుండి చికిత్సకు ఉపయోగిస్తున్నారు.అల్లం Gingeressential పోషకాలు మరియు జీర్ణ సహాయపడుతుంది శోషణ మరియు సమానత్వం మెరుగుపరుస్తుంది . ఇది కూడా మీ ఆహారంలో మాంసకృత్తుల విచ్ఛిన్నంకు సహాయపడుతుంది .

బెల్లం:

బెల్లం:

బెల్ల జీర్ణశక్తిని పెంచడంలో గ్రేట్ గా సమాయపడుతుంది. ఇందులో ఉండే ఆల్కలైన్ గుణాలు , స్టొమక్ ఎసిడిటిని నివారిస్తుంది. భోజనం చేసిన ప్రతి సారి, చిన్న బెల్లం ముక్కను నోట్లో వేసుకుని తినడం వల్ల ఎసిడిటి తగ్గిస్తుంది. డయాబెటిక్ వారికి ఇది సూటబుల్ కాదు.

పుదీనా ఆకులు:

పుదీనా ఆకులు:

కొద్దిగా పుదీనా ఆకులను శుభ్రం చేసి, నీటిలో వేసి బాగా మరగ కాచి, ఆ నీటిని గోరువెచ్చగా భోజనం తర్వాత తాగాలి. ఇలా చేస్తుంటే బ్లోటింగ్ మరియు క్రాంప్స్ నుండి ఉపశమనం కలిగిస్తుంది. నరాలను బలోపేతం చేసి తలనొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది.పుదీనా ఆకులు మౌత్ ఫ్రెషన్నర్ గా బాగా ఉపయోగపడుతాయి. పుదీనాను వివిధ వంటకాల్లో గార్నిష్ కోసం ఉపయోగిస్తున్నారు. కొద్దిగా పుదీనా ఆకులను శుభ్రం చేసి, నీటిలో వేసి బాగా మరగ కాచి, ఆ నీటిని గోరువెచ్చగా భోజనం తర్వాత తాగాలి. ఇందులో ఎసిడిటి తగ్గించే ఔషధ గుణగణాలు పుష్కలంగా ఉన్నాయి. జీర్ణక్రియను మెరుగుపరిచి ఎసిడిటి తగ్గిస్తుంది

సోంపు:

సోంపు:

కడుపు ఉబ్బరంను నయం చేసే లక్షణాలు సోంపులో పుష్కలంగా ఉన్నాయి. అందుకే భోజనం చేసిన వెంటనే సోంపు నములుతుంటారు కొందరు. ఇది ప్రేగులో గ్యాస్ ను మరియు కడుపుబ్బరాన్ని తగ్గిస్తాయి.

కొత్తిమీర:

కొత్తిమీర:

కొత్తిమీర మరో ఎఫెక్టివ్ హోం రెమెడీ . కడుపుబ్బరాన్ని క్షణాల్లో పోగొడుతుంది. ఒక కప్పు కొత్తిమీర టీ త్రాగడం వల్ల కడుపుబ్బరం తగ్గతుంది. జీర్ణశక్తి పెరుగుతుంది . పొట్టనొప్పి తగ్గిస్తుంది.

పెరగులో

పెరగులో

పెరగులో ఒక మంచి ల్యాక్టో బాసిల్లస్ ఉండి, ఇది ప్రొబయోటిక్ గా పనిచేస్తుంది. ఇది డీస్ట్రెస్సింగ్ స్టొమక్ బ్లోటింగ్ ను తగ్గిస్తుంది. పాలలాగ ఇది అపానవాయువుకు కారణం కాదు. మరియు అసౌకర్యానికి గురిచేయదు.

నిమ్మరసం:

నిమ్మరసం:

కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు, కొంత మంది ద్రవాలు త్రాగడాన్ని నిరాకరిస్తుంటారు. కాబట్టి, కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు కొన్ని ద్రావాలను కొద్దిగా కొద్దిగా త్రాగడం చాలా అవసరం. ముఖ్యంగా, గోరువెచ్చని నీటికి నిమ్మరసం మిక్స్ చేసి త్రాగడం వల్ల ఒక అద్భుత మ్యాజిక్ చేస్తుంది. త్రాగిన 30నిముషాల్లోనే మీరు ఫలితాన్ని గమనించవచ్చు. ఈ డ్రింక్ ను మీరు ప్రతి రోజూ ఉదయం తీసుకోవడం మొదలు పెడితే మరింత ఉత్తమ ఫలితాలను పొందచ్చు.

ఉసిరి:

ఉసిరి:

విటమిన్ సి పుష్కలంగా ఉండే ఈ ఉసిరి గాయపడిన కడుపు లైనింగ్ మరియు అన్నవాహిక నయం చేయడంలో సహాయపడుతుంది. ఉసిరికాయ పెచ్చులను పొడి చేసి అరచెంచాడు మోతాదుగా గోరువెచ్చని నీళ్ళతో కలిపి తీసుకోవాలి.

చల్లటి పాలు:

చల్లటి పాలు:

2-3టేబుల్ స్పూన్ల చల్లటి పాలు ఎసిడిటి నుండి తక్షణ ఉపశమనం ఇస్తుంది.ఒక గ్లాసు పాలు తాగితే.. తిన్న ఆహారం శరీరానికి అందేలా తోడ్పడుతుంది. అంతేకాదు పాలల్లో ఉండే పోషకాలు.. జీర్ణక్రియ సజావుగా సాగడానికి సహాయపడతాయి.

English summary

17 Instant Ayurvedic Remedies for Acidity

17 Instant Ayurvedic Remedies for Acidity,There are many more simple ingredients available in your kitchen or refrigerator that can be used to get relief from stomach acidity.
Story first published: Friday, July 8, 2016, 16:53 [IST]
Desktop Bottom Promotion