For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లోయర్ బ్యాక్ పెయిన్ పై అపోహలు.. వాస్తవాలు..

|

బ్యాక్ పెయిన్(వెన్ను నెప్పి) సర్వ సాధారణం.నిజం చెప్పాలంటే 80 శాతం మంది ఎప్పుడో ఒకప్పుడు దీనితో బాధపడతారు.బ్యాక్ పెయిన్ లక్షణాలు అందరిలో ఒకేలాగ ఉండవు.కొంతమందిలో ఈ నెప్పి బాగా ఉంటే కొంత మందిలో తక్కువగా ఉంటుంది.

మనలో చాలామంది ఎప్పుడో ఒకప్పుడు నడుము నొప్పి బాధను అనుభవించినవారే. ప్రతి 10 మందిలో కనీసం 8 మంది ఏదో సమయంలో దీని బారినపడుతున్నట్టు అంచనా. ఈ నడుము నొప్పిపై అపోహలూ ఎక్కువే. వ్యాయామం చేస్తేనో, బరువులు ఎత్తితేనో నడుము నొప్పి వస్తుందని ఎంతోమంది అనుకుంటూ ఉంటారు. ఇది వస్తే పూర్తిగా మంచంపై విశ్రాంతి తీసుకోవాల్సిందేనని భావిస్తుంటారు. అసలు ఇలాంటి అపోహల్లో నిజమెంతో తెలుసుకుందామా...

అపోహ: ఎప్పుడూ నిటారుగానే కూచోవాలి:

అపోహ: ఎప్పుడూ నిటారుగానే కూచోవాలి:

* ముందుకు వంగి కూచోవటం వల్ల వెన్నెముకకు హాని కలుగుతుందన్నది నిజమే. కానీ పూర్తి నిటారుగా, చాలాసేపు అలాగే కూచున్నా వెన్నెముక త్వరగా అలసిపోతుంది. కాబట్టి ఎక్కువ సమయం కూచోవాల్సి వస్తే.. కుర్చీ వెనక భాగానికి వెన్ను ఆనించి, కొద్దిగా ముందుకు వంగి కూచోవాలి. కాళ్లు నేలను తాకుతుండేలా చూసుకోవాలి. ఎప్పుడూ కూచునే ఉండకుండా.. గంటకోసారి లేచి కాస్త అటూఇటూ నడవటం.. ఫోనులో మాట్లాడటం వంటి పనులను నిలబడే చేస్తుండటం మంచిది.

అపోహ: మరీ బరువైన వస్తువులను ఎత్తరాదు:

అపోహ: మరీ బరువైన వస్తువులను ఎత్తరాదు:

* ఎవరికైనా శక్తికి మించిన బరువులను ఎత్తటం శ్రేయస్కరం కాదు. అయితే నడుమునొప్పి విషయంలో ఎంత బరువు ఎత్తుతున్నామన్న దానికన్నా ఎలా పైకి లేపుతున్నామన్నదే కీలకం. ఆయా వస్తువులను దూరం నుంచి వంగి ఎత్తటం కాకుండా.. వాటికి దగ్గరగా వచ్చి మోకాళ్ల మీద కూర్చుని పైకెత్తాలి. వెన్ను నిటారుగా ఉండేలా, శరీరం బరువు కాళ్లపై సమంగా పడేలా చూసుకోవాలి. ఈ సమయంలో శరీరం పక్కలకు తిరిగినా, వంగినా వెన్నెముకను దెబ్బతీస్తుంది.

అపోహ: పూర్తి విశ్రాంతి తీసుకోవటమే మంచి చికిత్స :

అపోహ: పూర్తి విశ్రాంతి తీసుకోవటమే మంచి చికిత్స :

* చిన్న చిన్న గాయాలు, బెణుకుల వంటి కారణంగా హఠాత్తుగా నొప్పి వస్తే విశ్రాంతి తీసుకోవటం మంచిదే. అయితే పూర్తిగా మంచం మీదే పడుకోవాలనేది మాత్రం అపోహ. ఒకట్రెండు రోజులు కదలకుండా పూర్తిగా మంచం మీదే ఉండిపోతే నడుము నొప్పి మరింత ఎక్కువ అవుతుంది.

అపోహ: గాయాల వల్లనే నొప్పి కలుగుతుంది :

అపోహ: గాయాల వల్లనే నొప్పి కలుగుతుంది :

* ఒక్క గాయాలే కాదు.. వయసుతో పాటు వచ్చే వెన్నుపూసల అరుగుదల, రకరకాల కండరాల సమస్యలు, ఇన్‌ఫెక్షన్లు, జన్యు పరమైన కారణాల వంటివి కూడా నడుము నొప్పికి కారణమవుతాయి.

అపోహ: బక్క పలుచని వారికి నొప్పి రాదు :

అపోహ: బక్క పలుచని వారికి నొప్పి రాదు :

* బరువు ఎక్కువ ఉన్న వారికి నడుమునొప్పి బాధలు ఎక్కువన్న మాట నిజమేగానీ అలాగని బక్కగా ఉండే వారికి నడుము నొప్పి రాదనుకోవటానికి లేదు. నడుము నొప్పి ఎవరికైనా రావొచ్చు. నిజానికి ఆహారం సరిగా తీసుకోకుండా చాలా సన్నగా ఉండేవారికి ఎముక క్షీణత ముప్పూ ఎక్కువే. ఇలాంటి వారికి నొప్పులే కాదు, వెన్నెముక విరిగే ప్రమాదమూ ఉంటుంది.

అపోహ: వ్యాయామం వెన్నెముకకు హాని చేస్తుంది :

అపోహ: వ్యాయామం వెన్నెముకకు హాని చేస్తుంది :

* ఇది చాలా పెద్ద అపోహ. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే వెన్నునొప్పి రాకుండా నివారించుకునే వీలుంది. తీవ్ర గాయాల కారణంగా వెన్నునొప్పితో బాధపడుతున్నవారికి వెద్యులు ప్రత్యేక వ్యాయామాలు సూచిస్తారు. ఇక నొప్పి తగ్గిన తర్వాత తగు వ్యాయామాలు చేయటం ద్వారా మున్ముందు మళ్లీ నడుము నొప్పి బారినపడకుండా చూసుకోవచ్చు.

నిర్లక్ష్యానికి మూల్యమెక్కువ

నిర్లక్ష్యానికి మూల్యమెక్కువ

నడుము యాంజెనాకు సరైన చికిత్స చేయించకుండా నిర్లక్ష్యం చేస్తే.. పురుషాంగానికి రక్తపస్రరణ మందగించి, సామర్థ్య సమస్యలు తలెత్తవచ్చు. రెండో సమస్య- పాదాలకు రక్తపస్రరణ తగ్గిపోవటం. దీనివల్ల పాదాల్లో తీవ్రమైన నొప్పితోపాటు కండ నల్లబారటం, గ్యాంగ్రీన్ వంటి సమస్యలు తలెత్తుతాయి. సెక్సు సామర్థ్యాన్ని పదిల పరచుకోవటానికీ, పాదాల్ని పరిరక్షించుకోవటానికి మధుమేహులు నడుము యాంజెనా విషయంలో నిరంతరం జాగ్రత్తగా ఉండాల్సిందే.

పెయిన్ కిల్లర్లు వద్దు:

పెయిన్ కిల్లర్లు వద్దు:

నడుము నొప్పితో బాధపడేవారు.. తరచూ డాక్టర్లను మార్చేస్తుంటారు. దీనితో వారు వాడే నొప్పినివారిణ మాత్రల (పెయిన్ కిల్లర్లు) బ్రాండ్లు కూడా ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. కొంతమంది డాక్టర్ని సంప్రదించటానికి బదులుగా, తమకు తామే నేరుగా మందుల దుకాణానికి వెళ్లి పలురకాల మాత్రల్ని తెచ్చుకుని వాడేస్తుంటారు. ఏ కొంచెం నొప్పిగా, నలతగా ఉన్నా వెంటనే మాత్ర వేసేసుకుంటారు. ఇలా పెయిన్ కిల్లర్లను ఏళ్ల తరబడి విచ్చలవిడిగా వాడటం వల్ల రెండురకాలుగా నష్టం వాటిల్లుతుంది. ఎలాగంటే.. నొప్పి నివారిణి మాత్రలతో నొప్పినుంచి ఉపశమనం పొందుతూ, నడుము యాంజెనాకు సరైన వెద్య చికిత్స తీసుకోకపోవటం వల్ల పాదం కోల్పోయే ప్రమాదం తలెత్తుతుంది. రెండోవెపు- మూత్రపిండాల వైఫల్యం తెలెత్తే అవకాశం పెరుగుతుంది. పెయిన్ కిల్లర్లను ఎక్కువెక్కువగా వాడటమే ఇలాంటి సమస్యకు కారణం. ప్రత్యేకించి మధుమేహుల్లో పెయిన్ కిల్లర్లు కిడ్నీ వెఫల్యానికి దారితీస్తాయి. కొంతలో కొంత ప్యారసెటమాల్ వంటివే కిడ్నీలకు సురక్షితమైన మాత్రలుగా తేలాయి.

English summary

8 myths about lower back pain, busted

Maybe you’ve heard the joke that there are two kinds of people – those who already have lower back pain and those who will. But it’s no laughing matter for those who suffer debilitating muscle ache, shooting pains or an inability to stand upright comfortably, whether their back pain lasts for a few days or many weeks at a time. Keep reading to find out about some common back pain myths.
Story first published: Saturday, April 9, 2016, 7:18 [IST]
Desktop Bottom Promotion