For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  వండిన ఆహార పదార్థాలు తిరిగి రీహీట్ చేయకూడని ఆహారాలు..

  By Sindhu
  |

  పొద్దున్న వండిన దాన్ని మధ్యాహ్నం తినేటప్పుడు మళ్లీ ఒకసారి వేడిచేసుకుని తినే అలవాటు ఉంటుంది చాలామందికి. అయితే ఎప్పుడు వండింది అప్పుడే తినాలి కాని మళ్లీ మళ్లీ వేడిచేసుకుని తినడం అనారోగ్యానికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. మరీ ముఖ్యంగా ఓ 7 పదార్ధాలనయితే అస్సలంటే అస్సలు వేడిచేయకూడదని బ్రిటీష్‌ ఫుడ్‌ స్టాండర్డ్‌ ఏజెన్సీ, యూరోపియన్‌ ఫుడ్‌ ఇన్ఫర్మేషన్‌ కౌన్సిల్‌ ఒక నివేదిక విడుదల చేశాయి. ఆ వివరాల్లోకి వెళ్తే...

   చికెన్:

  చికెన్:

  కోడి మాంసాన్ని ఉడికించేటప్పుడు ముక్కలు అన్ని వైపులా ఉడికేలా జాగ్రత్త పడాలి. లేదంటే చికెన్‌లో కొద్దిమొత్తంలో ఉండే సాల్మొనెల్లా బ్యాక్టీరియా మీ పొట్టకు పనిచెప్తుంది. మైక్రోవేవ్‌లో త్వరగా అవుతుంది కాని అన్ని వైపులా సరిగా ఉడకదు. దాంతో చికెన్‌లో ప్రొటీన్లు భిన్నంగా విడిపోయి పొట్టను ఇబ్బందిపెడతాయి.

  గుడ్లు:

  గుడ్లు:

  గుడ్డును రీహీట్ చేయడం వల్ల గుడ్డులో ఉండే ప్రోటీనులు కోల్పోతాయి . గుడ్లు కూడా టాక్సిక్ గా మారుతాయి . జీర్ణ సమస్యలు తలెత్తుతాయి . కాబట్టి ఉడికించిన లేదా ఆమ్లెట్ వంటివి రీహీట్ చేయకపోవడమే మంచిది.

  మష్రుమ్:

  మష్రుమ్:

  పుట్టగొడుగుల్ని సరిగ్గా నిల్వ చేయకపోయినా, తిరిగి వేడిచేసినవి తిన్నా పొట్ట పాడయిపోతుంది. అయితే వాటిని ఫ్రిజ్‌లో ఉంచిన 24 గంటల లోపయితే 70 డిగ్రీల సెంటిగ్రేడు ఉష్ణోగ్రత వద్ద వేడిచేయొచ్చు.

  పొటాటో:

  పొటాటో:

  ఉడికించిన బంగాళాదుంపలను గది ఉష్ణోగ్రతలో ఉంచడం వల్ల క్లొస్ర్టీడియమ్‌ బొటులినమ్‌ అనే బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. దుంపల్ని తిరిగి వేడిచేసినా బ్యాక్టీరియా నాశనం కాదు. అందుకని బంగాళాదుంపని ఉడికించాక చల్చార్చి ఫ్రిజ్‌లో పెట్టుకోవాలే తప్ప బయట ఉంచొద్దు.

  పాలకూర:

  పాలకూర:

  పాలకూరలో అధిక గాఢత కలిగిన నైట్రేట్‌ ఉంటుంది. తరువాత ఇదే నైట్రోజమైన్స్‌గా మారుతుంది. ఇది కార్సినోజెనిక్‌. ఈ పదార్థం రక్తప్రసరణ ద్వారా ఆక్సిజన్‌ సరఫరా చేసే సామర్థ్యంపై ప్రభావం చూపుతుంది. దీన్నే ‘‘బేబీ బ్లూ సిండ్రోమ్‌'' అంటారు. ఈ వ్యాధి ఎక్కువగా పిల్లల్లో కనిపిస్తుంది.

  బీట్ రూట్:

  బీట్ రూట్:

  నైట్రేట్స్ ను రీహీట్ చేయడం వల్ల ఈ పోషకాలను మీరు కోల్పోతారు . బీట్ రూట్ ను ఒక సారి వండిన తర్వాత తిరిగి వేడిచేయకూడదు. ముందురోజు ఉడికించి, లేదా వండిన దాన్ని తిరిగి రీహీట్ చేయకుండా ఫ్రిజ్ లో పెట్టి, తినడానికి ముందు రెండు మూడు గంటలు ముందు బయట తీసిపెడితే సరిపోతుంది.

  రైస్:

  రైస్:

  మనం ప్రతిరోజూ తినే అన్నాన్ని కూడా వేడిచేసి తినకూడదు. అయితే దీనికంటే కూడా అన్నం నిల్వ చేయడం అనేది చాలా ముఖ్యం. ఫుడ్‌ స్టాండర్డ్‌ ఏజెన్సీ చెప్పినదాని ప్రకారం - గది ఉష్ణోగ్రతలో అన్నం పెడితే ‘‘స్పోర్స్‌(బీజ పరాగములు) రెట్టింపవడానికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించినట్టే. అలాంటి అన్నాన్ని తినడం వల్ల వాంతులు, విరేచనాలు అవుతాయి. తిరిగి వేడిచేయడం వల్ల హానికలిగించే విషపదార్థాలు నాశనం కూడా కావు. అందుకని ఎప్పుడు ఆకలి అనిపిస్తే అప్పుడు వండుకోండి.

  English summary

  7 Foods That Should Not Be Reheated

  7 Foods That Should Not Be Reheated,It is common thing in our house holds to reheat the left over food after being inside fridge for a long time. People who are working do this activity more. They take out the food and quickly reheat it in microwave without knowing its health consequences.
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more