For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వాంతులు అయిన తర్వాత తీసుకోకూడని ఆహారాలు

వాంతులు అయిన తర్వాత వికారం, ఎసిడిటీ సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటప్పుడు సరైన ఫుడ్ తీసుకుంటే.. ఆ ఫీలింగ్ నుంచి బయటపడవచ్చు. కాబట్టి.. వాంతులు అయిన తర్వాత.. ఎలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలో చూద్దాం..

By Swathi
|

వాంతులు అయిన తర్వాత.. చాలా అసౌకర్యంగా ఉంటుంది. ఏది తినాలన్నా భయం. కానీ.. కొన్ని తినాలని, కొన్ని డ్రింక్స్ తీసుకోవాలని ఉంటుంది. కానీ.. వాంతులు అయిన తర్వాత తీసుకునే ఆహారాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

vomiting

వాంతులు అయిన తర్వాత వికారం, ఎసిడిటీ సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటప్పుడు సరైన ఫుడ్ తీసుకుంటే.. ఆ ఫీలింగ్ నుంచి బయటపడవచ్చు. కాబట్టి.. వాంతులు అయిన తర్వాత.. ఎలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలో చూద్దాం..

ఎక్కువ నీళ్లు

ఎక్కువ నీళ్లు

వాంతులు అయిన తర్వాత.. ఎంత వీలైతే అన్ని నీళ్లు తాగుతుంటారు. కానీ.. ఎక్కువ నీళ్లు తాగితే.. మళ్లీ వాంతులయ్యే అవకాశం ఉంటుంది. హెవీగా, పొట్ట ఉబ్బరంగా ఉంటుంది. కాబట్టి.. వాంతులు అయిన వెంటనే కొన్ని మాత్రమే నీళ్లు తాగాలి. లేదా ఐస్ క్యూబ్ ని నోట్లో పెట్టుకోవాలి.

పచ్చి కూరగాయలు లేదా స్మూతీలు

పచ్చి కూరగాయలు లేదా స్మూతీలు

వాంతులు అయిన వెంటనే పచ్చి కూరగాయలు తీసుకుంటే.. పొట్టలో ఇబ్బంది కలుగుతుంది. అలాగే వెజిటబుల్ స్మూతీలకు కూడా దూరంగా ఉండాలి.

టీ లేదా కాఫీ

టీ లేదా కాఫీ

వాంతులు అయిన తర్వాత కాఫీ, టీలకు పూర్తీగా నో చెప్పాలి. ఇది.. ఎసిడిటీ, విాకరం కలిగిస్తాయి. అలాగే.. మరోసారి వాంతులు అవడానికి అవకాశం ఉంటుంది.

స్పైసీ ఫుడ్

స్పైసీ ఫుడ్

వాంతులు అయిన వెంటనే స్పైసీ ఫుడ్ తీసుకోవడం మంచిది కాదు. వాంతులు అయిన తర్వాత కొన్ని గంటలు స్పైసీ ఫుడ్ కి దూరంగా ఉండాలి. ఇవి తేలికగా జీర్ణం కాలేవు.. దీనివల్ల ఎసిడిటీ సమస్య ఎదురవుతుంది.

సాల్టీ ఫుడ్స్

సాల్టీ ఫుడ్స్

వాంతులు అయిన కొన్ని గంటల తర్వాత.. ఆకలిగా అనిపిస్తుంది. వడాపావ్ లేదా ఫ్రెంచ్ ఫ్రైస్ టెంప్ట్ చేస్తాయి. కానీ ఈ ఫుడ్స్ పొట్టలో ఇబ్బంది కలిగించి.. వికారానికి కారణమవుతాయి. కాబట్టి.. వాంతులు అయిన వెంటనే వీటికి దూరంగా ఉండాలి.

కూల్ డ్రింక్స్

కూల్ డ్రింక్స్

కార్బోహైడ్రేట్స్ ఉండే.. కూల్ డ్రింక్స్ ని వాంతులు అయిన వెంటనే తీసుకోవడం వల్ల.. పొట్టలో సమస్యలకు కారణమవుతాయి. మళ్లీ వాంతులు అవవచ్చు. కాబట్టి.. వీటికి దూరంగా ఉండండి.

English summary

6 foods to avoid after vomiting

6 foods to avoid after vomiting. One of the most uneasy and uncomfortable feeling is how you feel right after vomiting or throwing up.
Story first published: Monday, October 24, 2016, 16:42 [IST]
Desktop Bottom Promotion