For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జామపండుతో కొలెస్ర్టాల్ కరిగి స్లిమ్ అవడం ఖాయం..

By Swathi
|

ప్రస్తుత సీజన్ లో ఎక్కడచూసినా.. జామపండ్లు రారమ్మంటున్నాయి. జామపండ్లు తినడానికి చాలామంది ఇష్టపడతారు. ఇది గుండె ఆరోగ్యానికి, జీర్ణశక్తికి తోడ్పడుతుందని తెలుసు. అయితే బరువు తగ్గడానికి కూడా జామకాయ చాలా అద్భుతంగా పనిచేస్తుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.

READ MORE: గర్భిణీస్త్రీలలో వ్యాధినిరోధకశక్తిని పెంచే జామకాయ..

ఆరంజ్ లో కంటే జామకాయంలో విటమిన్ సి నాలుగు రెట్లు అధికంగా ఉంటుందట. సోడియం, పొటాషియం, ఫైబర్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇందులో చక్కెర స్థాయిలు తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అలాగే శరీరంలోని అవసరంలేని కొవ్వును కరిగించడానికి జామకాయ ఉపయోగపడుతుంది.

weight loss

జామకాయల్లో విటమిస్ ఏ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి చూపు మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే పోషకాల వల్ల చర్మం ఆరోగ్యంగా, అందంగా ఉంటుంది. జామకాయ పండు గుజ్జు ముఖానికి స్ర్కబ్ లా ఉపయోగించవచ్చు. ఇలా చేయడం వల్ల ముఖంపై ముడతలు తగ్గిపోయి చర్మం ప్రకాశవంతంగా తయారవుతుంది.

READ MORE: జామ ఆకులో ఆశ్చర్యం కలిగించి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

guava

బరువు తగ్గాలి అనుకునేవారికి జామ మంచి ఔషధంగా పనిచేస్తుంది. జామకాయ తింటే కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. కాబట్టి ఇది తిన్న తర్వాత ఎక్కువ ఆహారం తినలేరు. ఇందులో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి నీరసించే అవకాశం ఉండదు. కాబట్టి ఒబేసిటీతో బాధపడేవారు తమ ఆహారంతోపాటూ ఒక జామకాయను తీసుకుంటే మంచి ఫలితం వస్తుంది. కొవ్వు మెటబాలిజంను ప్రభావితం జేసే " పెక్టిన్" జామలో లభిస్తుంది. ఇది కొలెస్ట్రాల్ ను తగ్గించి, పేగుల్లో ప్రోటీన్ పరిశుభ్రతను పరిరక్షించడంలో సహకరిస్తుంది. జామలో కొవ్వు, క్యాలరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి.. బరువు తగ్గాలనుకునే వారికి ఇది జామ చక్కటి పరిష్కారం.

English summary

The Best Fruit to Eat While Trying to Lose Weight

The Best Fruit to Eat While Trying to Lose Weight. Guava provides many valuable nutrients that can support your immune system. In addition, diets rich in fruits are associated with improved weight management and weight loss.
Story first published: Saturday, January 9, 2016, 17:34 [IST]
Desktop Bottom Promotion