For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొంచెం వగరు..కొంచెం తీపి..ఆరోగ్యానికెంతో బెటర్ ..!

|

ప్రస్తుతం మార్కెట్లో ఎక్కడ చూసినా కరర్ ఫుల్ గా నేరేడు పండ్లతో కళకళలాడుతున్నది. వర్షాకాలం మొదలైతే చాలు..నేరుడు పండ్ల సీజన్ ప్రారంభమైవుతుంది. ప్రతి సీజన్ లనూ ఆ సీజన్ కు మాత్రమే పరిమితమైన కొనని పండ్లు, పువ్వులు లభిస్తుంటాయి. అలా వర్షాకాలంలో నేచర్ మనుకు గిప్ట్ గా ఇచ్చిన అమేజింగ్ అండ్ హెల్తీ ఫ్రూట్స్ లో నేరేడుపండ్లు ఒకటి.

చూడటానికి నల్లగా, నిగనిగలాడుతూ ద్రాక్ష పండ్లలా నోరూరిస్తుండే నేరుడు పండ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. నేరుడు పండ్లు పిల్లలకు మాత్రమే కాదు, పెద్దలందరికి కూడా చాలా అరోగ్యకరం. నేరుడు పండ్లలో పోషకాలు మెండుగా ఉంటాయి. కేవలం పండే కాదు, నేరేడు చెట్టు ఆకులు, గింజలు, బెరడు..ఇలా అన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే. నేరేడు మధుమేహం, క్యాన్సర్ వంటి వివిధ ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చూపుతుంది. ఇంతటి ప్రత్యేకత ఉన్న నేరేడులో ఉండే ఇతర పోషక విలువలేమిటో ? అవి ఆరోగ్యానికి ఏవిధంగా మేలు చేస్తాయో తెలుసుకుందాం...

Medicinal benefits of Black Plum or Jambul fruit

ప్రయోజనాలగురించి తెలుసుకునే ముందు బాగా పండిన నేరేడు పండులో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ పుష్కలంగా లభిస్తాయి. ఇతర పండ్లతో పోల్చి చూస్తే మినిరల్స్ అధికంగా, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి, దీన్ని తినడం వల్ల బరువు పెరుగుతామన్న దిగులు కూడా ఉండదు. నేరుడు గింజల నుండి కూడా అధిక సంఖ్యలో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొద్ది మొత్తంలో క్యాల్షియం, విటమిన్ బి, సి, ఐరన్ లు కూడా లభిస్తాయి. ప్రతి వంద గ్రాముల నేరేడు పండ్లలో రెండు మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. శరీరానికి రోజుకి కావల్సిన విటమిన్ సి నలభై మిల్లీగ్రాములైతే..వందగ్రాముల నేరుడులో 18మిల్లీగ్రాముల దాకా ఉంటుంది .

కెరోటిన్, ఫైటోకెమికల్స్ (యాంటీఆక్సిడెంట్లు), మెగ్నీషియం, పొటాసియం, పీచుపదార్థాలు, మొదలైన పోషకాలన్నీ కూడా నేరుడు నుంచి మనకు లభిస్తాయి. అలాగే నేరుడు చెట్టుకు ఆకుల్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు దంతాలను స్ట్రాంగ్ గా ఉంచడతో పాటు చిగుళ్ల సమస్యలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

Medicinal benefits of Black Plum or Jambul fruit

లివర్ సమస్యలను మెరుగుపరుస్తుంది: నేరుడు పండులో ఉండే గుణాలు కాలేయం యొక్క పనితీరును మెరుగుపరుస్తుంది. ఈ పండులో ఉండే నేచుల్ ఆమ్లాలు జీర్ణశక్తిని పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతాయి.

Medicinal benefits of Black Plum or Jambul fruit

కోరింత దగ్గు నివారిస్తుంది: వర్షాకాలంలో జలుబు, దగ్గు..వంటి ఆరోగ్య సమస్యలు రావడం సహజం. నేరేడు కూడా వర్షాకాలంలో లభించే పండు కాబట్టి, వీటిని తినడం వల్ల జలుబు, కోరింత దగ్గు, దీర్ఘకాలంగా వేధించే దగ్గు, ఆస్తమా..లాంటి సమస్యలను నుంచి విముక్తి పొందవచ్చు.

Medicinal benefits of Black Plum or Jambul fruit

పైల్స్ నివారణకు తోడ్పడుతుంది. ఈ సీజన్ లో నేరేడు పండును రోజూ ఉదయం ఉప్పుతో పాటు తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. పైల్స్ సమస్యతో బాధపడుతున్న వారు నేరేడు పండును తేనెతో పాటు తీసుకుంటే మంచిది.

Medicinal benefits of Black Plum or Jambul fruit

ఇమ్యూనిటి పెంచుతుంది: వర్షాకాలంలో వచ్చే వివిధ జబ్బుల నుండి శరీర ఆరోగ్యాన్ని కాపాడుకొనే శక్తిని నేరుడు అందిస్తుంది.

Medicinal benefits of Black Plum or Jambul fruit

క్యాన్సర్ నివారిణిని: నేరేడులో ఉండే బయోయాక్టివ్ ఫోటో కెమికల్స్, పాలిఫినోల్స్ క్యాన్సర్ రాకుండా నివారిస్తాయి. కీమోథెరఫీ వంటి క్యాన్సర్ చికిత్సలు చేయించుకునే సమయంలో నేరడు పండ్లను ఆహారంగా తీసుకోవటం వల్ల చక్కటి ప్రయోజనం ఉంటుంది. క్యాన్సర్ రాకుండా రక్షస్తుంది.

Medicinal benefits of Black Plum or Jambul fruit

డయాబెటిస్ కంట్రోల్ చేస్తుంది: డయాబెటిస్ ను అదుపులో ఉంచడానికి ఆయుర్వేద మందుల్లో నేరేడు పండు గింజల్ని వాడతారు.

Medicinal benefits of Black Plum or Jambul fruit

డయేరియాకు : డయోరియాతో బాధపడేవారు నేరుడు చక్కటి పరిష్కార మార్గం. నేరుడు పండ్ల గింజలను పొడిగా చేసుకునిమజ్జిగలో కలుపుకుని తాగితే సమస్య నుంచి బయటపడొచ్చు. నేరేడు చెట్టు బెరడును మెత్తగా నూరి కాషాయంలా తయారుచేసుకుని దానిలో తేనె కలుపుకుని తీసుకున్నా డయేరియా నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు.

English summary

Medicinal benefits of Black Plum or Jambul fruit

Jambul or Jamun fruit is multi-use in nature. Firstly, in the ripe stage it is simply consumed as a fruit. It is advised to have jamun fruit with salt due to some health reasons. Black Plum is used to prepare candies, jams, squash, juice, dessert items and many more.
Story first published: Monday, June 20, 2016, 11:23 [IST]
Desktop Bottom Promotion