For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఛాతీలో మంట, ఎసిడిటీకి చెక్ పెట్టే హోం రెమిడీస్

By Swathi
|

ఎసిడిటీ.. ! ఇది వయసుతో సంబంధం లేకుండా అందరినీ వేధిస్తున్న సమస్య. చాలామంది చిన్న వయసులోనే ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారు. ఛాతీలో మంట, రాత్రంతా నిద్రలేకుండా చేయడం, గుండె సంబంధిత అనారోగ్యమేమో అన్నంత హడలెత్తిస్తుంది ఎసిడిటీ. కానీ ఛాతిలో మంటగా ఉన్నప్పుడు ఖంగారు పడకుండా.. హోం రెమిడీస్ ఫాలో అవడం మంచిది.

కాస్త మసాలా ఫుడ్ లేదా ఎక్కువ ఫ్యాట్ ఫుడ్ లేదా బయట ఆహారం హెవీగా తీసుకున్నప్పుడు, తిన్న ఆహారం సరిగా అరుగుదల కానప్పుడు ఎసిడిటీ సమస్య ఎదురవుతుంది. అయితే ఈ సమస్య నుంచి బయటపడటానికి చాలామంది మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. కానీ.. వాటికి బదులు హోం రెమిడీస్ ఉపయోగిస్తే మంచి ఫలితాలుంటాయి. ఎసిడిటీ నుంచి విముక్తి పొందడానికి ఎలాంటి చిట్కాలు ఫాలో అవ్వాలో ఇప్పుడు చూద్దాం..

పుదీనా ఆకును ఉడికించిన నీళ్లు

పుదీనా ఆకును ఉడికించిన నీళ్లు

ఈ కాలంలో చాలామందికి న్యాచురల్ రెమిడీస్ పై అవగాహన ఉండదు. అయితే ఇలాంటి న్యాచురల్ టిప్సే అత్యంత వేగంగా పనిచేస్తాయి. కాబట్టి ఛాతీలో మంటగా అనిపించినప్పుడు పుదీనా ఆకులు మరిగించిన నీళ్లు తాగితే వెంటనే ఉపశమనం ఉంటుంది.

గ్రీన్ టీ లేదా హెర్బల్ టీ

గ్రీన్ టీ లేదా హెర్బల్ టీ

టీ తాగందే రోజు గడవదు చాలామందికి. అయితే.. గ్రీన్ టీ లేదా హెర్బల్ టీ తాగితే మంచిది. ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నప్పుడు కప్పు టీ తాగండి. వెంటనే రిలాక్సెషన్ అనిపిస్తుంది.

కారం

కారం

తీసుకునే ఆహారం స్పైసీగా ఉంటే.. ఎక్కువగా ఎసిడిటీ సమస్య ఎదురవుతుంది. కాబట్టి తక్కువ మోతాదులో కారం తీసుకోవాలి. పచ్చళ్లకు దూరంగా ఉండాలి.

కొబ్బరి నీళ్లు

కొబ్బరి నీళ్లు

కొబ్బరి నీళ్లు ఎంత ఎక్కువ తాగితే అంత మంచిదని ఎక్స్ పర్ట్స్ సూచిస్తున్నారు. జీర్ణ క్రియ సజావుగా జరగడానికి ఇది ఎంతగానో సహకరిస్తుంది. దీనివల్ల ఎసిడిటీ సమస్య దరిచేరదు.

లవంగం

లవంగం

గుండెలో మంటగా అనిపిస్తే వెంటనే లవంగం చప్పరించాలి. దీనివల్ల వెంటనే ఎసిడిటీ సమస్య తగ్గిపోతుంది. జీర్ణసంబంధ సమస్యలు కూడా తగ్గిపోతాయి.

వెజిటబుల్స్

వెజిటబుల్స్

మునక్కాయలు, బీన్స్, గుమ్మడికాయ, క్యాబేజీ, క్యారెట్ ను డైట్ లో చేర్చుకుంటే.. ఎసిడిటీ నివారించవచ్చు.

పాలు

పాలు

ఒక గ్లాసు పాలు తాగితే.. తిన్న ఆహారం శరీరానికి అందేలా తోడ్పడుతుంది. అంతేకాదు పాలల్లో ఉండే పోషకాలు.. జీర్ణక్రియ సజావుగా సాగడానికి సహాయపడతాయి.

English summary

7 home remedies for acidity for quick relief !

7 home remedies for acidity for quick relief ! Suffer from acidity or acid reflux too often and are tired of having antacids? Well, there are natural remedies you can get rid of the problem.
Story first published: Saturday, February 20, 2016, 17:17 [IST]
Desktop Bottom Promotion