For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అలసట, టయర్డ్ నెస్ కు గుడ్ బై చెప్పే ఎనర్జిటిక్ ఫుడ్స్

|

సాధారణంగా కొంత మంది ఎప్పుడూ అలసటగా, నీరసంగా కనబడుతుంటారు. నిద్రలేవడానికి కూడా వీలుపడనంతగా అలసట చెందుతుంటారు. నిద్రలేచినా ఏ పనిచేయాలన్నా మూడ్ ఉండదు. ఏపనిచేయాలన్నా, శరీరంలో ఏమాత్రం శక్తిలేనట్టు ఫీలవుతుంటారు. అంతే కాదు, ఈ అలసట కారణంగా వ్యాయామాలకు దూరంగా ఉంటారు. ఇంకా జిమ్ కు వెళ్ళకుండా వాయిదాలు వేస్తుంటారు. ఇవి అలసట, ఆయాసం, నీరసంకు ప్రధాన లక్షణాలుగా చెప్పవచ్చు.

అయితే ఎప్పుడతే అతిగా ఆటలాడటం, లేదా అతిగా పనిచేయడం, లేదా ఎక్కువ సమయం పనిచేయడం వల్ల అలసటకు గురైవుతుంటారు. ఇది సహజం. ఆటలాడితేనే కాదు, రోజంతా పనిచేసినా అలసిపోతారు. ఎక్కువ దూరం నడిచినా అలసిపోతారు. అలసట అనేది అందరిలో జరుగుతుంది. ఇదొక రసాయనిక చర్యేకాదు, జీవన క్రియకూడా. అయితే ఎటువంటి శారీరక శ్రమలేకుండా, ఎటువంటి శక్తిని ఉపయోగించకుండానే, అనవసరంగా ఎప్పుడూ అలసటకు గురిఅవుతుంటే, అప్పుడు మీలో ఆరోగ్యపరంగా సమస్యలున్నట్లు గుర్తించాలి. మీరు తరచూ ఎందుకు నీరసం, అలసటకు గురౌతున్నారో ఖచ్చితంగా తెలుసుకోవాలి.

అలసటకు సరైన పోషకాహారం తీసుకోకపోవడం, నిద్రలేమి, కెఫిన్ మరియు ఆల్కహాల్ ఎక్కువగా తసుకోవడం వంటివి అలసటకు టయర్డ్ నెస్ కు ముఖ్య కారణాలు . వీటితో పాటు ఓబేసిటి, కిడ్నీ సమస్యలు, డయాబెటిస్, థైరాయిడ్ సమస్యలు, ఆందోళన, మరియు డిప్రెషన్ వంటి అధిక ఒత్తిడికి గురిచేసి అలసటకు గురిచేస్తాయి. దాని వల్ల శరీరంలో ఎనర్జీ లెవల్స్ తగ్గిపోతాయి . దాంతో దినచర్య మీద తీవ్రప్రభావం పడుతుంది, పురుషుల కంటే మహిళలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలన్నా...రోజంతా ఎనర్జిటిక్ గా కనిపించాలన్నా మంచి ఆహారంను ఎంపిక చేసుకోవాలి, . కొన్ని ఆహారాలు ఎనర్జీలెవల్స్ పెంచడంతో పాటు అలసటను నివారిస్తాయి. మరి ఎనర్జిటిక్ ఫుడ్స్ ఏంటో చూద్దాం...

గుమ్మడి విత్తనాలు:

గుమ్మడి విత్తనాలు:

గుమ్మడి: గుమ్మడి గింజల్లో ప్రోటీన్స్ పుష్కలంగా ఉండి కండర నిర్మాణం, కండర శక్తికి బాగా సహాయపడుతాయి. విటమిన్స్ మరియు హెల్తీ ఫ్యాట్, మెగ్నీషియం వంటివి ఎనర్జీని పెంపొందిస్థాయి.

 వాల్ నట్స్:

వాల్ నట్స్:

మన శరీరంలోని కణజాలాలకు అవసరం అయ్యే శక్తిని అంధించడానికి నట్స్ లో అనేక ఎంజైములు ఉన్నాయి. కాబట్టి, రోజులో కాస్త అలసట అనిపించినప్పుడు ఈ నట్స్ ను స్నాక్స్ గా తీసుకోవడం చాలా ఉపయోగకరం. తక్షణ శక్తిని అంధిస్తాయి. అలసటను దూరం చేస్తాయి. మనస్సును ఉత్తేజపరుస్తాయి.

ఓట్స్:

ఓట్స్:

ఓట్స్ ఫర్ఫెక్ట్ ఫుడ్ ఇది అలసటను తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఇందులో క్వాలిటీ కార్బోహైడ్రేట్స్ గ్రేట్ గా ఉన్నాయి. ఇవి బ్రెయిన్ మరియు మజిల్స్ కు అవసరం అయ్యే కార్బోహైడ్రేట్ స్ ను అందిస్తుంది. దాంతో రోజంతా ఎనర్జిటిక్ గా ఉండటానికి సహాయపడుతుంది. ఎందుకంటే ఇందులో ప్రోటీన్, మెగ్నీషియం, ఫాస్పరస్, మరియు విటమిన్ బి 1పుష్లకంగా ఉన్నాయి . ఇవి ఎనర్జీ లెవల్స్ ను పెంచుతాయి .

పెరుగు:

పెరుగు:

పెరుగు ఎనర్జీ బూస్టింగ్ స్నాక్ గా చెబుతారు. ఇందులో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణిక్రియకు అద్భుతంగా సహాయపడుతాయి. ఇవి నిస్సత్తువు కలిగి వ్యాధినిరోధక క్రియతో పోరాడి ఎనర్జీ లెవల్స్ ను పెంచుతుంది.

వాటర్ మెలోన్:

వాటర్ మెలోన్:

పచ్చకాయ తినడం వల్ల మన శరీరానికి హైడ్రేషన్ మాత్రమే కలిగించడం కాదు. పుచ్చకాయలో ఉండే అధిక శాతం నీరు, తగినంత హైడ్రేషన్ తో పాటు ఎనర్జీని అంధించే బి విటమిన్స్, పొటాషియం మరియు ఫ్రక్టోస్ పుష్కలంగా ఉంటుంది.

అరటి పండ్లు:

అరటి పండ్లు:

అరటి పండ్లలో అధిక శాతంలో పొటాషియం మరియు బి విటమిన్స్ కలిగి ఉండటం వల్ల అరటిపండ్లు జీర్ణవ్యవస్థను నిదానం చేస్తుంది మరియు బ్లడ్ షుగర్ లెవల్స్ ను స్థిరంగా ఉంచుతుంది.అలసిన శరీరానికి గ్లూకోజ్ ను కార్బోహైడ్రేట్లను ఎంతో తేలికగాను వేగవంతంగాను ఈ పండు అందిస్తుంది. రక్తంలోని హేమోగ్లోబిన్ కవసరమైన ఐరన్ అందిస్తుంది. ఎంతో శక్తి కలిగి భావిస్తారు.

డార్క్ చాక్లెట్ :

డార్క్ చాక్లెట్ :

డార్క్ చాక్లెట్ లో ఐరన్ మరియు మెగ్నీషయం అద్భుతంగా నిల్వ ఉంది. ఎనర్జీ స్థాయిలను పెంచడానికి ఇది గొప్పగా సహాయపడుతుంది.చాక్లెట్స్ అంటానే ఏది పడితే అవి తినేయడం కాదు. చాక్లెట్స్ లో డార్క్ చాక్లెట్ కు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇందులో ఉండే anandamine అనే కంటెంట్ ద్వారా మెదడు విశ్రాంతి మరియు ఒత్తిడి లేకుండా మెదడులోని డోపమైన్ లెవల్స్ ను పెంచుతుంది.

 బాదం:

బాదం:

బాదంలో ఉండే అద్బుతమైన జింక్ ఖనిజం మరియు విటమిన్ బి12 వల్ల ఈ స్ట్రెస్ రిలీఫ్ జాబితాలో చేర్చబడింది. ఈ పోషకాలు మీ మనస్సు సమతుల్యస్థితి నిర్వహించడానికి మరియు ఆందోళను దరంగా ఉంచడానికి సహాయడపతుంది.

 గ్రీన్ టీ:

గ్రీన్ టీ:

ప్రతి రోజూ ఉదయం ఒక కప్పు గ్రీన్ టీ తీసుకోవడం వల్ల అది మానవ మనస్సును ఒక ప్రశాంతంగా ఉంచేందుకు ప్రభావం కలిగి ఉంటుంది. నిజానికి ఇది చాలా ఎఫెక్టివ్ గా ప్రభావం చూపెడుతుంది.

English summary

9 Foods To Eat When You Are Tired

Dozing off at your desk? Do you feel sluggish and tired all the time? Poor nutrition and lifestyle factors like poor sleep, intake of caffeine and alcohol consumption are some of the the main reasons for fatigue and tiredness.
Story first published: Wednesday, April 27, 2016, 18:18 [IST]
Desktop Bottom Promotion