For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జిమ్ లో ఎక్కువ వర్కౌట్స్ చేయడం వల్ల ఎదురయ్యే శారీరక, మానసిక సమస్యలు...

By Super
|

వ్యాయామంతో ఆరోగ్యం.. ఆకర్షణ - జిమ్‌లపై యువత చూపు - సిక్స్‌, యైట్‌ ప్యాక్‌పై పెరుగుతున్న క్రేజీ - అందమైన శరీరాకృతి కోసం నిత్యసాధన. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ను కాపాడుకునేందుకు నిరంతరం కసరత్తు చేస్తున్నారు. యువకులు మొదలు పెద్దల వరకు 'జిమ్‌' జిమ్మని.. వ్యాయామశాలలవైపు పరుగులు తీస్తున్నారు. బిపి, షుగర్‌, కీళ్లనొప్పులు, ఊబకాయం, గుండె జబ్బుల నియంత్రణకు జిమ్‌లను ఉపయోగించుకుంటున్నారు. సిక్స్‌ప్యాక్‌, ఎయిట్‌ప్యాకంటూ యువకులు దేహదారుఢ్యం కోసం ఆరాటపడుతున్నారు. 'కండ కలవాడే మనిషి' అని చాటిచెప్పే ప్రయత్నాల్లో ఉన్నారు. 'ఆరోగ్యమే మహాభాగ్యం' అని పలువురు కావాల్సినంత 'బరువు' కోసం కుస్తీ పడుతున్నారు.

పురుషుల జిమ్ కిట్ లో ఉండాల్సిన వస్తువులు.!

ఆరోగ్య రక్షణతోపాటు చురుకుదనం కోసం ప్రజలు 'పరుగు'లు పెడుతు న్నారు. పట్టణాలల్లో వాకింగ్‌లు, జాగింగ్‌లు చేయడం సర్వసాధారణమైంది. అధునాతన జిమ్‌ల వైపూ పరుగులు తీసేవారున్నారు. ఏజెన్సీ లోనూ ఇటీవలికాలంలో జిమ్‌లు, వ్యాయామాల పట్ల ఆసక్తి పెరుగుతోంది. అధునాతన పరికరా లున్న జిమ్‌లూ అందుబాటులోకి వచ్చాయి. కండలు పెంచుకోవడానికి యువకులు, ఫిట్‌నెస్‌ కాపాడుకోవడానికి మధ్యవయస్కులు ఆరాట పడుతున్నారు. వివిధ జబ్బులున్న వారు సైతం వ్యాయామం చేసి వాటిని నియంత్రించుకుంటు న్నారు.

జిమ్ కన్నా యోగ ఉత్తమమైనదని చెప్పటానికి 15 కారణాలు

ఒక్కో అవయవానికి ఒక్కో పరికరం ఆందుబాటులోకి రాగా, నిత్యం సాధన చేస్తూ శరీరాకృతిని ఆందంగా మలుచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వ్యాయామంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పద్ధతులపై సలహాలు మీద ఎక్కువ అవగాహన లేకపోవడం వల్ల సమస్యలను ఎదుర్కొంటున్నారు. జిమ్ రెగ్యులర్ గా ఒక పరిమితిలో మాత్రమే చేయాలి. అలా కాకుండా ఒకేసారి జబ్బులు తగ్గించుకోవానో లేదా బరువు తగ్గాలనో ఎక్కువ సమయం చేయడం వల్ల మొదటికే మోసం వస్తుంది. ఓవర్ గా జిమ్ చేయడం వల్ల ఎదుర్కొనే సమస్యలేంటో చూద్దాం...

ఉశ్చ్వాస నిశ్చ్వాసలో తేడాలు:

ఉశ్చ్వాస నిశ్చ్వాసలో తేడాలు:

వ్యాయామం చేసేపుడు బ్రీతింగ్ లో మార్పులు రావడం ఓకే కానీ. కానీ వ్యాయామంలో కాకుండా వర్క్ చేసేప్పుడు, నార్మల్ గా ఉన్నప్పుడు బ్రీతింగ్ లో అసమతుల్యతలు కనబడితే జిమ్ లో ఎక్కువ కష్టపడుతున్నారాని గ్రహించాలి . ఈ సమస్య తగ్గించుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది . ఈ సమస్యతో పాటు, పాదాలు వాపు, ఎక్కువ జ్వరం రావడం, దగ్గు, జలుబు, బ్లూ ఫింగర్ ఫ్రింట్ ఇలాంటి సమస్యలున్నప్పుడు తప్పనిసరిగా డాక్టర్ ను కలవాలి.

వికారం మరియు వాంతులు:

వికారం మరియు వాంతులు:

వ్యాయామం సమయంలో సరీగా..క్రమబద్దంగా చేయలేప్పుడు స్వతహాగా మీఅంతట మీరే హార్డ్ వర్క్ చేయడం వల్ల వికారం మరియు వాంతులకు దారితీస్తుంది. అంతే కాదు ఓవర్ జిమ్ చేయడం వల్ల శరీరంలోని నీరు చెమట రూపంలో బయటకొచ్చేయడం వల్ల బాడీ డీహైడ్రేషన్ కు గురి అవుతుంది. ఇది కూడా ఒక కారణంగా చెప్పవచ్చు.

ఫీవర్:

ఫీవర్:

ఆరోగ్యం సరిగా లేనప్పుడు వ్యాయామం చేయడం మంచిది కాదు. ముఖ్యంగా మీకు జ్వరం ఉన్నప్పుడు వర్కౌట్స్ కు వెళ్ళకూడదు . అలా వెళ్లినట్లైతే వైరల్ ఇన్ఫ్లమేషన్ మరియు ఇన్ఫెక్షన్స్ కు గురికావల్సి వస్తుంది. బాడీ డీహైడ్రేషన్ మరియు ఓవర్ హీటింగ్ వల్ల వ్యాధుల మరిన్ని పెరుగుతాయి.

కండరాల సలుపులు:

కండరాల సలుపులు:

జిమ్ లో ఎక్కువ కష్టపడటం వల్ల జిమ్ చేసిన అరగంట తర్వాత లేదా కొద్ది సేపటి తర్వాత ఆరోగ్యం మీద ఎక్కువ ఏకాగ్రత కలిగి ఉండాలి. మరుసటి రోజు ఉదయం జాయింట్ పెయిన్స్ తో వర్కౌట్స్ చేయడానికి కష్టపడాల్సి వస్తుంది . అలా హార్డ్ గా చేయడం వల్ల ఆ ఎఫెక్ట్ రెండు మూడు రోజుల వరకూ అలాగే ఉంటుంది.

మూడ్ మారడం:

మూడ్ మారడం:

ఫిజిలక్ ఫెర్ఫార్మెన్స్ మొత్తం ఒక ట్రాక్ మీద ఉండదు, అందువల్ల మానసికంగా కూడా ప్రభావం చూపుతుంది . ఫిజికల్ యాక్టివిటి డిప్రెషన్ మరియు ఆందోళను తగ్గించడానికి లింక్ కలిగి ఉంటుంది . కాబట్టి అథ్లెట్స్ కూడా ఓవర్ గా వ్యాయామలు చేయడం వల్ల కాంపిటేటివ్ స్పిరిట్ కోల్పోతున్నట్లు భావిస్తుంటారు

నిద్రలోపాలు:

నిద్రలోపాలు:

రోజంతా యాక్టివ్ గా ఉండటం వల్ల రాత్రి సమయంలో బాగా నిద్రపడుతుంది . అయితే ఇది వ్యతిరేకంగా పనిచేస్తే ఇక నిద్రలోపంతో రోజూ బాధపడాల్సి వస్తుంది. శరీరానికి అధిక శ్రమ అందివ్వడం వల్ల విశ్రాతి కొరవడుతుంది. దాంతో నిద్రలేమి లేదా ఎక్కువగా నిద్రపోవడం జరగుతుంది. ఇలాంటి పరిస్థితిలో జిమ్ తగ్గించడం వల్ల స్లీపింగ్ ప్యాట్రన్స్ నార్మల్ కు వస్తాయి.

English summary

Signs You're Overdoing It At The Gym

Signs You're Overdoing It At The Gym, Overdoing it when it comes to your workout routine can be hazardous to your health
Story first published: Thursday, March 10, 2016, 10:30 [IST]
Desktop Bottom Promotion