For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దాల్చిన చెక్క, తేనె మిశ్రమంతో పొందే మిరాకిలస్ బెన్ఫిట్స్..!

రోజుకి ఒక్క టీ స్పూన్ చెక్క, తేనె తీసుకోవడం వల్ల మీరు ఊహించలేని ఆరోగ్యప్రయోజనాలు పొందవచ్చట. చాలా సింపుల్ గా తయారు చేసుకునే ఈ మిశ్రమం తీసుకోవడం వల్ల అనేక వ్యాధులను నిరోధించవచ్చు.

By Swathi
|

రోజుకి ఒక్క టీ స్పూన్ చెక్క, తేనె తీసుకోవడం వల్ల మీరు ఊహించలేని ఆరోగ్యప్రయోజనాలు పొందవచ్చట. చాలా సింపుల్ గా తయారు చేసుకునే ఈ మిశ్రమం తీసుకోవడం వల్ల అనేక వ్యాధులను నిరోధించవచ్చు.. అలాగే.. శారరీకంగా అనేక మార్పులు మీలో కనిపిస్తాయి. ఈ కాంబినేషన్ ని చైనీస్ అనేక సంవత్సరాలుగా ఆయుర్వేదంలోనూ, మెడిసిన్స్ లోనూ ఉపయోగిస్తున్నారు.

These 2 Home Ingredients Help Cure 5 Diseases; Leaves Doctors Shocked

చెక్కలో అనేక రకాల ఆరోగ్యప్రయోజనాలు దాగున్నాయి. దీన్ని పూర్వం నుంచి మసాలా దినుసుగా ఉపయోగిస్తున్నాం. ఇక చాలా సహజసిద్ధంగా లభించే తేనెలోనూ ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉన్నాయి. మరి ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే.. ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి కదా.

తేనెలో యాంటీ ఇన్ల్ఫమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలుంటాయి. అలాగే అనేక పోషకాలు, ఎమినో యాసిడ్ ఉంటుంది. దాల్చిన చెక్కలో ఇన్ల్ఫమేషన్ తగ్గించే గుణం, ఇమ్యునిటీని మెరుగుపరిచే సత్తా ఉంటాయి. అనేక వ్యాధులు నివారించడానికి ఈ రెండూ పర్ఫెక్ట్ కాంబినేషన్.

ఈ రెండింటి మిశ్రమాన్ని ప్రతిరోజూ తీసుకునేవాళ్లలో ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉండవు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మరి.. ఈ రెండింటి మిశ్రమంతో పొందే అమేజింగ్ బెన్ఫిట్స్ ఏంటో చూద్దాం..

జలుబు

జలుబు

ఒక టీస్పూన్ తేనె, చిటికెడు చెక్క పొడి తీసుకుని రెండింటినీ బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి నిద్రపోవడానికి ముందు తినాలి. అంతే.. దగ్గు, జలుబుని తేలికగా తగ్గిస్తుంది.

ఒబేసిటీ

ఒబేసిటీ

ఒక టీస్పూన్ తేనె, అర టీస్పూన్ చెక్క పొడి తీసుకుని నీటిలో మరిగించాలి. బ్రేక్ ఫాస్ట్ కి అరగంట ముందు పరకడుపున తీసుకోవాలి. ఒబేసిటీని తగ్గిస్తుంది.

బరువు తగ్గడం

బరువు తగ్గడం

తేనె, చెక్క రెండూ బరువు తగ్గడానికి పర్ఫెక్ట్ రెమెడీస్. ఒక టీస్పూన్ తేనె, అరటీస్పూన్ చెక్క పొడిని నీటిలో వేడి వేడిచేయాలి. ఈ మిశ్రమాన్ని ఉదయం బ్రేక్ ఫాస్ట్ కి ముందు తీసుకోవాలి. అలాగే రాత్రి పడుకునే ముందు తీసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తే బరువు తగ్గుతారు.

జీర్ణక్రియ

జీర్ణక్రియ

ఒక టీస్పూన్ తేనె, చిటికెడు దాల్చిన చెక్క పొడి కలిపి.. భోజనానికి ముందు తీసుకోవాలి. ఇది ఎసిడిటీ, ఇన్ డైజెషన్ సమస్యలను నివారిస్తుంది.

గుండె సంబంధిత వ్యాధులు

గుండె సంబంధిత వ్యాధులు

తేనె, దాల్చిన చెక్కను బ్రేక్ ఫాస్ట్ కి ముందు తీసుకోవడం వల్ల హార్ట్ ఎటాక్ రిస్క్ తగ్గించుకోవచ్చు. డైరెక్ట్ తీసుకోవడం ఇష్టపడని వాళ్లు.. బ్రెడ్ పై జామ్ కి బదులు ఈ పేస్ట్ చేర్చుకుని తినడం వల్ల స్ట్రోక్ రిస్క్ తగ్గుతుంది. కొలెస్ర్టాల్ లెవెల్స్ తగ్గుతాయి. ఇప్పటికే హార్ట్ ఎటాక్ సమస్యతో బాధపడుతున్నవాళ్లు కూడా రెగ్యులర్ గా ఈ మిశ్రమాన్ని తీసుకోవం వల్ల గుండె కండరాలను బలంగా చేస్తుంది.

English summary

These 2 Home Ingredients Help Cure 5 Diseases; Leaves Doctors Shocked

These 2 Home Ingredients Help Cure 5 Diseases; Leaves Doctors Shocked. Honey and cinnamon have lots of health benefits. This article lists about 5 diseases that these two ingredients help cure.
Story first published: Thursday, December 1, 2016, 16:44 [IST]
Desktop Bottom Promotion