For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒక నెలలో ఎముకలను స్ట్రాంగ్ గా మార్చే అమేజింగ్ హెల్త్ డ్రింక్..

By Swathi
|

మీరు తరచుగా కీళ్ల నొప్పలను ఎదుర్కొంటున్నారా ? తరచుగా ఫ్రాక్చర్స్, జాయింట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయా ? ఒకవేళ ఇలాంటి సమస్యలు మీరు ఫేస్ చేస్తున్నారు అంటే.. మీ ఎముకలు బలహీనమవుతున్నాయని సంకేతం. మీ ఆరోగ్యం విషయంలో.. ఇది మంచి లక్షణం కాదు.

మనుషుల శరీరానికి ఎముకలు పునాది లాంటివి. ఇవి శరీరంలోని అనేక కదలికలు, పనితీరులను, అవయవాలకు రక్షణ కల్పించడం వంటి.. కీలక పాత్రలు పోషిస్తాయి. బ్లడ్ సెల్స్, స్టోరేజ్ మినరల్స్, ఎండోక్రైన్ రెగ్యులేషన్ వంటి వాటి పనితీరు బాధ్యత ఎముకల నిర్మాణానిదే.

మెదడు, గుండె, ఊపిరితిత్తులకు కూడా ఎముకలే.. రక్షణ కల్పిస్తాయి. అలాగే ఎముకల ఆరోగ్యాన్ని మెయింటెయిన్ చేయడం కూడా.. చాలా ముఖ్యం. సరైన డైట్ పాటించకపోవడం, వ్యాయామం చేయకపోవడం, ఇన్ఫెక్షన్స్, వారసత్వం, ఇతర వ్యాధి లక్షణాల వల్ల కూడా ఎముకల వ్యాధులు ఎదురవుతాయి.

Have You Heard Of This Homemade Recipe For Stronger Bones

ఎప్పుడైతే ఎముకలు బలహీనమవుతాయో.. కదలికలకు ఇబ్బందిగా మారుతుంది. చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేకపోతారు. దాంతో పాటు కీళ్ల నొప్పులు, ఆస్టియోపోరోసిస్ కూడా వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి.. ఎముకలు ఎప్పుడు బలంగా ఉండేలా జాగ్రత్త పడాలి. ఒక నెలలో ఎముకలను న్యాచురల్ గా బలంగా మార్చుకోవాలి అంటే.. ఈ హోంమేడ్ డ్రింక్ తాగాలి.

కావాల్సిన పదార్థాలు
తేనె 2 టేబుల్ స్పూన్లు
నువ్వులు 1 టేబుల్ స్పూన్
గుమ్మడి విత్తనాలు అర టేబుల్ స్పూన్

Have You Heard Of This Homemade Recipe For Stronger Bones

తేనె, నువ్వులు, గుమ్మడి విత్తనాలు.. ఎముకలను బలంగా మార్చేస్తాయి. క్రమం తప్పకుండా.. నెల రోజులపాటు రెగ్యులర్ గా ఈ డ్రింక్ తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా, హెల్తీగా మారుతాయి. ఈ మూడింటి మిశ్రమం క్యాల్షియం గ్రహించే సత్తాను ఎముకల్లో పెంచుతుంది. విటమిన్ డి, ఇతర మినరల్స్, అందించి, ఆరోగ్యంతో పాటు, పోషణను అందిస్తాయి.

ఈ న్యాచురల్ హెల్త్ డ్రింక్ లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల ఎముకలకు హాని కలిగించే ఇన్ఫెక్షన్స్, ఇన్ల్ఫమేషన్ నివారిస్తుంది. ఈ డ్రింక్ తో పాటు క్యాల్షియం, విటమిన్స్ ఎక్కువగా ఉండే హెల్తీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల.. ఎముకలు చాలా బలంగా, హెల్తీగా మారతాయి. అలాగే కొంచెం శారీరక వ్యాయామాలు ప్రతిరోజూ చేయడం వల్ల మరింత ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు.

Have You Heard Of This Homemade Recipe For Stronger Bones

డ్రింక్ తయారు చేసే విధానం
పైన చెప్పిన పదార్థాలన్నింటిని సరైన మోతాదులో తీసుకుని బ్లెండర్ లో వేయాలి.
అన్నింటినీ బాగా గ్రైండ్ చేసి పేస్ట్ చేసుకోవాలి.
కొన్ని పాలు తీసుకుని కాచుకోవాలి.
ఒక కప్పు వేడి పాలలోకి పైన గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని కలపాలి.
బాగా మిక్స్ చేసిన తర్వాత.. తాగాలి.
ఈ డ్రింక్ ని ప్రతిరోజూ బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత తీసుకుంటే మెరుగైన ఫలితాలు పొందవచ్చు.

English summary

Have You Heard Of This Homemade Recipe For Stronger Bones??

Have You Heard Of This Homemade Recipe For Stronger Bones?? When your bones become weak, your movements get impaired to a considerable extent, making simple tasks seem quite strenuous, causing joint pain and osteoporosis.
Story first published:Monday, June 20, 2016, 14:21 [IST]
Desktop Bottom Promotion