For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రోజూ పరగడుపున మేథి వాటర్ ఒక నెలరోజులు తాగితే అద్భుత ప్రయోజనాలు..!!

రాత్రి నిద్రించే ముందు ఒక గ్లాసు నీళ్ళల్లో ఒక టీస్పూన్ మెంతులను వేసి మూత పెట్టి నానబెట్టాలి. ఉదయం నిద్రలేవగానే నీడిని వడగట్టి పరడగడుపున తాగాలి. ఇందులో దాగున్న ఆరోగ్య ప్రయోజనాలను కంటిన్యుగా పొందాలనుకుం

|

ప్రతి ఇంట్లో పోపుల పెట్టేలో మెంతులు తప్పనిసరిగా ఉంటాయి, వీటిని ఏదో ఒక రూపంలో వంటలకు వాడుతుంటాము. మెంతి పొడిని ఊరగాయల్లోనూ, మెంతి పప్పు, మెంతి చారు, మెంతి పులుసు, పోపుల్లోనూ విరివిగా వాడుతుంటాము. మెంతి ఆకులను పప్పు, ఫ్రైడ్ రైస్, పులావ్ లకు ఎక్కువగా వాడుతుంటారు .

మెంతులను ఇంగ్లీషులో ఫెనుగ్రీక్ సీడ్స్ అని అంటారు. హిందీలో మేతీ అని పిలుస్తారు. వీటికి మంచి సువాసన వున్న కారణంగా వంటకాలలో వాడతారు. మెంతులలో కావలసినంత పీచు వుంటుంది. మెంతి ఆకుల్లో ఇనుము సమృద్ధిగా ఉంటుంది. దీంతోపాటు విటమిన్‌-సి, బి1, బి2, కాల్షియం కూడా ఉంటాయిఅతి తక్కువ కేలరీలు. యాంటీ యాక్సిడెంట్స్ , యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉన్నాయి. అందుకే దీన్ని హెల్తీ మసాలా దినుసుగా సూచిస్తుంటారు . మంచి సువాసనగా ఉండే ఈ ఎల్లో కలర్ మెంతులు కొద్దిగా బిట్టర్ టేస్ట్ కలిగి ఉంటాయి. మెంతుల్లో నేచురల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి వివిధ రకాల ఆరోగ్య సమస్యలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. కేవలం మెంతుల్లోనే కాదు, మేతీ వాటర్ లో కూడా అద్భుతమైన ప్రయోజనాలున్నాయి.

Drink Methi (Fenugreek) Water For A Month And See What Happens!

రాత్రి నిద్రించే ముందు ఒక గ్లాసు నీళ్ళల్లో ఒక టీస్పూన్ మెంతులను వేసి మూత పెట్టి నానబెట్టాలి. ఉదయం నిద్రలేవగానే నీడిని వడగట్టి పరడగడుపున తాగాలి. ఇందులో దాగున్న ఆరోగ్య ప్రయోజనాలను కంటిన్యుగా పొందాలనుకుంటే క్రమం తప్పకుండా కంటిన్యుగా ఒక నెలరోజుల పాటు ఇలా మేతి వారటర్ తాగడం వల్ల అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. ఇందులో ఉండే వివిధ రకాల మెడిసినల్ లక్షణాల కారణంగా మెంతులను ఆయుర్వేదం మరియు హోమియోపతిలో కూడా విరివిగా ఉపయోగిస్తున్నారు.

మేతి వాటర్ లో 8 మేజర్ హెల్త్ బెనిఫిట్స్ ..

బరువు తగ్గిస్తుంది:

బరువు తగ్గిస్తుంది:

మెంతులను నానబెట్టి వాటర్ తాగడం మరియు నానబటిన మెంతులను తినడం వల్ల ఆకలి తగ్గుతుంది. ఇలా ఒక నెల తింటే మంచి ఫలితం ఉంటుంది.వేగంగా బరువు తగ్గుతారు.

 జీర్ణశక్తిని పెంచుతారు:

జీర్ణశక్తిని పెంచుతారు:

మేతీ వాటర్ జీర్ణశక్తిని పెంచుతుంది. యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు స్టొమక్ బర్నింగ్ నుండి ఉపశమనం కలిగిస్తుంది.

బ్లడ్ ప్రెజర్ కంట్రోల్ చేస్తుంది:

బ్లడ్ ప్రెజర్ కంట్రోల్ చేస్తుంది:

మెంతుల్లో గాలక్టోమెన్ మరియు పొటాషియం కంటెంట్ అధికంగా ఉంటుంది. ఈ రెండు పదార్థాలు బ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్ చేయడంలో గ్రేట్ గా సహాయపడుతాయి.

కొలెస్ట్రాల్ లెవల్ ను తగ్గిస్తుంది:

కొలెస్ట్రాల్ లెవల్ ను తగ్గిస్తుంది:

మెంతులు బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. అదే సమయంలో మంచి శరీరంలో మంచి కొలెస్ట్రాల్ ను మెయిటైన్ చేయడానికి సహాయపడుతుంది.

 ఆర్థ్రైటిస్ :

ఆర్థ్రైటిస్ :

మేతీ వాటర్ లో ఉండే యాంటీఆక్సిడెంట్స్, యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు ఆర్థ్రైటిస్ పెయిన్ తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

క్యాన్సర్ నివారిణి:

క్యాన్సర్ నివారిణి:

నానబెట్టిన మెంతుల్లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో టాక్సిన్స్ ను నివారిస్తుంది. ముఖ్యంగా కోలన్ శుభ్రం చేస్తుంది. దాంతో క్యాన్సర్ ను నివారించుకోవచ్చు.

డయాబెటిస్ నివారిస్తుంది:

డయాబెటిస్ నివారిస్తుంది:

మెంతుల్లో గ్లూటమిన్ అనే కంటెంట్ ఫైబర్ కు మంచి మూలం.ఇది బ్లడ్ లో షుగర్ అబ్షార్బన్ ను తగ్గిస్తుంది. దాంతో డయాబెటిస్ ను నివారించుకోవచ్చు.

కిడ్నీ స్టోన్స్ నివారిస్తుంది:

కిడ్నీ స్టోన్స్ నివారిస్తుంది:

మెంతులు నానబెట్టిన వాటర్ ను ప్రతి రోజూ ఉదయం పరగడపున తాగడం వల్ల కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయి.

English summary

Drink Methi (Fenugreek) Water For A Month And See What Happens!

Drink Methi (Fenugreek) Water For A Month And See What Happens!,These might taste a little bitter but these small yellow-coloured seeds are a storehouse of natural medicine and can be used to cure and prevent a lot of health problems. So today in this article we will be explaining about the numerous health be
Story first published: Friday, December 9, 2016, 11:08 [IST]
Desktop Bottom Promotion