For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పిల్లలు పెద్దలు అందరిలో ఆకలిని పెంచే ఆయుర్వేదిక్ రెమెడీస్

|

ఆకలి లేకపోవడం అనేది మనం చాలా మందిలో చూస్తూనే ఉంటాము. ముఖ్యంగా చిన్న పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. భోజనం చేయడానికి చాలా మారం చేస్తుంటాము. దాంతో పిల్లల్లో న్యూట్రీషయన్ లోపం ఏర్పడుతుంది. దాని ద్వారా పిల్లల్లో వ్యాధినిరోధకశక్తి త్వరగా తగ్గి వివిధ రకాల జబ్బులను ఎదుర్కోవల్సి వస్తుంది.

దాంతో పెద్దలు పిల్లల్ని తీసుకొని డాక్టర్ల చుట్టూ తిరుగుతుంటారు. వారి పిల్లలు భోజనం చేయడం లేదని వారికి ఆకలి పెరగడానికి అవసరం అయ్యే మందులను, టానిక్స్ ను సూచించమని కోరుతుంటారు. ఇలాంటి ఇంగ్లీష్ మందులను అనుసరించడం కంటే, కొన్ని నేచురల్ గా అందుబాటులో ఉండే హోం రెమెడీలను ఉపయోగించడం వల్ల ఆకలి పెరుగుతుంది మరియు ఆ వ్యాత్యాసాన్ని కూడా మీరు గమనించవచ్చు. పిల్లల్లో మార్పు వస్తుంది.

ముఖ్యంగా మీరు తీసుకొనే ఆహారంను ప్రత్యేకంగా గమనించినట్లైతే, అది ఖచ్చితంగా మీకు, లేదా పిల్లలకు ఇష్టంలేనివై కూడా ఉండవచ్చు. రెగ్యులర్ డైట్లో ఒకే విధమైన కూరలు, దుంపలు చేయడం వల్ల ఆకలి లేనట్లు ప్రదర్శిస్తుంటారు . ఇలాంటి పరిస్థితులను నిర్లక్ష్యం చేయకుండా, మీరు వెంటనే ఆకలి పెరగడానికి కొన్ని కొన్ని ఆయుర్వేదిక్ హోం రెమెడీల గురించి తెలుసుకోవాలి. ఈ ఆయుర్వేదిక్ రెమెడీస్ వివిధ రకాల వ్యాధులను నివారిస్తుంది . ఈ క్రింది సూచించిన ఆయుర్వేదిక్ రెమెడీస్ ను ఆహార నిపుణులు సూచిస్తున్నారు..

5 Ayurvedic Remedies To Increase Appetite

ఆమ్లా: ఆయుర్వేదంలో ఆమ్లా ఎక్కువగా సూచిస్తున్నారు.ఆయుర్వేదంలో రిజువేటింగ్ ప్రొపర్టీస్ ఎక్కువగా ఉన్నాయి. ఇది మీ శరీరానికి టానిక్ లా పనిచేస్తుంది. వికారం తగ్గిస్తుంది. వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది . ఇది శరీరంలోని జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది . లివర్ ను క్లీన్ చేస్తుంది . ఆమ్లాలో ుండే విటమిన్ సి వ్యాధినిరోధక శక్తి పెంచడానికి గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది యాంటీ డయాబెటిక్, గ్యాస్ట్రో ఇంటెన్షినల్ మరియు సెరెబ్రల్ లక్షణాలు కలిగి ఉన్నాయి.

ఉపయోగించే విధానం: ప్రతి రోజూ ఉదయం రెండు టేబుల్ స్పూన్ల ఆమ్లా జ్యూస్ ను తీసుకోవడం వల్ల ఆకలి పెరుగుతుంది

5 Ayurvedic Remedies To Increase Appetite

జింజర్: అల్లం: అల్లం అజీర్తిని మరియు వికారాన్ని నివారించడానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది . అంతే కాదు ఇది ఆకలిని పెంచడంలో ఉత్తమ ఆయుర్వేదిక్ రెమెడీ . కాబట్టి, పచ్చి అల్లంను వంటలకు వాడం లేదా టీలో చేర్చడం లేదా అలాగే కొద్దిగా నమిలి తినడం ద్వారా ఉత్తమ ఫలితం ఉంటుంది. గర్భినీలు దీన్ని తీసుకోవడానికి ముందు డాక్టర్ ను సంప్రదించాలి .

ఉపయోగించే విధానం: అల్లం టీ తయారుచేసుకుని రోజులో అవసరమైనన్ని సార్లు ఉపయోగించాలి.

5 Ayurvedic Remedies To Increase Appetite

హరిటాకి: హరిటాకిలో వివిధ రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి.. ఇది గ్యాస్ట్రో ఇంటెన్సినల్ సమస్యలను నివారించి ఆకలిని పెంచుతుంది. దాంతో శరీరంలో టాక్సిన్స్ ను తొలగించి జీర్ణ వ్యవస్థను తిరిగి చురుకుగా పనిచేసేందుకు సహాయపడుతుంది .

ఉపయోగించే విదానం: ఒక టీస్పూన్ హరిటాకి పౌడర్ ను నీటిలో మిక్స్ చేసి తాగాలి.

5 Ayurvedic Remedies To Increase Appetite

యాలకలు: అజీర్తి, ఎసిడిటితో బాధపడే వారు ఆప్టిటైటిస్ మరియు గ్యాస్ట్రిక్ సమస్యలను ఎదుర్కవోడానికి యాలకలు గ్రేట్ గా సహాయపడుతాయి .. ఇది మంచి టానిక్ గా పనిచేస్తుంది . జీర్ణవాహిక యొక్క పనితీరు మెరుగుపరుస్తుంది. దాంతో ఆకలి పెరుగుతుంది. జీర్ణ రసాలు పెరుగుతాయి. దాంతో జీర్ణ సమస్యలు తగ్గుతాయి.

రెగ్యులర్ డైట్ లో యాలకలను చేర్చుకోవాలి. కార్డమమ్ టీ తయారుచేసి తాగాలి.

5 Ayurvedic Remedies To Increase Appetite

ఆల్ఫాల్ఫా:
ఆయుర్వేదం ప్రకారం ఆల్ఫాల్ఫా జీర్ణవాహికను శుభ్రం చేయడానికి మరియు ఆకలి పెంచడానికి గ్రేట్ గా సమాయపడుతుంది. ఒక టేబుల్ స్పూన్ ఆల్ఫాల్పాను తీసుకోవాలి.

నీరు మరిగించి, అందులో ఆల్ఫాల్పా ఆకులను వేయాలి . 20నిముషాలు అలాగే ఉంచి తర్వాత టీరూపంలో తీసుకోవాలి. ఇది గ్యాస్ట్రో ఇంటెన్షినల్ వ్యాధులను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

English summary

5 Ayurvedic Remedies To Increase Appetite

Food is the basic necessity of life. It is the basic requisite for survival. Without food, our body cannot function properly. Food is the tonic that helps in proper functioning of different mechanisms of the body. A normal person would often have cravings to eat food or would feel hungry.
Story first published: Tuesday, June 21, 2016, 10:36 [IST]
Desktop Bottom Promotion