For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆల్కహాల్ తీసుకోవడం మానేస్తే శరీరంలో జరిగే మార్పులు..

By Swathi
|

జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలకు పరిష్కారం, కారణం రెండింటికీ.. ఆల్కహాల్ కారణమని.. ఒక సామెత ఉంది. ఇది ఎంతవరకు నిజమో కానీ.. చాలామంది మాత్రం వాళ్లకు కాస్త ఆనందం వచ్చినా, బాధ కలిగినా, తీవ్ర మనస్తాపానికి లోనైనప్పుడు.. ఆల్కహాల్ తాగితే రిలాక్స్ అవుతామని ఫీలవుతారు.

అయితే.. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల తాత్కాలికంగా తమకున్న బాధను మరిచిపోయేలా చేసి.. ఫన్నీగా అనింపిచేలా చేయవచ్చు.. కానీ.. దాని వల్ల వచ్చే అనర్థాలు మాత్రం అనేకం ఉంటాయి. చాలా ప్రాబ్లమ్స్ కి ఆల్కహాలే చక్కటి పరిష్కారమని చాలామంది భావిస్తారు.

అంతేకాదు.. అకేషనల్ గా వారానికి ఒకసారి ఒక గ్లాసు వైన్ తీసుకోవాలని భావిస్తారు. అలాగే.. వీకెండ్ వచ్చిందంటే.. వారం అంతా కష్టపడినందుకు ఫ్రెండ్స్ తో ఒక పెగ్ వేసి రిలాక్స్ అవ్వాలని భావిస్తారు. ఇలా మొదలుపెట్టి.. అది ప్రతిరోజూ అలవాటుగా మారిపోతుంది. డ్రింక్ లేకుండా.. ఒకరోజు కూడా గడపలేని పరిస్థితి ఫేస్ చేస్తారు.

ఇలాంటి అడిక్షన్ కి లోనయినవాళ్లు.. మళ్లీ దాన్ని మానేయడం అంత సులభమైన పని కాదు. కాబట్టి.. ఆల్కహాల్ తాగడం వల్ల వచ్చే అనర్థాలు చాలామందికి తెలిసే ఉంటాయి. కానీ.. ఆ అలవాటు మానుకోలేకపోతుంటారు. కానీ.. ఆల్కహాల్ మానేయడం వల్ల శరీరంలో వచ్చే మార్పులు తెలుసుకుంటే.. మీరు తేలికగా ఆల్కహాల్ ని మానేస్తారు.

ఫిట్ గా మారతారు

ఫిట్ గా మారతారు

ఆల్కహాల్ లో ఎక్కువ షుగర్ ఉంటుంది. స్టార్చ్ ఉంటుంది. న్యూట్రీషన్ వ్యాల్యూ ఉండదు. కాబట్టి.. ఆల్కహాల్ ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల.. మీ బరువు పెరుగుతుంది. నెమ్మదిగా మెటబాలిజం తగ్గుతుంది. ఆల్కహాల్ మానేస్తే.. మీ శరీరం ఫిట్ గా మారడం మీరు గమనిస్తారు.

సెక్స్ లైఫ్

సెక్స్ లైఫ్

ఆల్కహాల్ కి అలవాటు పడటం వల్ల.. ఆ వ్యక్తి లైంగిక సామర్థ్యంపై దుష్ర్పభావం ఉంటుంది. అలాగే.. మహిళల సెన్సివిటీని అర్థం చేసుకోలేకపోతారు. దీనివల్ల.. మహిళలు మీతో సెక్స్ ఎంజాయ్ చేయలేకపోతారు. కాబట్టి.. ఆల్కహాల్ మానేస్తే.. బెడ్ రూమ్ లో మంచి లైఫ్ దొరుకుతుంది.

హెల్తీ లివర్

హెల్తీ లివర్

చాలామందికి తెలుసు ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల లివర్ డ్యామేజ్ అవుతుంది. అలాగే కణాలు, టిష్యూస్ కూడా డ్యామేజ్ అవుతాయి. కాబట్టి.. ఆల్కహాల్ మానేస్తే.. లివర్ హెల్తీగా ఉంటుంది.

ఇమ్యునిటీ

ఇమ్యునిటీ

ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఇమ్యునిటీ తగ్గిపోతుంది. రెగ్యులర్ గా తీసుకోకుండా, అకేషనల్ గా తీసుకునేవాళ్లలో కూడా.. ఇమ్యునిటీ దెబ్బతింటుంది. కాబట్టి.. ఆల్కహాల్ తీసుకోకపోతే.. ఇమ్యునిటీ పవర్ పెరిగి, వ్యాధులకు దూరంగా ఉండవచ్చు.

క్యాన్సర్ రిస్క్

క్యాన్సర్ రిస్క్

ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్ల రిస్క్ ఉంటుంది. కొలాన్, ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలుంటాయి. కాబట్టి ఆల్కహాల్ కి దూరంగా ఉంటే.. ప్రాణాంతక క్యాన్సర్ కి దూరంగా ఉండవచ్చు.

మానసిక ఆరోగ్యం

మానసిక ఆరోగ్యం

ఆల్కహాల్ తీసుకోవడం వల్ల వచ్చే అనర్థాల్లో డిప్రెషన్ ఒకటి. ఆందోళన, మానసిక సమస్యలు పెరుగుతాయి. అదే ఆల్కహాల్ కి దూరంగా ఉండటం వల్ల మరింత హ్యాపీగా, ప్రశాంతంగా ఉండవచ్చు.

స్ట్రోక్ రిస్క్

స్ట్రోక్ రిస్క్

ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటే.. ధమనుల్లో కొలెస్ట్రాల్ పేరుకుంటుంది. దీనివల్ల కార్డియోవాస్క్యులర్ డిసీజ్ ల రిస్క్ ఎక్కువగా ఉంటుంది. రెగ్యులర్ గా ఆల్కహాల్ తీసుకునేవాళ్లకు హార్ట్ ఎటాక్, స్ట్రోక్ రిస్క్ ఉంటుంది. కాబట్టి ఆల్కహాల్ మానేస్తే..గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండవచ్చు.

English summary

7 Things That Happen To Your Body When You Stop Drinking Alcohol!

7 Things That Happen To Your Body When You Stop Drinking Alcohol! Well, it is just the matter of perspective. Many a times, people feel that drinking alcohol may help them enjoy certain social events, forget about certain painful experiences, etc.
Story first published:Tuesday, July 12, 2016, 17:47 [IST]
Desktop Bottom Promotion