For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పసుపు క్యాన్సర్ కణాలతో పోరాడుతుందని తేల్చిన 10 ఇయర్స్ స్టడీస్

By Swathi
|

పసుపు లేకుండా ఏ వంటకం ఉండదు. పప్పు అయినా, పప్పు చారైనా, కూర అయినా, పులుసు అయినా.. ఎలాంటి వంట వండినా.. పసుపు వాడటం భారతీయులకు అలవాటు. పూర్వకాలం నుంచి వంటింట్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది పసుపు. ఇది వంటకాలకు రుచిని, రంగునే కాదు.. అనేక యాంటీ ఆక్సిడెంట్స్ ను కలిగి ఉంది. అందుకే.. పసుపులో ఉన్న హీలింగ్ ప్రాపర్టీస్ ను గుర్తించిన ఇండియన్ సైంటిస్ట్స్.. దానిపై ఒకటి కాదు రెండు కాదు.. 10 ఏళ్లపాటు అధ్యయనాలు చేశారు.

నిత్యం వంటకాల్లో పసుపు వాడకం వల్ల పొందే లాభాలేంటి ?

turmeric

10 ఏళ్ల అధ్యయనాల్లో పసుపులో క్యాన్సర్ కి వ్యతిరేకంగా పోరాడే అణువులు ఉన్నట్టు గుర్తించారు. భోపాల్ లోని రాజీవ్ గాంధీ విశ్వవిద్యాలయం అధ్యయనాల్లో ఈ కొత్త విషయం బయటపడింది. పసుపులో యాంటీ సెప్టిక్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఫంగల్ ఇన్ఫెక్షన్ వంటి రకరకాల గుణాలు పుష్కలంగా ఉండటమే.. ఈ అధ్యయనాలకు ప్రోత్సాహాన్నిచ్చిందని సైంటిస్ట్ లు చెబుతున్నారు.

పసుపు పాలలోని అద్భుతమైన బ్యూటీ&హెల్త్ బెనిఫిట్స్

turmeric

ఈ అధ్యయనాల్లో రెండు అణువులను గుర్తించారు. పసుపులో గుర్తించిన యాంటీ క్యాన్సర్ అణువులలో ట్యుబులిన్, ప్రొటీన్ అనేవి ఉన్నట్టు తేల్చారు. ఇవి కణాల పనితీరుకి చాలా అవసరం. అలాగే క్రోమోజోన్ ల పనితీరుకి కూడా ఇవి సహాయపడతాయి. అంతేకాదు.. ఈ అణువులు కేవలం క్యాన్సర్ కణాలతోనే పోరాడతాయి. ఆరోగ్యకరమైన కణాలపై ఎలాంటి దుష్ర్పభావం చూపవు. కానీ మెడిసిన్స్ ద్వారా.. సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంది. కీమోథెరపి ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. కానీ.. పసుపు ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇది న్యాచురల్ ట్రీట్మెంట్ అందిస్తుంది.

English summary

After 10 Years Of Research On Turmeric, Discover Anti-Cancer Molecules

After 10 Years Of Research On Turmeric, Indian Scientists Discover Two New Anti-Cancer Molecules.
Story first published: Tuesday, January 19, 2016, 9:37 [IST]
Desktop Bottom Promotion