For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉదయాన్నే పరకడుపున ఎట్టిపరిస్థితుల్లో తినకూడని ఆహారాలు

ఉదయం ఖాళీ కడుపుతో తాజా పండ్లు, ఓట్ మీల్, గుడ్లు, బ్రెడ్, సలాడ్, ఉప్మా తీసుకోవచ్చు. కానీ.. ఈ కింద వివరించిన ఆహారాలకు మాత్రం దూరంగా ఉండటం చాలా మంచిది.

By Swathi
|

ఉదయం బ్రేక్ ఫాస్ట్ మిస్ చేయడం ఒక పెద్ద పొరపాటు, అన్ హెల్తీ బ్రేక్ ఫాస్ట్ తినడం మరో తప్పు. ఉదయం పరకడుపున కొన్ని ఆహారాలు తినడం మరింత ఎక్కువ ప్రమాదం. మీ ఆరోగ్యంపై దుష్ర్పభావం చూపే కొన్ని ఆహారాలను ఉదయం పరకడుపున ఎట్టిపరిస్థితుల్లో తినకూడదు.

Don’t Eat These Foods On Empty Stomach!

కానీ కొన్ని రకాల ఆహారాలను ఉదయాన్నే ఏమీ తినకుండా ఖాళీ కడుపుతో తీసుకుంటే మాత్రం మీ ఆరోగ్యానికి హానిచేస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. కానీ.. వాటి వల్ల కలిగే అనర్థాల గురించి తెలియక చాలా మంది ఆ ఆహారాలను ప్రతి రోజూ తీసుకుంటున్నారు.

ఉదయం ఖాళీ కడుపుతో తాజా పండ్లు, ఓట్ మీల్, గుడ్లు, బ్రెడ్, సలాడ్, ఉప్మా తీసుకోవచ్చు. కానీ.. ఈ కింద వివరించిన ఆహారాలకు మాత్రం దూరంగా ఉండటం చాలా మంచిది.

స్పైసీ ఫుడ్స్

స్పైసీ ఫుడ్స్

ఉదయం ఖాళీ కడుపుతో స్పైసీ ఫుడ్స్ తింటే.. మీ పొట్టలో తీవ్ర మంట వస్తుంది. ఇవి పేగులలో బాధను కలిగిస్తాయి. కాబట్టి స్పైసీ ఫుడ్ కి దూరంగా ఉండటం మంచిది.

డైరీ

డైరీ

పెరుగును ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవచ్చు. కానీ ఎసిడ్ రిఫ్లక్స్ కి కారణమవుతుంది. ఇందులో ఉండే లాక్టిక్ యాసిడ్ వల్ల హాని చేస్తుంది. కాబట్టి పాల ఉత్పత్తులకు ఉదయం దూరంగా ఉండటం మంచిది.

సాఫ్ట్ డ్రింక్స్

సాఫ్ట్ డ్రింక్స్

ఖాళీ కడుపుతో మాత్రమే కాదు.. ఎప్పుడు తీసుకున్నా.. సాఫ్ట్ డ్రింక్స్ హానికరమే. ఉదయాన్నే ఖాళీ కడుపుతో సాఫ్ట్ డ్రింక్స్ తీసుకుంటూ.. డైజెస్టివ్ ట్రాక్ లో గ్యాప్ కి కారణమవుతుంది. ఇది బ్లోటింగ్ కి కారణమవుతుంది. అన్ హెల్తీ షుగర్ మంచిది కాదు.

కాఫీ

కాఫీ

మనలో చాలామంది కాఫీతో రోజుని ప్రారంభిస్తాం. కానీ ఇందులో ఉండే హైడ్రో క్లోరిక్ యాసిడ్ హాని చేస్తుంది. పొట్టలో ఏ ఆహారం లేకుండా.. ఈ యాసిడ్ డైరెక్ట్ గా పొట్టలోకి వెళ్తే.. చాలా అనర్థం జరుగుతుంది.

బీన్స్

బీన్స్

బీన్స్ ని ఉదయం పరకడుపున తీసుకుంటే.. అలసట, గ్యాస్ కి కారణమవుతుంది. మీ శరీరం వీటిని జీర్ణం చేయడానికి కష్టంగా ఫీలవుతుంది.

బీర్

బీర్

ఉదయం ఖాళీ కడుపుతో బీర్ తాగితే.. బర్నింగ్, తలనొప్పి, బ్లోటింగ్ కి కారణమవుతుంది.

సీట్రస్ ఫ్రూట్స్

సీట్రస్ ఫ్రూట్స్

సిట్రస్ ఫ్రూట్స్ హెల్తీయే కానీ.. ఉదయాన్నే పరకడుపున తీసుకుంటే మాత్రం.. ఎసిడిటీ, హార్ట్ బర్న్, అల్సర్లకు కారణమవుతుంది. వీటిల్లో యాసిడ్ ఉంటుంది.

టమోటా

టమోటా

టమోటాలో యాసిడ్ ఉంటుంది. దీన్ని ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే గ్యాస్ట్రిక్, అల్సర్, ఎసిడిటీకి కారణమవుతుంది.

English summary

Don’t Eat These Foods On Empty Stomach!

Don’t Eat These Foods On Empty Stomach! There are some foods which could harm your health when consumed on empty stomach. But some of us do eat them on a daily basis unknowingly. What are they? Read on to know…
Story first published: Wednesday, December 7, 2016, 16:37 [IST]
Desktop Bottom Promotion