For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నీళ్లు తాగలేకపోతున్నారా ? ఐతే నింబూపానీ ట్రై చేయండి

By Swathi
|

ఇండియాలో కాఫీ, టీ రెగ్యులర్ తాగడం అలవాటు. ఉదయం టిఫిన్, లంచ్, మధ్యాహ్నం, సాయంత్రం కాఫీ, టీలు కంపల్సరీ తాగుతారు. నిజమే మన ఇండియన్స్ కాఫీ, టీ తాగడాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. వీటి కారణంగా శరీరానికి అవసరమైన, ఆరోగ్యకరమైన మంచినీళ్లను కూడా తాగడం మర్చిపోతున్నాం. చాలామంది రోజుకి ఒక లీటర్ కంటే.. తక్కువ నీటిని తాగుతున్నారు.

బరువు తగ్గాలనే బిగ్ టాస్క్‌ని సింపుల్‌గా డీల్ చేయడానికి నిమ్మకాయ

నీళ్లు తాగడం చాలా బోర్ గా ఫీలవవచ్చు. కానీ.. నీళ్లు తాగడం వల్ల పొందే ప్రయోజనాలు మాత్రం అమోఘం. కాబట్టి నీళ్లు తాగడం బోర్ ఫీలవుతుంటే.. ఒక నిమ్మకాయ ముక్క లేదా, నిమ్మరసం కలుపుకుని నీళ్లు తాగడం. ఇది టేస్టీగానూ ఉంటుంది.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. నీళ్లలో నిమ్మకాయ లేదా నిమ్మరసం కలుపుకుని తాగడం వల్ల పొందే 10 ప్రయోజనాలు తెలుసుకుందాం..

స్కిన్ కేర్

స్కిన్ కేర్

చాలా కాస్మొటిక్స్.. గ్లోయింగ్, హెల్తీ స్కిన్ ఇస్తామని ఊదగొడుతూ ఉంటాయి. కానీ.. అవి చాలా ఖర్చుతో కూడుకున్నవి. కాబట్టి వాటికి బదులు నీళ్లలో నిమ్మరసం కలుపుకుని చూడండి.. మీ చర్మం ఎంత ప్రకాశవంతంగా మారుతుందో మీకే తెలుస్తుంది. అలాగే బ్లాక్ హెడ్స్, ముడతలు, వయసు ఛాయలు కనిపించకుండా.. కాపాడుతుంది.

పొట్ట ఆరోగ్యానికి

పొట్ట ఆరోగ్యానికి

జీర్ణక్రియ సమస్యలు చాలా సాధారణంగా వచ్చే సమస్యలు. కాబట్టి గోరువెచ్చని నీళ్లు, నిమ్మరసం తీసుకోవడం వల్ల ఎలాంటి జీర్ణసమస్యలు మిమ్మల్ని వేధించవు. నిమ్మరసం బ్లడ్ ని ప్యూరిఫై చేస్తుంది. అలాగే మలబద్ధకం, టాక్సిన్స్, జీర్ణసమస్యలను నివారిస్తుంది.

బ్లడ్ ప్యూరిఫికేషన్

బ్లడ్ ప్యూరిఫికేషన్

మనం చాలా జంక్ ఫుడ్, ప్రిజర్వేటివ్స్, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ రోజూ తింటూ ఉంటాం. వీటి కారణంగా టాక్సిన్స్ శరీరంలో, బ్లడ్ లో చేరుతూ ఉంటాయి. వీటిని బయటకు పంపించడానికి నీటిలో కలిపిన నిమ్మరసం తాగితే.. బ్లడ్ ప్యూరిఫై అవుతుంది.

నోటికి

నోటికి

నీళ్లలో నిమ్మరసం కలుపుకుని తాగడం వల్ల చెడు దుర్వాసన, చిగుళ్ల అనారోగ్యం, పంటి నొప్పి సమస్యలు దూరమవుతాయి.

హై బ్లడ్ ప్రెజర్

హై బ్లడ్ ప్రెజర్

నిమ్మలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది హై బ్లడ్ ప్రెజర్ ని తగ్గించి.. నీరసం, అలసట, సిక్ నెస్ ఫీలింగ్ నుంచి దూరంగా ఉంచుతుంది.

మానసిక ఆరోగ్యానికి

మానసిక ఆరోగ్యానికి

నిమ్మరసం నీళ్లు తీసుకోవడం వల్ల మీ మూడ్ ని కూడా ఉత్సాహంగా మార్చేయవచ్చు.

శ్వాససంబంధ సమస్యలు

శ్వాససంబంధ సమస్యలు

నిమ్మరసం నీళ్లు చాలా పవర్ ఫుల్. ఇవి అన్ని రకాల సమస్యలను నయం చేసేస్తాయి. శ్వాస సంబంధ సమస్యలు తగ్గించి.. ఆస్తాతో బాధపడుతున్న వాళ్లకు నిమ్మరసం నీళ్లు చాలా చక్కటి పరిష్కారం.

కీళ్ల నొప్పులు

కీళ్ల నొప్పులు

నిమ్మరసం ఇన్ల్ఫమేషన్ తగ్గించడానికి, టాక్సిన్స్, బ్యాక్టీరియా తొలగించడానికి అలాగే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగించడానికి సహాయపడతాయి.

ఇన్ఫెక్షన్స్

ఇన్ఫెక్షన్స్

నిమ్మరసం ఇన్ఫెక్షన్లు దరిచేరకుండా.. చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు.. గొంతు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఒకవేళ ఉప్పు నీళ్లు గొంతు నొప్పిని తగ్గించకపోతే.. నిమ్మరసం ట్రై చేయండి.

యాంటీ ఏజింగ్

యాంటీ ఏజింగ్

స్కిన్ డ్యామేజ్ కి కారణమయ్యే.. ఫ్రీ రాడికల్స్ ఉత్పత్తిని తగ్గిస్తుంది నిమ్మరసం. నిమ్మరసం క్యాలరీ ఫ్రీతోపాటు, యాంటీ ఆక్సిడెంట్ లా పనిచేస్తుంది.

Story first published: Monday, February 1, 2016, 17:12 [IST]
Desktop Bottom Promotion