For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆరోగ్యానికి చౌకైన నేస్తం...బేకింగ్‌ సోడా! : ఆశ్చర్యం కలిగించే ప్రయోజనాలు

|

బేకింగ్ సోడా బేక్ చేయడానికి విరివిగా ఉపయోగిస్తామన్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే. బేకింగ్ సోడా అంతకంటే ఎక్కువ ప్రయోజనాలనే అందిస్తుంది . దీనిని ఏదైనా ఆమ్ల పదార్థంతో కలిపి నీళ్ళు చేర్చితే రసాయన చర్య జరుగుతుంది. దీనితో కార్బన్‌డై ఆక్సైడ్ వాయువు విడుదలై పిండిని లేదా ఆహారపదార్థాన్ని పొంగేలా చేస్తుంది. బేకింగ్ షోడాకు ద్రవపదార్థం తగిలిన వెంటనే రసాయన చర్య ప్రారంభమవుతుంది. కనుక పదార్థాలను కలిపిన తరువాత ఎక్కువసేపు ఆలస్యం చేయకూడదు. ఒక వేళ ఎక్కువసేపు ఉంచితే విడుదలైన వాయువు పోయి పదార్థం పొంగదు.కేక్‌లు, కుకీస్ వంటివి గుల్లగా రావడం కోసం వాటి తయారీలో బేకింగ్ సోడాని వాడుతుంటాం మనం. కానీ అది వంట చేయడానికే కాదు... చాలా వాటికి పనికొస్తుంది.

బేకింగ్ సోడాతో సౌందర్యం..ఆరోగ్యం.. రెండూ సాధ్యమే...!

బేకింగ్ సోడాను సోడియం బై కార్బోనేట్ అని కూడా పిలుస్తారు ఇది pH నియంత్రణ వంటి విధులను నిర్వహిస్తుంది. ద్రావణాల సమస్యలను తగ్గించే పరిపూర్ణ పదార్థంగా దీనిని పెర్కోనవచ్చు. ఆమ్ల లేదా క్షార ద్రావణానికి బేకింగ్ సోడాను కలపటం వలన దాని pH ను తటస్థీకరింప చేస్తుంది. దీని వలన చాలా ప్రయోజనాలు ఉన్నందు వలన మన నిత్య జీవితంలో ఒక భాగమైపోయింది.

బేకింగ్ సోడాలోని అమేజింగ్ బ్యూటీ బెనిఫిట్స్

బేకింగ్ సోడా వలన మనం రోజు ఎదుర్కొనే సమస్యలలో కొన్నిటిని తగ్గించుకోవచ్చు.చిటికెడు బేకింగ్ సోడాను నీటిలో మిక్స్ చేసి త్రాగడం వల్ల అజీర్తి, ఇన్ఫెక్షన్స్ మరియు హార్ట్ బర్న్ వంటివి తగ్గించుకోవచ్చు . అంతే కాదు మరెన్నో అనారోగ్య సమస్యలను నివారించుకోవచ్చు . నిజానికి బేకింగ్ సోడాను చిటికెడు తీసుకుంటే చాలా ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది: అయితే ఇది పిల్లలు మరియు గర్భణీ స్త్రీలు తీసుకోవడానికి లేదు . ఎందుకంటే ఇందులో ఉండే సోడియం కంటెంట్ ను అధికంగా తీసుకోకూడదు. అలాగే హైబిపి, కిడ్నీ ఎలిమెంట్స్ లేదా లివర్ సమస్యలున్న వారు దీన్ని తీసుకోకూడదు.

స్వచ్చమైన చర్మ సౌందర్యానికి బేకింగ్ సోడా ఫేస్ ఫ్యాక్

ఇలా ఇది వరకే అనారోగ్య సమస్యలతో బాధపడే వారు బేకింగ్ సోడా వాటర్ తాగడం వల్ల ఇతర సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి . కాబట్టి ఇలాంటి హోం రెమెడీస్ ను ఉపయోగించేటప్పుడు డాక్టర్ ను కలవడం మంచిది.. మరి బేకింగ్ సోడా వాటర్ లోని అమేజింగ్ బెనిఫిట్స్ ఏంటో ఒక సారి తెలుసుకుందాం...

 గౌట్ పెయిన్ నివారిస్తుంది:

గౌట్ పెయిన్ నివారిస్తుంది:

యూరిక్ యాసిడ్ వల్ల జాయింట్ పెయిన్స్ అధికంగా ఉంటాయి . బేకింగ్ సోడా వాటర్ తాగడం వల్ల యాసిడ్స్ పెరగకుండా ఉంటాయి.

అలసటను తగ్గిస్తుంది:

అలసటను తగ్గిస్తుంది:

వర్కౌట్స్, రన్నింగ్, జాగింగ్ చేసినప్పుడు శరీంరలో లాక్టిక్ యాసిడ్ పెరుగుతుంది . బేకింగ్ సోడా వాటర్ తీసుకొన్నప్పుడు అలసట నుండి ఉపశమనం కలుగుతుంది. అందుకే అథ్లెట్స్ ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.

యూరిన్ లో అసిడిక్ లెవల్స్ ను తగ్గిస్తుంది:

యూరిన్ లో అసిడిక్ లెవల్స్ ను తగ్గిస్తుంది:

బేకింగ్ సోడా వాటర్ యూరిన్ లో అసిడిక్ లెవల్స్ ను తగ్గిస్తుంది . యూటిఐ సమస్యతో బాధపడే వారు ఈ బేకింగ్ సోడా వాటర్ ప్రయత్నించవచ్చు.

 ఫ్రెష్ బ్రీత్ మరియు దంతాలను మెరిపిస్తుంది:

ఫ్రెష్ బ్రీత్ మరియు దంతాలను మెరిపిస్తుంది:

బేకింగ్ సోడా వాటర్ త్రాగడం వల్ల ఫ్రెష్ బ్రీత్ ఉంటుంది మరియు దంతాల తెల్లగా మెరుస్తాయి . అంతే కాదు, నోట్లో కొన్ని మైక్రోబ్యాక్టీరియాను నాశనం చేస్తుంది . ఓరల్ హెల్త్ మంచిగా ఉంటుంది.

 కిడ్నీ స్టోన్స్ ఏర్పడకుండా నివారిస్తుంది:

కిడ్నీ స్టోన్స్ ఏర్పడకుండా నివారిస్తుంది:

కిడ్నీలో అసిడిక్ లెవల్స్ పెరిగినప్పుడు కిడ్నీ స్టోన్స్ ఏర్పడుతాయి. అలా ఏర్పడకుండా నివారించడంలో బేకింగ్ సోడా వాటర్ గ్రేట్ గా సహాయపడుతుంది. బేకింగ్ సోడా త్రాగడం వల్ల కిడ్నీ స్టోన్స్ ఏర్పడవు.జ

వ్యాధులను దూరం చేస్తుంది:

వ్యాధులను దూరం చేస్తుంది:

బేకింగ్ సోడా వాటర్ శరీరానికి బెటర్ ఆల్కలినిటిని అందిస్తుంది.దాంతో వివిధ రకాల వ్యాధులు ధరిచేకుండా రక్షణ కల్పిస్తుంది. క్యాన్సర్, ఆర్థరైటిస్ మరియు ఓస్టిరియోఫోసిస్ వంటివి నివారించే టాక్సిక్ వాతావరణాన్ని నివారిస్తుంది

 జీర్ణ సమస్యలను నివారించడానికి:

జీర్ణ సమస్యలను నివారించడానికి:

బేకింగ్ సోడా వాటర్ కొన్ని రకాల జీర్ణ సమస్యలు, ఎసిడి, హార్ట్ బర్న్ మొదలగునవి నివారిస్తుంది. శరీరంను ఎసిడిక్ లెవల్స్ ను న్యూట్రలైజ్ చేస్తుంది.

హార్ట్ బర్న్ నివారిస్తుంది:

హార్ట్ బర్న్ నివారిస్తుంది:

గుండెల్లో మంటకు బేకింగ్‌ సోడా చాలా ఎఫెక్టివ్‌గా పని చేస్తుంది. కేకులలో, పేస్ట్రీలలో మొదలగు వాటిలో బేకింగ్‌ సోడాని వాడడం వలన మంచి ఫలితం ఉంటుంది. వాటిని తింటూ ఎంజాయ్‌ చేయడంతో పాటు మీ గుండె మంట లేకుండా చేస్తుంది. ఈ రుగ్మత కలిగిన వారు బేకింగ్‌ సోడా ఉపయోగించడం వలన ఆహారాలను ఏ ఇబ్బంది లేకుండా ఆనందంగా తినొచ్చు.

యాంటాసిడ్‌ లా పనిచేస్తుంది:

యాంటాసిడ్‌ లా పనిచేస్తుంది:

బేకింగ్‌సోడా సోడియమ్‌ బైకార్బోనేట్‌ ఉండడం వలన ఇది యాంటాసిడ్‌ మందులాగా పనిచేస్తుంది. కడుపులో ఉండే యాసిడ్ తిరిగి అన్నవాహిక లోకి వెళ్ళకుండా నిరోధిస్తుంది. ఈ క్రమంలో ఛాతి మరియు గొంతుమంట నుండి ఉపసమనం లభించేలా చేస్తుంది.

 పిహెచ్‌ స్థాయి సమతుల్యత:

పిహెచ్‌ స్థాయి సమతుల్యత:

బేకింగ్‌సోడా ని వాడడం వలన రక్త ప్రవాహంలో పిహెచ్‌ స్థాయిని సమతుల్యం చేస్తుంది. గుండె మంటకి కారణమవుతున్న కడుపులో విడుదలయ్యే యాసిడ్‌ ను తగ్గిస్తుంది. ఈ విధంగా బేకింగ్‌ సోడావల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

మౌత్ వాష్

మౌత్ వాష్

ఒక చెంచా బేకింగ్ సోడాను ఒక కప్పు నీటిలో కలపండి మరియు ఈ మిశ్రమాన్ని నోట్లో పోసుకొని పుకిలించటం వలన నోట్లో నుండి వెలువడే వాసనలు తొలగిపోతాయి. అంతేకాకుండా, నోట్లో అల్సర్ మరియు గాయాలను తగ్గించటానికి కూడా దీన్ని వాడతారు.

 శక్తి పెరుగుదల

శక్తి పెరుగుదల

బేకింగ్ సోడాను నీటిలో కలుపుకొని స్నానం చేయటం వలన విశ్రాంతి అనుభూతికి గురవుతారు. సగం కప్పు బేకింగ్ సోడాను నీటిలో కలుపుకోవటం వలన మంచి అనుభూతికి లోనవుతారు. వేడి నీటి స్నానం వలన కలిగే ప్రయోజనాల గురించి తక్కువగా అంచనా వేయకండి.

బేకింగ్‌సోడా మరియు మంచి నీళ్ళు:

బేకింగ్‌సోడా మరియు మంచి నీళ్ళు:

ఇది చాలా అద్బుతమైన సులువైన పద్ధతి. దీన్ని వాడడం వలన మంట నుండి వెంటనే ఉపసమనం పొందవచ్చు. కావలసినవి: బేకింగ్‌ సోడా - 1 టీస్పూన్‌ నీళ్ళు - 1 గ్లాసు.

తయారుచేయు పద్ధతి:

తయారుచేయు పద్ధతి:

ఒక గ్లాసు నీరు తీసుకొని అందులో 1 టీస్పూన్‌ బేకింగ్‌ సోడాకలపాలి. బాగా సోడా కరిగేంత వరకు కలిపి తర్వాత తాగాలి దానివల్ల మంట తగ్గుతుంది.

గమనిక:

గమనిక:

ప్రక్రియను రోజుకి కేవలం 2 లేదా 3 సార్లుచేయాలి. 3 సార్లు మించి చెయ్యరాదు.అదేవిధంగా ఇది ఈ పద్దతిని ఒక వారానికి మించి చేయరాదు. ఉప్పుగుణం కలిగిన బేకింగ్‌ సోడా వలన సైడ్‌ ఎఫెక్ట్స్ కలగుతాయి. వాంతులు, వికారం మొదలగునవి సంభవిస్తాయి.

బేకింగ్‌ సోడా మరియు నిమ్మరసం:

బేకింగ్‌ సోడా మరియు నిమ్మరసం:

నిమ్మకాయ సామాన్యంగా అందరి ఇంట్లోను ఉంటుంది. అందువల్ల ఈ రెమెడీ అందరికీ అందుబాటులో ఉండే చక్కని పద్ధతి. నిమ్మరసం గుండెమంటను తగ్గించడంలో సహాయ పడుతుంది. కావలసినవి: బేకింగ్‌ సోడా-1/2 టీ స్పూన్‌ నిమ్మరసం- కొన్ని చుక్కలు వేడినీళ్ళు- 1/2 కప్పు.

తయారుచేయు పద్ధతి:

తయారుచేయు పద్ధతి:

సగం కప్పు నీళ్ళు తీసుకొని అందులో 1/2 టీ స్పూన్‌ బేకింగ్‌ సోడా కలిపి, నిమ్మరసం కూడా కలపాలి. అన్నింటిని బాగా కలిసేవిధంగా కలిపి దాన్ని సేవించడం ద్వారా గుండెమంటని అరికడుతుంది.

English summary

Benefits Of Drinking Baking Soda Water

Benefits Of Drinking Baking Soda Water,Most of us know that baking soda is used for baking but it can do more than just that. Mixing a pinch of baking soda and drinking it can solve certain health issues like indigestion, infection and even heart burn.
Story first published: Wednesday, April 27, 2016, 11:58 [IST]
Desktop Bottom Promotion