Latest Updates
-
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై -
ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశ..మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
భోజనం తర్వాత కాదు.. ఉదయాన్నే తింటేనే మంచిది
పండ్లు ఆరోగ్యానికి మంచిది అని అందరికీ తెలుసు. వీటిని నిత్యం ఏదో ఒక విధంగా.. ఏదో ఒక సందర్భంలో తినాలని భావిస్తారు. చాలామంది భోజనం తర్వాత ఫ్రూట్స్ తినడానికి ఇష్టపడతారు. అదే అలవాటుగా మారి ఉంటుంది. ఇలా భోజనం తర్వాత పండ్లు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిదని అందరికీ ఒక నమ్మకం ఉంది. కానీ.. పండ్లను ఉదయాన్నే పరగడుపున తీసుకుంటే మరింత ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చంటున్నాయి తాజా అధ్యయనాలు.
భోజనం తర్వాత పండ్లు తీసుకోవడం వల్ల వీటి ద్వారా విడుదలయ్యే రసాలు.. గ్యాస్, పొట్టలో సమస్యలకు కారణమవుతాయట. కాబట్టి కొన్ని రకాల పండ్లను ఉదయాన్నే పరగడపున తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా ఉదయాన్నే తీసుకోవడం వల్ల వాటి ద్వారా మరింత ప్రయోజనం పొందడమే కాదు.. ఆరోగ్యానికి కూడా అనేక ప్రయోజనాలు ఉంటాయని సూచిస్తున్నారు.

జామ
జామపండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ పండును ఉదయాన్నే తీసుకుంటే.. రోజంతటికీ కావాల్సిన విటమిన్ సి సులభంగా పొందవచ్చట. అలాగే ఇందులో ఫైబర్ కూడా ఎక్కువ ఉండటం వల్ల మలబద్ధక సమస్యలు దరిచేరవని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఆరంజ్
తక్కువ ధరలో ఎక్కువ ప్రయోజనాలు ఆరంజ్ ద్వారా పొందవచ్చు. ఉదయాన్నే పరగడపున కమలాపండ్లు తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకున్న కొవ్వు సులభంగా తగ్గుతుందట. అలాగే.. విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. జలుబు సమస్యను నివారించడంలో మంచి ఔషధంలా పనిచేస్తుంది కమలాపండు.

బొప్పాయి
బొప్పాయిని కొంతమంది ఇష్టపడరు. మరికొంతమంది అమితంగా ఇష్టపడతారు. దీని ద్వారా కూడా విటమిన్ సి అధికంగా పొందవచ్చు. కాబట్టి.. దీన్ని పరగడపున తీసుకుంటే.. శరీరంలో మలినాలు, విషపదార్థాలు బయటకు పోయి.. అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది. ఇందులో కెరోటిన్ ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యానికి మంచిది.
యాపిల్
యాపిల్ ని ఉదయాన్నే తీసుకోవడం వల్ల పెద్ద పేగు క్యాన్సర్ ముప్పు నుంచి బయటపడవచ్చు అంటున్నాయి అధ్యయనాలు. దీన్ని ఉదయాన్నే తీసుకుంటే.. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ గుండెలో అధిక కొవ్వు పేరుకోకుండా కాపాడతాయని నిపుణులు సూచిస్తున్నారు.ః
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications