Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
మధ్యాహ్నం నిద్రపోవడం అంత హానికరమా..? ఎందుకు ?
హాయిగా నిద్రపోవడం వల్ల పొందే ఫలితాలు అన్నీ ఇన్నీ కావు. మనందరికీ తెలుసు.. మంచి నిద్ర ఎంత అవసరమో. ప్రతిరోజూ ఖచ్చితంగా 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. అయితే.. రోజుకి 8 గంటలు నిద్రపోవాలి కదా ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోకూడదు. ఖచ్చితంగా రాత్రిపూటే.. సరిపడా నిద్రపొందేలా జాగ్రత్త పడాలి.
అయితే చాలామంది ఈ నిబంధన పాటించరు. ఒకవేళ ఈ నియమాన్ని ఖచ్చితంగా అందరూ ఫాలో అయితే.. మంచి ఆయుర్వేద ట్రీట్మెంట్ మాదిరిగా పనిచేసి.. అనేక వ్యాధులు దూరంగా ఉండేలా చేస్తుంది. అయితే కొంతమందికి పగటిపూట నిద్రపోయే అలవాటు ఉంటుంది.

కానీ.. అది ఏమాత్రం మంచిది కాదు. పగటి పూట నిద్రపోయే అలవాటు.. కొత్త వ్యాధులను తెచ్చిపెడుతుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. అసలు పగటి పూట ఎందుకు నిద్రపోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

అలవాటు
ధర్మ శాస్త్రం ప్రకారం మధ్యాహ్నం అస్సలు నిద్రపోకూడదు. దివస్వాపం చా వజ్రయేత్ అని శాస్త్రాల్లో వివరించారు. అంటే.. మధ్యాహ్నం పడుకోవడం సరైన అలవాటు కాదని అర్థం.

ఆడవాళ్లకు
చాలామంది గృహిణులకు మధ్యాహ్నం నిద్రపోవడం అలవాటుగా ఉంటుంది. అలాగే షిఫ్ట్ ల ప్రకారం పనిచేసే మగవాళ్లకు కూడా పగలు నిద్రపోయే అలవాటు ఉంటుంది.

ఆయుర్వేదం ప్రకారం
కేవలం శాస్త్రాలే కాదు.. ఆయుర్వేదం ప్రకారం కూడా పగటిపూట నిద్రపోకూడదు. ఒకవేళ మధ్యాహ్నం పడుకునే అలవాటు ఉంటే.. అనేక వ్యాధుల రిస్క్ ఉంటుందని ఆయుర్వేదం చెబుతోంది.

త్వరగా జలుబు
పగటి పూట ఎక్కువ నిద్రపోయేవాళ్లకు, పగలు నిద్రపోని వాళ్లతో పోల్చితే త్వరగా జలుబు వస్తుందని ఆయుర్వేదం చెబుతోంది.

లంగ్స్ కి సమస్య
ఎక్కువగా జలుబు చేయడం మొదలైంది అంటే.. నెమ్మదిగా శ్వాససంబంధ సమస్యలు ఎదురవుతాయి. అలాగే ఊపిరితిత్తులు నాశనం అవడానికి అవకాశం ఉంటుంది.

రాత్రిపూట 7 నుంచి 8 గంటలు
రాత్రిపూట 7 నుంచి 8 గంటలు ఖచ్చితంగా నిద్రపోవాలి, వర్క్ కి వెళ్లడానికి ముందు ఈ నిద్ర చాలా అవసరమని సైన్స్ చెబుతోంది.

శరీరానికి కావాల్సిన రెస్ట్
కేవలం రాత్రి నిద్ర మాత్రమే.. శరీరానికి సరైన విశ్రాంతి అందించడంతో పాటు, రోజంతా స్టేబుల్ గా ఉంచడానికి సహాయపడుతుంది.

అనారోగ్య సమస్యలు
మధ్యాహ్నం నిద్రపోయే అలవాటు వల్ల.. మనం మనకు తెలియకుండానే.. శరీరాన్ని లేజీగా మార్చి, అనారోగ్య సమస్యలు తెచ్చుకోవడానికి కారణమవుతున్నాం.



Click it and Unblock the Notifications
