For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్లడ్ సర్క్యులేషన్ ని మెరుగుపరిచే శలంభ భుజంగాసనం (సింహిక ఫోజ్)

By Super Admin
|

సంస్కృతంలో శలంభ అంటే భుజానికి మద్దతు అని అర్ధం. ఈ ఆసనాన్ని నిర్వహించటం, ప్రారంభ భంగిమలను వేయటం చాలా సులభం. ఈ భంగిమను రక్త ప్రసరణ మెరుగుదలకు ఉత్తమంగా భావిస్తారు.

శరీరంలో అన్ని శరీర భాగాలకు ఆక్సిజన్ సరఫరా చేయటం రక్త ప్రసరణ వ్యవస్థ యొక్క ప్రధాన విధి. ఇది ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా గుండెపోటు, రక్తపోటు, ఊపిరితిత్తుల వ్యాధులు, అన్ని ప్రధాన సమస్యలతో సంబంధం కలిగి ఉంది. కేవలం ఈ సులభమైన ఈ యోగా భంగిమ ద్వారా ఈ సమస్యల నుండి బయట పడవచ్చు.

yoga

గుండె, ధమనులు,సిరలు ఎటువంటి అవరోధం లేకుండా పనిచేయటం శరీరానికి చాలా అవసరం. మన ఇంట్లో ఏదైనా అడ్డంకులు వస్తే ఆ శాఖకు ఫిర్యాదు చేస్తాం. అదే మన శరీరం లోపల ఏమి జరుగుతుందో తెలుసుకోవాలి? ఇలాంటి తెలియని అంతర్గత సమస్యలకు ఈ భంగిమ పరిష్కారం చూపుతుంది.

నిద్ర లేచిన వెంటనే మన శరీరంలో ఏం జరుగుతుందో అని ఆలోచించటం కన్నా దీర్ఘకాలం పాటు ఉపయోగకరంగా ఉండే యోగా చేస్తే మంచి శక్తి రావటమే కాకుండా కేలరీలు కూడా ఖర్చు అవుతాయి.

ఇప్పుడు శలభ భుజంగ ఆసనం వలన కలిగే అనేక ప్రయోజనాల గురించి చర్చిద్దాం. ఇప్పుడు ఈ ఆసనం ఎలా వేయాలో తెలుసుకుందాం.

1. మైదానంలో నుదురు, పొట్ట ప్లాట్ గా ఉంచుతూ కాళ్లను స్ట్రైట్ గా ఉంచాలి.

2. మీ కాళ్లు, పాదాలు, మడమలు ఒకదానికి ఒకటి తాకుతూ ఉండాలి.

yoga

3. మోచేతుల సపోర్ట్ తీసుకొని అరచేతులను నేల మీద ఉంచాలి.

4. ఇప్పుడు క్రమంగా గాలిని పీల్చుతూ ఛాతీ మరియు ఉదరంతో పాటు మీ తలను ఎత్తి సంతులనం చేయాలి.

5. మీ శ్వాసను గమనిస్తూ ప్రశాంతంగా ఉండండి. కొంచెం మీ స్పైన్ వక్రంగా ఉంటుంది. బహుశా ప్రారంభంలో, మీరు కొంచెం అసౌకర్యంగా భావిస్తారు. కానీ ఈ భంగిమ తర్వాత విశ్రాంతి పొందినప్పుడు మీరు ఊహించని ఉపశమనం కలుగుతుంది.

yoga
6. ఈ భంగిమ మొత్తం, మీ పాదాలు రెండు ఒకదానికి ఒకటి దగ్గరగా ఉండాలని గుర్తుంచుకోవాలి.

7. ఈ భంగిమలో 60 నుంచి 90 సెకన్ల పాటు ఉండాలి. ఆ తర్వాత మీరు సాధారణ స్థితిలోకి రావాలి.

ప్రయోజనాలు

వెన్నెముకకు శక్తిని ఇస్తుంది

ఉదర అవయవాల ఉద్దీపనకు సహాయపడుతుంది

ఛాతి మరియు భుజాల విస్తరణకు సహాయం

రక్త ప్రసరణ మెరుగుదల

శరీరంలో చైతన్యాన్ని నింపుతుంది

ఒత్తిడిని తగ్గిస్తుంది


హెచ్చరిక

గర్భధారణ సమయం మరియు ఉదర సంబంధ సమస్యలు ఉన్నవారు ఈ భంగిమను చేయకూడదు.

English summary

Salamba Bhujangasan (Sphinx Pose) To Improve Blood Circulation

Salamba Bhujangasan (Sphinx Pose) To Improve Blood Circulation. "Salamba" means Supported, "Bhujang" means Cobra in Sanskrit and "asana" is of course a pose.
Desktop Bottom Promotion