For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొబ్బరినీళ్ల వల్ల కలిగే.. భయంకరమైన సైడ్ ఎఫెక్ట్స్..!

By Swathi
|

కొబ్బరినీళ్లను చాలా ఆరోగ్యకరమైన శీతల పానీయంగా భావిస్తారు. తక్కువ ఫ్యాట్ కలిగిన కొబ్బరినీళ్లు దప్పిక తీరుస్తుంది. అందుకే.. దీన్ని మధ్యాహ్నం తాగడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉండటం వల్ల.. రోజంతా హైడ్రేట్ గా ఉంచుతుంది.

నీరసంగా అనిపించినప్పుడు కొబ్బరినీళ్లు తాగమని సలహా ఇస్తుంటారు. ఇవి.. శరీరంలో ఎలక్ట్రోలైట్ లెవెల్ ని పెంచుతుంది. తక్కువ క్యాలరీలు ఉండే డ్రింక్ కావడం వల్ల.. దీన్ని డైట్ ఫాలో అయ్యేవాళ్లు మెనూలో చేర్చుకుంటారు. కానీ మీకు తెలుసా ?

మరీ ఎక్కువగా కొబ్బరినీళ్లు.. అంటే పరిమితికి మించి తీసుకుంటే.. చాలా తీవ్ర సమస్యలకు కారణమవుతాయి. ఎక్కువ మొత్తంలో కొబ్బరినీళ్లు తీసుకుంటే.. శరీరంలో ఎలక్ట్రోలైట్ లెవెల్స్ అదుపుతప్పి.. అనేక అనారోగ్య సమస్యలకు కారణమవుతాయి. మరి కొబ్బరినీళ్ల వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో తెలుసుకోవాలని ఉందా..

పొటాషియం

పొటాషియం

కొబ్బరినీళ్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి.. వీటిని పరిమితికి మించి తీసుకోవడం వల్ల.. కండరాల నొప్పి, అలసట వంటి సమస్యలు ఎదురవుతాయి.

లాక్సేటివ్

లాక్సేటివ్

కొబ్బరినీళ్లలో ఎక్కువ లాక్సేటివ్ ఉంటుంది. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల.. డయేరియా, వికారం, వాంతులు, పొత్తికడుపు నొప్పికి కారణమవుతాయి.

తరచుగా యూరిన్

తరచుగా యూరిన్

కొబ్బరినీళ్లలో డ్యూరెటిక్ గుణాలుంటాయి. ఇవి.. యూరినేషన్ ని పెంచుతాయి. పరిమితికి మించి వీటిని తీసుకుంటే.. చాలా తరచుగా యూరినేషన్ వెళ్లాల్సి వస్తుంది.

బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగడానికి

బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగడానికి

ఒకవేళ మీరు డయాబెటిక్ పేషంట్స్ అయితే.. కొబ్బరినీళ్లకు దూరంగా ఉండటం మంచిది. ఇందులో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండటం వల్ల.. బ్లడ్ షుగర్ లెవెల్స్ ని పెంచుతాయి.

దగ్గు, జలుబు

దగ్గు, జలుబు

కొబ్బరినీళ్లు శరీరాన్ని చల్లబరుస్తాయి. కానీ.. దగ్గు, జలుబు చాలా తరచుగా, వెంటనే వచ్చే అవకాశాలున్నాయంటే.. మీరు కొబ్బరినీళ్లు తీసుకోకపోవడమే మంచిది.

బరువు పెరగడానికి

బరువు పెరగడానికి

ప్యాక్ చేసిన కొబ్బరినీళ్లు ఎట్టిపరిస్థితుల్లో తాగకండి. వాటిలో పంచదార ఎక్కువగా ఉంటుంది. అది.. బరువు పెరగడానికి కారణమవుతుంది.

సర్జరీకి ముందు

సర్జరీకి ముందు

ఏదైనా సర్జరీకి ముందు కొబ్బరినీళ్లు తాగకండి. ఒకవేళ సర్జరీకి ముందు కొబ్బరినీళ్లు తీసుకుంటే.. బ్లడ్ ప్రెజర్ పై ప్రభావం చూపుతుంది. సర్జరీకి 2వారాల ముందు నుంచి.. కొబ్బరినీళ్లు తీసుకోకపోవడం మంచిది.

క్యాన్సర్

క్యాన్సర్

కొబ్బరినీళ్లలో సోడియం చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది. కాబట్టి.. ఇది క్యాన్సర్ కి కారణమవుతుంది. అందుకే.. పరిమితికి మించి కొబ్బరినీళ్లు తీసుకోకూడదు.

అలర్జీ

అలర్జీ

నట్స్ మీకు అలర్జీ అయితే.. కొబ్బరి కూడా నట్ ని మరిచిపోకండి. కొబ్బరినీళ్లు ఎక్కువగా తీసుకుంటే.. ఇప్పటికే ఉన్న అలర్జీలను మరింత పెంచుతాయి.

English summary

Did You Know Drinking Coconut Water Cause Severe Allergies?: Side Effects Of Coconut Water

Did You Know Drinking Coconut Water Cause Severe Allergies?: Side Effects Of Coconut Water. oconut water is considered to be the most thirst quenching and low fat drink which everyone loves to have on a hot sunny day.
Story first published:Tuesday, August 16, 2016, 14:35 [IST]
Desktop Bottom Promotion