For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పాదాలు 15నిమిషాలు వెనిగర్ నీటిలో పెట్టుకుంటే పొందే బెన్ఫిట్స్..!!

వెనిగర్ ని వంటకాల్లో ఫ్లేవర్ కి మాత్రమే వాడతారు అనుకుంటే మీరు పొరబడ్డట్టే. వెనిగర్ లో అనేక ఔషధగుణాలు ఉంటాయి. అది చాలా రకాల వ్యాధులను నయం చేస్తుందని చాలామందికి తెలియదు.

By Swathi
|

వెనిగర్ ని వంటకాల్లో ఫ్లేవర్ కి మాత్రమే వాడతారు అనుకుంటే మీరు పొరబడ్డట్టే. వెనిగర్ లో అనేక ఔషధగుణాలు ఉంటాయి. అది చాలా రకాల వ్యాధులను నయం చేస్తుందని చాలామందికి తెలియదు. వెనిగర్ లోనే అనేక హెల్త్ బెన్ఫిట్స్ తో పాటు.. రకరకాల వ్యాధులను తేలికగా నయం చేస్తుంది.

Soak Your Feet In Apple Cider Vinegar

పాదాలకు సంబంధించిన అనేక వ్యాధులను వెనిగర్ ఎలా నివారిస్తుందో ఇవాళ తెలుసుకుందాం. వెనిగర్ వాసనను చాలామంది ఇష్టపడకపోవచ్చు. కానీ.. వెనిగర్ ద్వారా పొందే హెల్త్ బెన్ఫిట్స్ ని మాత్రం ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. అంతేకాదు బరువు తగ్గడానికి, కొలెస్ట్రాల్, ఫ్యాట్ కరగడానికి కూడా వెనిగర్ సహాయపడుతుంది.

కిడ్నీ స్టోన్స్ ను శాశ్వతంగా నివారించే 4 అద్భుతమైన రెమెడీస్..!కిడ్నీ స్టోన్స్ ను శాశ్వతంగా నివారించే 4 అద్భుతమైన రెమెడీస్..!

అయితే కొంతమందికి వెనిగర్ వల్ల ఎలర్జీ కూడా రావచ్చు. కాబట్టి అలర్ట్ గా ఉండాలి. డాక్టర్ సలహా తర్వాత దీన్ని ఉపయోగించడం మంచిది. అయితే పాదాలను వెనిగర్ లో నానబెట్టుకోవడం వల్ల ఎలాంటి బెన్ఫిట్స్ పొందవచ్చో ఇప్పుడు చూద్దాం..

పాదాల కండరాలు

పాదాల కండరాలు

యాపిల్ సైడర్ వెనిగర్ లో పొటాషియం ఉంటుంది. ఇది పాదాల్లో కండరాల నొప్పులు, పాదాలు అడుగుభాగంలో నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అరబక్కెట్ నీళ్లు తీసుకుని.. ఒక కప్పు వెనిగర్ కలపాలి. అందులో 30 నిమిషాలపాటు పాదాలను నానబెట్టుకోవాలి. ఇది పాదాల నొప్పులు, మంటను వెంటనే తగ్గిస్తుంది.

పాదాల్లో ఫంగస్

పాదాల్లో ఫంగస్

వెనిగర్ లో న్యాచురల్ ఎసిడిటీ ఉంటుంది. ఇది ఫంగస్ ని నాశనం చేయడానికి సహాయపడుతుంది. పాదాల్లో ఫంగస్ తో బాధపడేవాళ్లకు వెనిగర్ చక్కటి పరిష్కారం.

ఆనె నివారించడానికి

ఆనె నివారించడానికి

వెనిగర్ లో కాటన్ ని ముంచి.. పాదాల్లో ఏర్పడిన ఆనెపై రాసుకోవాలి. రాత్రంతా అలాగే వదిలేయాలి. ఉదయాన్నే శుభ్రం చేసుకుని కొబ్బరినూనె అప్లై చేయాలి. రోజుకి ఒకసారి ఇలా చేస్తూ ఉంటే.. ఆనెలు ఎఫెక్టివ్ గా తగ్గిపోతాయి.

గోళ్లలో ఫంగస్

గోళ్లలో ఫంగస్

కొంతమందికి కాలి గోళ్లలో ఫంగస్ ఏర్పడుతుంది. అరబక్కెట్ నీళ్లు తీసుకుని అందులో ఒక కప్పు వెనిగర్ కలపాలి. ఇందులో పాదాలను అరగంట నానబెట్టుకోవాలి. తర్వాత బయటకు తీసి తుడుచుకుని టీట్రీ ఆయిల్ అప్లై చేసి.. మసాజ్ చేయాలి. ఇలా రోజుకి రెండుసార్లు చేయాలి. ఇది కాలి గోళ్లలో ఫంగస్ ని తేలికగా, త్వరగా నివారిస్తుంది.

కాలి వేళ్ల మధ్య వచ్చే ఫంగస్

కాలి వేళ్ల మధ్య వచ్చే ఫంగస్

కాలి వేళ్ల మధ్యలో లేదా సైడ్స్ లో ఫంగస్ ఏర్పడుతూ ఉంటుంది. ఇది ఒత్తిడి, రాపిడి వల్ల వస్తుంటుంది. కాబట్టి పాదాలను వెనిగర్ నీటిలో 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. తర్వాత పాదాలు బయటకు తీసి.. తుడుచుకుని ఆముదం అప్లై చేయాలి. ఇలా 10 నుంచి 15 రోజులు చేస్తే.. ఈ ఫంగస్ తొలగిపోతుంది.

పాదాల్లో దుర్వాసన

పాదాల్లో దుర్వాసన

అరకప్పు వెనిగర్ ని ఒక బక్కెట్ నీటిలో కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత పాదాలను 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. తర్వాత పాదాలను సోప్ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే.. పాదాల్లో వచ్చే దుర్వాసన తగ్గిపోతుంది.

పాదాల పగుళ్లు

పాదాల పగుళ్లు

అరకప్పు యాపిల్ సైడర్ వెనిగర్ ని ఒక బక్కెట్ నీటిలో కలపాలి. ఇందులో 15 నిమిషాలు పాదాలను నానబెట్టుకోవాలి. వెనిగర్ లో ఉండే ఏటిక్ యాసిడ్.. చర్మాన్ని స్మూత్ గా మారుస్తుంది. అలాగే చర్మాన్ని ఎక్స్ ఫోలియేట్ చేసి.. పగిలిన పాదాల్లో ఏర్పడిన డ్రై స్కిన్ ని త్వరగా తొలగిస్తుంది.

అలసిన పాదాలను

అలసిన పాదాలను

ఎక్కువగా నడవడం వల్ల పాదాలు బాగా అలసిపోతాయి. ఇలాంటప్పుడు బక్కెట్ నీటిలో వెనిగర్ కలిపి.. కాసేపు పాదాలను అందులో పెట్టుకుంటే.. చాలా రిలాక్స్ గా అనిపిస్తుంది. పాదాల నొప్పులు, అలుపు తగ్గిపోతుంది.

English summary

Soak Your Feet In Apple Cider Vinegar; It Helps Cure These Diseases

Soak Your Feet In Apple Cider Vinegar; It Helps Cure These Diseases. Apple cider vinegar not just adds taste to your food but it has lots of medicinal properties too. It helps treat several foot-related diseases.
Desktop Bottom Promotion