Latest Updates
-
ఎందుకు నాన్నలకు కూతుళ్లంటే అంత ప్రాణం? -
రీసెర్చ్ ప్రకారం ఒక పురుషుడు ఎంతసేపు శృంగారం చేయగలడు? శీఘ్రస్కలనం గురించి ముఖ్య నిజాలు.. -
ఇంట్లో ఈ ఒక్కటి వాడకపోతే ఇన్ని తిప్పలా.. అరికాళ్ల నొప్పులకి ప్రధాన కారణమిదే.! -
ఆ భయంతో భార్యను దూరం పెడుతున్నారా.. పురుషులను ఇబ్బందికి గురిచేసే శృంగార సందేహాలివే.! -
చపాతీ, అన్నంలోకి అదిరిపోయే రుచితో పెరుగు బెండకాయ గ్రేవీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
వర్షం పడేటప్పుడు వేడివేడిగా హెల్తీగా తినాలంటే.. ఐదే నిమిషాల్లో లెమన్ గార్లిక్ సోయా చంక్స్ రెడీ.! -
శుక్ర-శని సమసప్తక యోగం.. ఆగస్టు 1 నుండి ఈ రాశులకు ఊహించని కష్టాలు! -
90స్ కిడ్స్ ఫేవరెట్ పల్లి ఉండలు ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
అమృతం లాంటి సాంబార్ కేవలం 15 నిమిషాల్లోనే.. ఎలాగో చూసేయండి! -
సిగరెట్ ముట్టకపోయినా యువకులకు లంగ్ క్యాన్సర్..మీలో ఈ 5 లక్షణాలు కనిపిస్తున్నాయా?
ఏరోబిక్ వ్యాయామం హార్ట్ ఫెయిల్యూర్ కాకుండా ప్రోటీన్ క్వాలిటిని పెంచుతుంది..
మీకు ఏరోబిక్స్ అంటే తెలుసా? ఏరోబిక్స్ యొక్క పవర్ ఫుల్ ప్రయోజనాలేంటో మీకు తెలుసా? సాధారణంగా మెదడు చురుకుదనం, శక్తిసామర్థ్యాలు, తెలివితేటలు, ఆలోచనా శక్తి, ఏకాగ్రత, ఆటలు- ఇండోర్ గేమ్స్‌లో చురుగ్గా పాల్గొనగలుగుతున్నారా లేదా వంటి అంశాలు మానసికంగా ఫిట్‌నెస్‌తో ఉన్నారా లేదో అన్నేదాన్ని తెలియజేస్తాయి. వీటిని బట్టి ఒక వ్యక్తి ఫిట్‌నెస్ సామర్థ్యాన్ని అంచనా వేయవచ్చు.
కానీ, శారీరకపరమైన ఇతర మార్పులేమీ జరుగకుండా ఉఛ్వాస నిశ్వాసలు వేగంగా జరగటం, హృదయస్పందన రేటు పెరగటం, కండరాల కదలికలు చురుకుగా ఉంచేందుకు దోహదపడే ఎక్సర్‌సైజెస్‌ను ఏరోబిక్ ఎక్సర్‌సైజెస్ అంటారు.

వాకింగ్, జాగింగ్, రన్నింగ్, స్టేషనరీ లేదా సాధారణ సైక్లింగ్, స్విమ్మింగ్, ఆట్లాడటం, డ్యాన్స్ చేయటం వంటివన్నీ ఏరోబిక్ ఎక్సర్‌సైజెస్ కిందకు వస్తాయి.
ఏరోబిక్ ఎక్సర్‌సైజ్ చేయడం ద్వారా ఊపిరితిత్తులు పర్యావరణం నుంచి ఆక్సిజన్‌ను ఎక్కువ మోతాదులో తీసుకుంటాయి. గుండె, రక్తనాళాలు ఆ ఆక్సిజన్‌ను, ఇతర పోషకాలను ప్రతి కణానికి చేరవేస్తాయి.
కండరాలు పనిచేయడానికి, కేలరీలను కరిగించడానికి ఇవి అవసరం. ఈ ఏరోబిక్ ఎక్సర్‌సైజులను చాలా రకాలుగా చేయవచ్చు. వాకింగ్, జాగింగ్, స్లో రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, తేలికపాటి ఆటలు, డ్యాన్స్ వంటివి మంచి ఫలితాలనిస్తాయి.

సమయం లేక వ్యాయామం చేయలేకపోతున్నామనే వానికి ఏరోబిక్ వ్యాయామాలు మంచి ప్రయోజనం. ఏరోబిక్ వ్యాయామాల వల్ల ఉన్న లాభాలు చాలానే ఉన్నాయి. అవేంటంటే?
ప్రోటీన్ క్వాలిటిని పెంచుతుంది. వ్యాయామం వల్ల అమినో యాసిడ్ కారణం శరీరంలో రక్త ప్రసరణ, ప్రోటీన్ ప్రసరణ రెగ్యులేట్ చేస్తుంది.
ఈ క్రమంలో మన శరీరంలోని కణాల్లో ప్రోటీనుల క్వాలిటి పెరుగుతుంది. శరీరం మొత్తం కంట్రోల్లో ఉంటుంది. ప్రోటీన్స్ శరీరంలో జీవక్రియలను క్రమబద్దానికి సహాయపడుతాయి. హార్ట్ ఫెయిర్ సమస్యలుండవు.
కార్డియో ప్రోటీన్ క్వాలిటిని కార్డియో ఫార్మాలజీ థెరఫీ అవసరం లేకుండానే ప్రోటీన్ క్వాలిటి పెంచుతకోవచ్చు. అలాగే ఏరోబిక్స్ వ్యాయామం వల్ల కార్డియక్ ప్రోటీన్ క్వాలిటీ కంట్రోల్ సిస్టమ్ , వల్ల మిస్ ఫోల్డ్ ప్రోటీన్ చేరకుండా నివారిస్తుంది.
ఏరోబిక్ వ్యాయామాల వల్ల కార్డియిక్ ఫంక్షన్ మెరుగ్గా ఉంటుంది. ఇది హార్ట్ ఫెయిల్యూర్ కు దారి తియ్యకుండా నివారిస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications