For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పాలు, బెల్లం కాంబినేషన్ ఖచ్చితంగా తీసుకోవాలి అనడానికి కారణాలు..!!

By Swathi
|

పంచదార లేకుండా ఒక కప్పు పాలు లేదా టీ తాగాలి అనుకుంటున్నారా ? కానీ.. స్వీట్ నెస్ మాత్రం మిస్ అవకూడదని భావిస్తున్నారా ? అయితే పంచదారకు బదులు పాలల్లో బెల్లం కలుపుకుని తీసుకోండి. రుచితో పాటు, అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.

పాలును టేస్టీగా, మిమ్మల్ని హెల్తీగా మార్చే మిల్క్ కాంబినేషన్స్..!!

బెల్లంలోని ఆరోగ్య ప్రయోజనాలు చాలామందికి తెలిసే ఉంటుంది. అయితే.. పాలలో బెల్లం కలుపుకుని తీసుకోవడం వల్ల.. మినరల్స్, విటమిన్స్ పుష్కలంగా పొందవచ్చు. అనేక అనారోగ్య సమస్యలకు కారణమయ్యే పంచదార తీసుకోవడాన్ని తగ్గించడానికి మనలో చాలామంది ప్రయత్నిస్తున్నాం.

చిన్న బెల్లం ముక్క చాలు... అందం రెట్టింపు చేయడానికి..

అయితే పంచదారకు బదులు.. బెల్లం చక్కటి ఆప్షన్. ఇది మీరు తీసుకునే పాలు లేదా టీని టేస్టీగానే కాదు.. హెల్తీగానూ మారుస్తుంది. పెద్దవాళ్లు.. డైలీ డైట్ లో పాలు, బెల్లం చేర్చుకోవడం చాలామంచిదని.. నిపుణులు సూచిస్తున్నారు. మీకు తెలుసో ? తెలియదో గానీ.. ఒకప్పుడు పల్లెటూర్లలో కాఫీ, టీలలో బెల్లంనే వాడేవాళ్లు. మరీ ప్రతిరోజూ ఒక కప్పు పాలు, బెల్లం కాంబినేషన్ తీసుకోవడం వల్ల పొందే అమేజింగ్ బెన్ఫిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

బరువు తగ్గడానికి

బరువు తగ్గడానికి

మీరు అధిక బరువు ఉన్నారని పంచదారకు దూరంగా ఉంటున్నారా ? అయితే.. పాలల్లో బెల్లం కలుపుకుని తీసుకోవడం స్టార్ట్ చేయండి. బెల్లంలో పొటాషియం, పాలలో క్యాల్షియం ఉండటం వల్ల.. మిమ్మల్ని స్లిమ్ అండ్ ట్రిమ్ గా మార్చేస్తుంది. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ తీసుకుని చూడండి.. ఫలితాన్ని మీరు ఎంజాయ్ చేస్తారు.

ప్రెగ్నన్సీ అనీమియా

ప్రెగ్నన్సీ అనీమియా

అనీమియా అరికట్టడానికి చాలామంది మహిళలు ఐరన్ ట్యాబ్లెట్స్ వాడుతుంటారు. బెల్లంలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా.. అనీమియా అరికట్టే పవర్ ఉంది. ఒక గ్లాసు పాలు, బెల్లం మహిళల్లో అనీమియా సమస్యతో పోరాడుతుంది.

చర్మానికి, జుట్టుకి

చర్మానికి, జుట్టుకి

బెల్లం, పాలు రెండూ.. చర్మానికి, జుట్టుకి అద్భుతమైన ప్రయోజనాలు అందిస్తాయి. డైలీ డైట్ లో ఈ కాంబినేషన్ ను చేర్చుకుంటే.. మీ చర్మం గ్లోయింగ్ గా మారడమే కాకుండా.. ఫ్రెష్ గా కనిపిస్తుంది. అలాగే జుట్టు స్మూత్ అండ్ సిల్కీగా మారుతుంది.

రుతుక్రమంలో పొట్టనొప్పి

రుతుక్రమంలో పొట్టనొప్పి

మహిళలకు రకరకాల సమస్యలను నివారించడంలో బెల్లం ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. రుతుక్రమంలో వచ్చే నొప్పి నివారించడంలో ఈ కాంబినేషన్ చక్కటి పరిష్కారం. బెల్లం పొట్టలో చల్లటి అనుభూతిని కలిగిస్తుంది.

ఇమ్యునిటీ

ఇమ్యునిటీ

ఇమ్యునిటీని మెరుగుపరచడానికి బెల్లం, పాలు మిశ్రమం అద్భుతమైన ఔషధం. ఈ రెండింటిలోనూ.. ఉండే పోషకాలు.. మనుషుల శరీరంలో అనారోగ్యాన్ని నివారించి.. రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి.

జాయింట్ పెయిన్స్

జాయింట్ పెయిన్స్

చిన్నప్పటి నుంచి.. బలమైన ఎముకలు పొందడానికి పాలు తాగాలని వింటూ ఉంటాం. పాలు, బెల్లం రెండూ.. ఎముకలు, కండరాలకు పోషణ అందిస్తాయి. పాలలో బెల్లం మిక్స్ చేసి తీసుకుంటే.. కీళ్ల నొప్పులు, ఎముకల సమస్యలు తగ్గుతాయి.

జీర్ణక్రియ

జీర్ణక్రియ

బెల్లం తీసుకోవడం వల్ల.. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బెల్లం, పాలు కలిపి తీసుకుంటే.. జీర్ణసంబంధిత సమస్యలు, కాన్ట్సిపేషన్, పేగుల్లో సమస్యలను నివారించవచ్చు. బెల్లం తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థను రెగ్యులేట్ చేస్తుంది.

రెగ్యులర్ గా

రెగ్యులర్ గా

బెల్లం, పాలలో అద్భుతమైన..పోషకాలు, మినరల్స్ ఉంటాయి. కాబట్టి.. ఖచ్చితంగా ప్రతిరోజూ డైట్ లో చేర్చుకోవడం మంచిదని అధ్యయనాలు నిరూపించాయి. ప్రతిరోజూ తీసుకుంటే.. ఖచ్చితంగా అనేక ప్రయోజనాలు పొందవచ్చు.

English summary

Benefits Of Jaggery With Milk

Benefits Of Jaggery With Milk. Do you want a cup of milk or tea without sugar but with sweetness? Then go for a tea with milk and jaggery.
Story first published:Wednesday, August 17, 2016, 10:46 [IST]
Desktop Bottom Promotion