For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లేటెస్ట్ స్డడీ: ఈ డ్రింక్ తో రోజు ప్రారంభిస్తే అనారోగ్య సమస్యలకు చెక్

By Swathi
|

ఉదయాన్నే ఎందుకు చాలా మంది నిమ్మరసం, తేనె కలిపిన నీళ్లు తీసుకోవాలని సూచిస్తారు ? అలాగే చాలామంది ఈ సీక్రెట్ ఫాలో అవుతారు కూడా ? ఎందుకు ? వాస్తవమే.. నిమ్మరసం, తేనె, గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. ఇదో మ్యాజికల్ మిక్స్ అని చెప్పవచ్చు. ఈ డ్రింక్ కంపల్సరీ అందరూ ఫాలో అవడం మంచిదని అధ్యయనాలు ప్రూవ్ చేశాయి.

READ MORE: ఉదయాన్నే నీరు త్రాగడం వల్ల పొందే 15 గొప్పు ఆరోగ్య ప్రయోజనాలు

నిమ్మరసం, తేనె, గోరువెచ్చని నీటిలో కలిపి ఉదయాన్నే పరగడుపున తీసుకోవడం వల్ల లెక్కలేనన్ని ప్రయోజనాలు పొందవచ్చట. బరువు తగ్గడం నుంచి.. లివర్ లోని మలినాలను బయటకు పంపడం వరకు రకరకాల హెల్త్ బెన్ఫిట్స్ పొందవచ్చు అంటున్నారు నిపుణులు. మీరు ఈ డ్రింక్ తాగడం మొదలుపెట్టకపోతే.. వెంటనే స్టార్ట్ చేయండి. ఇక్కడ చెప్పే ప్రయోజనాలు విన్న తర్వాత ఖచ్చితంగా మీరు ఈ డ్రింక్ తాగడం స్టార్ట్ చేసేస్తారు. అవేంటో ఇప్పుడే చూసేద్దామా...

డ్రింక్ తయారు చేసే విధానం

డ్రింక్ తయారు చేసే విధానం

ఒక గ్లాసు గోరు వెచ్చని నీళ్లు తీసుకోవాలి. అరనిమ్మకాయ రసం, ఒక టీ స్పూన్ తేనె అందులో కలపాలి. బాగా మిక్స్ చేసి తాగాలి. ఒకవేళ మీకు మధుమేహం ఉన్నా.. కూడా ఈ డ్రింక్ నిరబ్యంతరంగా తాగవచ్చు. ఈ మిశ్రమం తాగిన తర్వాత కనీసం అరగంట పాటు కాఫీ, టీ ఏమీ తాగకూడదు.

లివర్

లివర్

మానవ శరీరంలో లివర్ చాలా ముఖ్యమైన అవయవం. నిమ్మరసం, తేనె, గోరువెచ్చని నీళ్లలో కలిపి తీసుకోవడం వల్ల కాలేయంలో పేరుకున్న మలినాలు బయటకు పోతాయి. పోషకాలు ఉత్పత్తి చేసి, జీర్ణక్రియ ప్రక్రియ సజావుగా సాగడానికి లివర్ బాధ్యత వహిస్తుంది. ఈ ప్రక్రియ మొత్తం సజావుగా సాగడానికి ఈ మ్యాజికల్ డ్రింక్ పర్ఫెక్ట్ గా సహాయపడుతుంది.

బరువు తగ్గడానికి

బరువు తగ్గడానికి

ఈ మిశ్రమం ఉదయాన్నే తీసుకోవడం వల్ల టాక్సిన్స్ బయటకు వెళ్లిపోయి.. బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. అలాగే మెటబాలిజం స్థాయి యాక్టివ్ గా ఉండటం వల్ల.. బరువు తగ్గడం తేలికవుతుంది.

విటమిన్స్ , మినరల్స్

విటమిన్స్ , మినరల్స్

ప్రతిరోజూ ఉదయాన్నే ఈ మిశ్రమం తీసుకోవడం వల్ల శరీరంలోని ప్రతి వ్యవస్థ యాక్టివ్ గా పనిచేస్తుంది. శరీరానికి కావాల్సిన విటమిన్స్, మినరల్స్ పొందడానికి సహకరిస్తుంది. అంతేకాదు ఈ మిక్స్ లోనే విటమిన్ సి, విటమిన్ బి, మెగ్నీషియం, క్యాల్షియం, ఫాస్పరస్ పొందవచ్చు.

కాన్స్టిపేషన్

కాన్స్టిపేషన్

గోరువెచ్చని నీటిలో నిమ్మ, తేనె కలుపుకుని తాగడం వల్ల జీర్ణవ్యవస్థ ప్రక్రియ సజావుగా సాగుతుంది. దీనివల్ల మలబద్ధకం, అరుగుదల సరిగా లేకపోవడం వంటి సమస్యలు దూరంగా ఉంటాయి. బోవెల్ మూవ్ మెంట్స్ చాలా యాక్టివ్ గా ఉంటాయి.

అలసట

అలసట

ఉదయాన్నే ఈ డ్రింక్ తాగడం వల్ల మీకు ఎక్కడలేని ఉత్సాహం వచ్చేస్తుంది. అలసట, నీరసం వంటి ఫీలింగ్స్ అన్నీ బలాదూర్ అవుతాయి. తేనె తక్షణ శక్తిని ఇస్తుంది. అలాగే ఇందులో క్యాలరీలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. అంతేకాదు గోరువెచ్చని నీళ్లు ఫ్రెష్ బ్లడ్ ని బ్రెయిన్ అందించడం వల్ల మెదడు చాలా యాక్టివ్ గా, ఫ్రెష్ గా ఉంటుంది.

యూరినరీ ట్రాక్

యూరినరీ ట్రాక్

తేనె యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్. కాబట్టి ఇది కామన్ ఇన్ఫెక్షన్లు దరిచేరకుండా కాపాడుతుంది. యూరినరీ ట్రాక్ ని క్లెన్స్ చేసి.. యూరిన్ ఇన్ఫెక్షన్లు రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. ఇప్పటికే ఈ ఇన్ఫెక్షన్ సమస్యతో బాధపడే వాళ్లు ఉదయాన్నే తప్పకుండా ఈ డ్రింక్ తీసుకోవడం వల్ల సమస్య నుంచి బయటపడవచ్చు.

గ్లోయింగ్ స్కిన్ కి

గ్లోయింగ్ స్కిన్ కి

నిమ్మరసం, తేనె, నీటితో ఆరోగ్యానికే కాదు.. మీ చర్మ సౌందర్యం కూడా దాగుంది. బ్లడ్ ప్యూరిఫై చేసి, కొత్త రక్తకణాలు ఉత్పత్తి చేస్తుంది. దనీివల్ల చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. అలాగే పింపుల్స్, మచ్చలు తొలగిపోయి.. చర్మం మెరిసిపోతుంది.

English summary

The truth about lemon-honey-water concoction!

The truth about lemon-honey-water concoction! Most of us drink the warm water mixed with honey and lemon juice concoction every morning to help reduce weight.
Desktop Bottom Promotion