For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అలర్ట్: ఎముకలను బలహీనంగా మార్చే కామన్ డైట్ మిస్టేక్స్..!

డైట్ అండ్ ఎక్సర్ సైజ్.. ఈ రెండూ ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. కాబట్టి.. ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం.. అనే విషయాలపై ఎప్పటికప్పుడు ఓ కన్నేసి ఉంచడం చాలా అవసరం. కొన్ని ఆహారాలు ఎముకలను డ్యామేజ్ చేస్తాయి.

By Swathi
|

డైట్ అండ్ ఎక్సర్ సైజ్.. ఈ రెండూ ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. కాబట్టి.. ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం.. అనే విషయాలపై ఎప్పటికప్పుడు ఓ కన్నేసి ఉంచడం చాలా అవసరం. కొన్ని రకాల ఆహారాలు ఎముకల ఆరోగ్యాన్ని డ్యామేజ్ చేస్తాయి.

bones

ఎముకల ఆరోగ్యం చాలా కీలకమైనది. శరీరం మొత్తాన్ని మోసే బాధ్యత ఎముకలకే ఉంటుంది. ఇవి స్ట్రాంగ్ గా ఉన్నప్పుడే.. మనం హెల్తీగా ఉంటాం. చేతులు, కాళ్లూ వంటి ముఖ్య భాగాలు.. ఎముకలతో సంధానమై ఉంటాయి. కాబట్టి.. మనం మన ఎముకల ఆరోగ్యంపై చాలా శ్రద్ధ తీసుకోవాలి.

కొన్ని రకాల ఆహారాలు.. మన ఎముకలపై చాలా దుష్ర్పభావం చూపుతాయి. మన డైట్ మిస్టేక్స్ ఎముకలు బలహీనంగా మారడానికి కారణమవుతాయట. ఎలాంటి డైట్ మిస్టేక్స్ ఎముకలను డ్యామేజ్ చేస్తాయో తెలుసుకుని.. వాటికి దూరంగా ఉందాం..

సోడా

సోడా

ఎముకలు బాగా బలంగా డెవలప్ అయ్యే వయసులో కూల్ డ్రింక్స్ తాగితే.. అవి డ్యామేజ్ అవుతాయి. సోడాలలో ఉండే పాస్ఫరస్ క్యాల్షియం ఉపయోగించుకునే సత్తాని కోల్పోయేలా చేస్తుంది. అలాగే ఎముకల గ్రోత్ కి అవసరమయ్యే మెగ్నీషియం అందకుండా అడ్డుకుంటుంది.

కాఫీ

కాఫీ

రోజుకి 3 నుంచి 4 కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగే అలవాటు ఉంటే.. వెంటనే తగ్గించుకోవాలి. లేదంటే.. క్యాల్షియం ఎక్కువ తీసుకోవాలి. లేదంటే.. కాఫీ క్యాల్షియంను తగ్గించి.. ఎముకలు బలహీనం అవడానికి కారణమవుతుంది. కాఫీ బదులుగా టీ తాగడం మంచిది.

చాక్లెట్

చాక్లెట్

చాక్లెట్స్ లో ఫ్లేవనాయిడ్స్, క్యాల్షియం, పోషకాలు ఉంటాయి. ఇవి ఎముకల సాంద్రతను పెంచుతాయి. అలాగే ఇందులో ఆక్సలేట్, షుగర్ ఉంటుంది. ఇవి ఎముకలు బలహీనంగా మారడానికి కారణమవుతాయి. కాబట్టి రోజుకి ఒక చాక్లెట్ మాత్రమే తినాలి.

ఆల్కహాల్

ఆల్కహాల్

ఎక్కువగా తాగేవాళ్లకు ఎముకలు బలహీనంగా ఉంటాయి. తరచుగా పడిపోతుండటం, ఎక్కువగా ఫ్య్రాక్చర్స్ అవుతుండటం వల్ల.. ఎముకలను బలహీనంగా మారుస్తాయి.

మాంసం, స్వీట్స్

మాంసం, స్వీట్స్

ఎక్కువగా స్వీట్స్, ఫ్యాట్స్, రెడ్ మీట్ తీసుకోకూడదు. వైట్ ఫ్లోర్, బ్రెడ్ కి కూడా దూరంగా ఉండాలి.

తీసుకోవాల్సినవి

తీసుకోవాల్సినవి

పాస్తా, వైట్ బ్రెడ్ ద్వారా ప్రొటీన్, కార్బొహైడ్రేట్స్ పొందవచ్చు. ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే వోల్ గ్రెయిన్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ని డైట్ లో చేర్చుకోవాలి.

English summary

6 common diet mistakes that are Killing your bones

6 common diet mistakes that are Killing your bones. Diet and exercise are the two most important pillars of a healthy life.
Desktop Bottom Promotion