For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ట్యాబ్లెట్స్ కంటే నిమ్మరసమే సరైన మెడిసిన్ అనడానికి కారణాలు..!!

ఒకే ఒక గ్లాసు నిమ్మరసంలో రోజుని ప్రారంభించడం చాలా అద్భుతమైన ఐడియా అని చాలామంది ఎక్స్ పర్ట్స్ సూచిస్తూ ఉంటారు. ముందుగా నీటిని వేడి చేసి చల్లారిన తర్వాత నిమ్మరసం కలుపుకుని తీసుకోవాలి.

By Swathi
|

ఒకే ఒక గ్లాసు నిమ్మరసంలో రోజుని ప్రారంభించడం చాలా అద్భుతమైన ఐడియా అని చాలామంది ఎక్స్ పర్ట్స్ సూచిస్తూ ఉంటారు. ముందుగా నీటిని వేడి చేసి చల్లారిన తర్వాత నిమ్మరసం కలుపుకుని తీసుకోవాలి. దీన్ని బ్రేక్ ఫాస్ట్ కి ముందు తీసుకుంటే.. పోషకాలు అందించి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

Drink Lemon Juice Instead of Pills If You Have One of These Problems

నిమ్మరసంలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ బి, సి, ప్రొటీన్, ఫాస్పరస్, ఫ్లేవనాయిడ్స్, పొటాషియం ఉంటాయి. అలాగే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు ఉండటం వల్ల ఇమ్యునిటీని మెరుగుపరిచి.. ఎలాంటి ఇన్ఫెక్షన్ తో అయినా పోరాడుతుంది.

చాలా సింపుల్ గా, ప్రతి ఒక్కరూ తీసుకోగలిగే.. చౌకైన నిమ్మరసంలో చాలా ఔషధ గుణాలున్నాయి. ఎంత ఎఫెక్టివ్ గా పనిచేస్తాయంటే.. మెడిసిన్స్ కూడా అవసరం లేకుండా అనేక రకాల వ్యాధులను ఎఫెక్టివ్ గా నయం చేస్తుంది. అది నిమ్మరసం పవర్ అంటే. ట్యాబ్లెట్స్ అవసరం లేకుండా.. నిమ్మరసంను ఉపయోగించాల్సిన వ్యాధులేంటి, నిమ్మరసంలోని అమేజింగ్ హెల్త్ బెన్ఫిట్స్ ఏంటో చూద్దామా..

కిడ్నీ స్టోన్స్

కిడ్నీ స్టోన్స్

నిమ్మరసంను ఒక గ్లాసు ప్రతిరోజూ తీసుకోవడం వల్ల కిడ్నీ స్టోన్స్ ని ఎఫెక్టివ్ గా తొలగిస్తుంది. నిమ్మరసం ద్వారా ఎక్కువ పొటాషియం లభిస్తుంది. ఇది సిట్రేట్ లెవెల్స్ ని పెంచి.. ఆక్సలేట్స్ ని తగ్గిస్తుంది. అలా.. కిడ్నీ స్టోన్స్ తొలగిపోతాయి.

ఇమ్యునిటీ

ఇమ్యునిటీ

నిమ్మరసంలో విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల.. ఇమ్యునిటీని ఎఫెక్టివ్ గా పెంచుతుంది. దీంతో ఇన్ఫెక్షన్స్ దరిచేరవు.

గాల్ బ్లాడర్

గాల్ బ్లాడర్

నిమ్మరసం గాల్ బ్లాడర్ స్టోన్స్ ని కూడా తొలగించి, నొప్పి నివారిస్తుంది. కాబట్టి భోజనంతో పాటు నిమ్మరసంను తీసుకుంటే.. ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.

డెటాక్సిఫికేషన్

డెటాక్సిఫికేషన్

నిమ్మరసంలో పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి శరీరాన్ని డెటాక్సిఫై చేస్తాయి. దీంతో శరీరంలో ఉన్న హానికారక మలినాలన్నీ తొలగిపోతాయి.

చర్మానికి

చర్మానికి

నిమ్మరసంలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల చర్మాన్ని బ్రైట్ గా మారుస్తాయి. చర్మంపై మచ్చలు, ముడతలు, వయసు చాయలను తేలికగా తొలగిస్తుంది. నిమ్మరసం రక్తాన్ని క్లెన్స్ చేయడం ద్వారా చర్మాన్ని బ్రైట్ గా మారుస్తుంది.

ఫైబర్

ఫైబర్

నిమ్మరసంలో పెక్టిన్ ఫైబర్ ఉంటుంది. ఇది బోవెల్ మూవ్మెంట్స్ ని రెగ్యులేట్ చేసి.. కోలన్ ని క్లీన్ గా ఉంచుతుంది. అలాగే పెక్టిన్ స్ట్రాంగ్ యాంటీ సెప్టిక్ గా పనిచేస్తుంది.

బరువు తగ్గడం

బరువు తగ్గడం

నిమ్మరసంలో పెక్టిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుందని.. తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే ఫైబర్ బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.

పీహెచ్ బ్యాలెన్స్

పీహెచ్ బ్యాలెన్స్

ఒకగ్లాసు గోరువెచ్చని నిమ్మరసం ఉదయాన్నే తాగడం వల్ల శరీరంలో పీహెచ్ ని బ్యాలెన్స్ చేస్తుంది. అలాగే నిమ్మలో ఎసిడిక్ గా ఉంటాయి.

జీర్ణ సమస్యలు

జీర్ణ సమస్యలు

ప్రతిరోజూ ఒకే ఒక గ్లాసు నిమ్మరసం తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. దీంతో కాన్ట్సిపేషన్, గ్యాస్ట్రిక్స్ వంటి సమస్యలు దూరంగా ఉంటాయి.

బ్యాక్టీరియా

బ్యాక్టీరియా

నిమ్మరసం యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను కలిగి ఉంటుంది. కాబట్టి.. రెగ్యులర్ గా నిమ్మరసం తాగడం వల్ల.. శరీరంలో చెడు బ్యాక్టీరియా గ్రోత్ ని అడ్డుకుంటుంది.

ఇన్ల్ఫమేషన్

ఇన్ల్ఫమేషన్

నిమ్మరసం ఇన్ల్ఫమేషన్, జాయింట్ పెయిన్ తగ్గించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా మోకాళ్ల నొప్పులను తగ్గిస్తుంది.

ఫ్లూ

ఫ్లూ

నిమ్మరసంలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని, ఇమ్యునిటీని మెరుగుపరుస్తాయి. అలాగే నిమ్మలో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. కాబట్టి చలికాలంలో నిమ్మరసం ఎక్కువగా తీసుకుంటే ఫ్లూ, జలుబు వంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చు.

English summary

Drink Lemon Juice Instead of Pills If You Have One of These Problems

Drink Lemon Juice Instead of Pills If You Have One of These Problems. Lemon juice is abundant in nutrients, among which flavonoids, which have powerful antioxidant properties.
Desktop Bottom Promotion