For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భోజనం తిన్న వెంటనే ఎట్టిపరిస్థితుల్లో చేయకూడని పనులు..!!

|

విందు భోజనమైనా, మీకిష్టమైన పెరుగన్నమైనా.. తిన్న తర్వాత ఏం చేస్తారు ? భోజనం చేసిన వెంటనే ఏం చేస్తారు అంటే.. ఆన్సర్ చెప్పలేం. కానీ.. మనం చాలా రకరకాల పనులు చేస్తాం. అయితే.. భోజనం చేసిన తర్వాత.. కొన్ని పనులు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదని మీకు తెలుసా ?

హెల్తీగా ఉండాలంటే.. కొన్ని లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కి దూరంగా ఉండాలి. కొన్ని డైట్ టిప్స్ తో పాటు, భోజనం తర్వాత కొన్ని పనులకు దూరంగా ఉంటే.. కొన్ని రకాల అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు. మనం తరచుగా మన పెద్దవాళ్లు చెప్పే టిప్స్ వింటూ ఉంటాం. కానీ వాటిని నిర్లక్ష్యం చేస్తుంటాం.

Common Things You Must Never Do After Eating

అయితే.. భోజనం తర్వాత కొన్ని పనులు చేయడం వల్ల వెంటనే దుష్ర్పభావం చూపకపోయినా.. తర్వాత అవి పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలకు కారణమవుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. భోజనం తర్వాత హెల్తీ హ్యబిట్స్ ఫాలో అయితే.. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. అసలు భోజనం తర్వాత ఎటాంటి పనులు చేయకూడదో చూద్దాం..

స్మోకింగ్

స్మోకింగ్

భోజనం తర్వాత స్మోకింగ్ ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు. ఇందులో ఉండే నికోటిన్ జీర్ణక్రియను అడ్డుకుంటుంది. అలాగే.. శరీరం క్యాన్సర్ కణాలను గ్రహించడానికి కారణమవుతుంది.

MOST READ:రత్నాలు ధరిస్తే.. మనుషుల తలరాత మారుతుందా ?MOST READ:రత్నాలు ధరిస్తే.. మనుషుల తలరాత మారుతుందా ?

స్నానం

స్నానం

భోజనం చేసిన వెంటనే స్నానం చేయడం వల్ల.. జీర్ణక్రియ పనులు తగ్గుతాయి. స్నానం చేయడం వల్ల.. శరీరంలో రక్తప్రసరణ నెమ్మదిగా మారుతుంది. దీనివల్ల.. జీర్ణక్రియకు కావాల్సిన బ్లడ్ ను జీర్ణవ్యవస్థ పొందలేకపోతుంది.

ఫ్రూట్స్

ఫ్రూట్స్

చాలామంది భోజనం చేసిన వెంటనే పండ్లు తింటూ ఉంటారు. కానీ.. ఇలా తినడం వల్ల ఫ్రూట్స్ డైజెస్ట్ అవడానికి రకరకాల ఎంజైమ్స్ కావాల్సి వస్తుంది. దీంతో ఫ్రూట్స్ ని జీర్ణం చేయడానికి కావాల్సిన ఎంజైమ్స్ ని శరీరం గ్రహించలేకపోతుంది. కాబట్టి భోజనం చేసిన వెంటనే ఫ్రూట్స్ తీసుకోరాదు.

టీ తాగడం

టీ తాగడం

భోజనం చేసిన వెంటనే టీ ఎట్టిపరిస్థితుల్లో తాగకూడదు. భోజనం చేసిన వెంటనే టీ తాగడం వల్ల.. మనం తీసుకున్న ఆహారం నుంచి శరీరం ఐరన్ గ్రహించే సత్తాని కోల్పోతుంది.

ఎక్కువ సమయం కూర్చోవడం

ఎక్కువ సమయం కూర్చోవడం

భోజనం చేసిన తర్వాత.. ఎక్కువ సమయం కూర్చోవడం కంటే.. కాసేపు తిరగడం మంచిది. ఎక్కువ సమయం కూర్చోవడం వల్ల ఇన్ డైజెషన్ సమస్య వస్తుంది.

MOST READ:ఒక వ్యక్తిని ట్రాప్ చేసే హిప్నాటిజం (వశీకరణ) పై సైన్స్ ఏం చెబుతోంది ?MOST READ:ఒక వ్యక్తిని ట్రాప్ చేసే హిప్నాటిజం (వశీకరణ) పై సైన్స్ ఏం చెబుతోంది ?

వ్యాయామం

వ్యాయామం

భోజనం తిన్న వెంటనే ఎక్కువ వ్యాయామం ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు. భోజనం చేసిన వెంటనే వ్యాయామం చేయడం వల్ల ఎసిడ్ రిఫ్లెక్స్, ఎక్కిళ్లు, వికారం వంటి సమస్యలు ఎదురవుతాయి.

పడుకోవడం

పడుకోవడం

భోజనం చేసిన వెంటనే పడుకోవడం ఏమాత్రం మంచిది కాదు. ఇది.. డైజెస్టివ్ ట్రాక్ పై ప్రభావం చూపి.. ఎసిడిటీకి కారణమవుతుంది.

English summary

Common Things You Must Never Do After Eating!

Common Things You Must Never Do After Eating! Did you know that there are certain things you must completely avoid after eating?
Desktop Bottom Promotion