For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కాకరకాయ, ఉల్లిపాయ జ్యూస్ తాగితే శరీరంలో జరిగే అద్భుత మార్పులు..!

By Swathi
|

రకరకాల అనారోగ్య సమస్యలు, వ్యాధులు నివారించడానికి న్యాచురల్, హెర్బల్ రెమిడీస్ ఉపయోగపడతాయి. ఇప్పుడు వెజిటబుల్స్, ఫ్రూట్స్ లో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఎఫెక్టివ్ గా వ్యాధులను నయం చేస్తాయని.. ప్రతి ఒక్కరిలో అవగాహన ఉంది.

అనేక అధ్యయనాలు.. వెజిటబుల్స్, ఫ్రూట్స్ లో కొన్ని రకాల వ్యాధులను నివారించే, అరికట్టే సత్తా కలిగి ఉన్నాయని, మందుల కంటే.. ఇవే న్యాచురల్ గా ట్రీట్మెంట్ అందిస్తాయని తెలుపుతున్నాయి. ముఖ్యంగా మెడిసిన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.

అదే న్యాచురల్ రెమిడీస్ ని వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఉపయోగించే ఫాలో అయితే.. శరీరానికి పోషణ అందించి.. జనరల్ హెల్త్ ని మెరుగుపరుస్తాయి. మీకు తెలుసా.. కాకరకాయ, ఉల్లిపాయ జ్యూస్.. 7 రకాల వ్యాధులను నయం చేస్తుంది. మరి ఈ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుని ఇవాళ్టి నుంచే తాగడం మొదలుపెట్టండి.

కావాల్సిన పదార్థాలు
కాకరకాయ - 1
ఆనియన్ - సగం
తేనె - టేబుల్ స్పూన్

హెల్త్ డ్రింక్ తయారు చేసే విధానం
కాకరకాయ తొక్క తీసి, ఆనియన్ స్కిన్ కూడా తీసేసి.. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి
ఈ ముక్కలను బ్లెండర్ లో వేసి.. కొన్ని నీళ్లు కలిపి.. బాగా గ్రైండ్ చేయాలి
ఈ జ్యూస్ ని ఒక కప్పులోకి తీసుకుని తేనె కలపాలి
ఈ మిశ్రమాన్ని వడకట్టకూడదు
ప్రతి రోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ కి ముందు తీసుకోవాలి
ఇప్పుడు ఈ హెల్తీ డ్రింక్ వల్ల పొందే సీక్రెట్ బెన్ఫిట్స్ తెలుసుకుందాం..

టైప్ టు డయాబెటిస్

టైప్ టు డయాబెటిస్

ఆనియన్, కాకరకాయ మిశ్రమంలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే పాలిపెప్టైడ్ పి అనేది ఉంటుంది. ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ ని తగ్గిస్తుంది. ఇలా.. టైప్ టు డయాబెటిస్ ని నివారిస్తుంది.

శిశువు హెల్త్

శిశువు హెల్త్

గర్భిణీ స్త్రీలు ఈ హెల్త్ డ్రింక్ తాగడం వల్ల.. శిశువులో అబ్ నార్మాలిటీస్ తగ్గించుకోవచ్చు. ఈ డ్రింక్ లో ఫోలేట్ ఎక్కువగా ఉంటుంది. ఇది పొట్టలోని బేబీ కణాలకు పోషణ అందించడానికి సహాయపడుతుంది.

ఏజింగ్ ప్రాసెస్

ఏజింగ్ ప్రాసెస్

ఉల్లిపాయ, కాకరకాయ కాంబినేషన్ లో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఏ ఎక్కువగా ఉంటాయి. ఇవి.. ఫ్రీరాడికల్స్ వల్ల కణాలకు ఎఫెక్ట్ కాకుండా కాపాడతాయి. అలాగే ప్రీమెచ్యూర్ ఏజింగ్ లక్షణాలను దూరంగా ఉంచుతుంది.

డైజెషన్ ప్రాసెస్

డైజెషన్ ప్రాసెస్

ఆనియన్, కాకరకాయ జ్యూస్.. బోవెల్ మూమెంట్స్ ని రెగ్యులేట్ చేసి.. పొట్టలో యాసిడ్స్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. దీనివల్ల కాన్స్టిపేషన్, ఎసిడిటీని నివారించవచ్చు.

ఇన్ఫెక్షన్స్

ఇన్ఫెక్షన్స్

కాకరకాయ, ఉల్లిపాయ జ్యూస్ శరీరంలో ఇన్ల్ఫమేషన్, ఇన్ఫెక్షన్ ని నివారిస్తుంది. ఇందులో యాంటీ సెప్టిక్ గుణాలు పుష్కలంగా ఉంటాయి.

బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించడానికి

బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించడానికి

ఈ న్యాచురల్ హెల్త్ డ్రింక్ బ్లడ్ లో కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అలాగే ధమనుల్లో పేరుకున్న ఫ్యాట్ ని కరిగిస్తుంది.

ఇమ్యూనిటీ సిస్టమ్

ఇమ్యూనిటీ సిస్టమ్

కాకరకాయ, ఉల్లిపాయ జ్యూస్ మీ కణాలకు పోషణ అందిస్తుంది. ఇందులో ఉండే విటమిన్స్, మినలరల్స్ కంటెంట్.. ఇమ్యునిటీని హెల్తీగా, స్ట్రాంగ్ గా ఉంచుతుంది.

English summary

Drink Karela And Onion Juice, Watch What Happens To Your Body!

Drink Karela And Onion Juice, Watch What Happens To Your Body! Did you know that the mixture of karela (bitter gourd) and onion can treat up to 7 disorders? Well, here's a look at how you can prepare and consume this health drink.
Story first published:Monday, July 4, 2016, 18:49 [IST]
Desktop Bottom Promotion