ట్రీట్మెంట్స్ , థెరఫీలతో నయం కానీ బ్యాక్ పెయిన్ ఈ ఆహారాలతో బై బై చెప్పవచ్చు...

తరచూ బ్యాక్ పెయిన్ తో ఇబ్బంది పడుతున్నారా? ఇప్పటికే మీరు అన్ని రకాల ట్రీట్మెంట్స్, మరియు థెరఫీలతో విసుగు చెందారా? అయినా కూడా ఎలాంటి మార్పు లేదా ? బ్యాక్ పెయిన్స్, బ్యాక్ ప్రాబ్లెమ్స్ మన నిత్యజీవితంలో ఒక సాధరణ సమస్యగా మారిపోయింది. మరి ఈ బ్యాక్ పెయిన్ నివారించుకోవడానికి మార్గమే లేదా అంటే ఖచ్చితంగా ఉందనే చెప్పాలి.

వెన్నునొప్పి భాదిస్తోందా? ఇవిగో ఉపమశమన మార్గాలు

వ్యాయామాలు మరియు థెరఫీలతో నయం కానీ బ్యాక్ పెయిన్ మన తీసుకొనే రెగ్యులర్ ఆహారాలతో నయం అవుతుందంటే ఆశ్చర్యం కలగక మానదు¬! కాబట్టి, మీరు దీర్ఘకాలం పాటు బాధ పడుతున్న బ్యాక్ పెయిన్ కు బాయ్ బాయ్ చెప్పే కొన్ని టాప్ టెన్ ఆహారాలను ఈ క్రింది లిస్ట్ అవుట్ చేయబడినది. ఖచ్చితంగా ఈ ఆహారాలు హెల్ప్ అవుతాయి. మరికెందుకు ఆలస్యం క్రోనిక్ బ్యాక్ పెయిన్ నివారించే ఆహారాలేంటో తెలుసుకుందాం...బ్యాక్ పెయిన్ నుండి ఉపశమనం పొందుదాం...

ఫ్యాటీ ఫిష్:

ఫ్యాటీ ఫిష్:

ఫ్యాటీ ఫిష్ అంటే సార్డిన్స్, తున, మకెరెల్ మరియు కోడ్ వంటి ఫిష్ లలో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి నొప్పిని నివారిస్తాయి మరియు ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి . మీరు వెజిటేరియన్స్ అయితే మీరు వాల్ నట్స్ మరియు ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఇతర ఆహారాలను తీసుకోవాలి.

గ్రీన్ టీ:

గ్రీన్ టీ:

గ్రీన్ టీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉన్నాయి. ఇవి పెయిన్ మరియు ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి . జాయింట్ పెయిన్, బ్యాక్ పెయిన్ మరియు ఆర్థరైటిస్ తో బాధపడే వారు గ్రీన్ టీని రెగ్యులర్ గా తీసుకుంటే మంచి ఉపశమనం కలుగుతుంది. గ్రీన్ టీ సైటోకిన్ ఐఎల్ -17ను తగ్గిస్తుంది, ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ సబ్ స్టాన్స్ గా పిలిచే సైటోకిన్ ఐఎల్ -10ను పెంచుతుంది

దానిమ్మ:

దానిమ్మ:

దానిమ్మ కండరాల సలుపు ను నివారిస్తుంది . కాబట్టి రెగ్యులర్ గా దానిమ్మ లేదా దానిమ్మ జ్యూస్ త్రాగడం వల్ల మజిల్ సోర్ నెస్ నుండి ఉపశమనం పొందవచ్చు . ఇంకా నొప్పిని కూడా తగ్గించుకోవచ్చు . దానిమ్మ జ్యూస్ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. బ్యాక్ పెయిన్ నివారిస్తుంది.

రెడ్ గ్రేప్స్:

రెడ్ గ్రేప్స్:

రెడ్ గ్రేప్స్ లో రెస్ వరటోల్ అనే ఫాలీఫినాల్స్ అధికంగా ఉండటం వల్ల ఆర్ధరైటిస్ మరియు జాయింట్ పెయిన్ నివారిస్తుంది . ఇది ఇన్ఫ్లమేషన్ తగ్గించడం మాత్రమే కాదు, కండరాలను మరియు జాయింట్స్ ను బలోపేతం చేస్తుంది. బ్యాక్ పెయిన్ తగ్గించుకోవడానికి రెడ్ గ్రేప్స్ ను ఖచ్చితంగా తీసుకోవాలి.

ఆలివ్ ఆయిల్ :

ఆలివ్ ఆయిల్ :

బ్యాక్ పెయిన్ నుండి ఉపశమనం కలిగించే వాటిలో ఆలివ్ ఆయిల్ మరో సూపర్ ఫుడ్ అని చెప్పవచ్చు . ఇందులో ఎక్కువ న్యూట్రీషియన్స్ మరియు స్పెషల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్ ఓలికాంథల్ వంటివి బ్యాక్ పెయిన్ తగ్గిస్తుంది. ఆర్థైటిస్ తో బాధపడే వారు ఆలివ్ ఆయిల్ వాడకం వల్ల నొప్పులను తగ్గించుకొన్నట్లు చాలా పరిశోధనలు కూడా రుజువు చేశాయి.

పసుపు:

పసుపు:

పసుపు ఒక బెస్ట్ నేచురల్ హోం రెమెడీ . ఇది చర్మం కూడా వండర్ఫుల్ బెనిఫిట్స్ కలిగిస్తుంది . ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది . పొట్టనొప్పి మరియు మలబద్దకానికి నేచురల్ గా క్యూర్ చేస్తుంది. పసుపులో ఉండే ఔషధగుణాలు ఇన్ఫ్లమేషన్ నుండి ఉపశమనం కలిగించడంలో గ్రేట్ గా పనిచేస్తుంది . బ్యాక్ పెయిన్ నివారించడంలో ఎఫెక్టివ్ రెమెడీ పసుపు.

అల్లం:

అల్లం:

అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి ఇది ఎఫెక్టివ్ ఎమిటిక్ గా పనిచేస్తుంది . అల్లంలో అనాల్జిసిక్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వల్ల బ్యాక్ పెయిన్ నివారించడంలో ఎఫెక్టివ్ ఫుడ్ అని చెప్పవచ్చు.

పుదీనా:

పుదీనా:

పుదీనా మీ బ్యాడ్ బ్రీత్ ను రిఫ్రెష్ చేయడం మాత్రమే కాదు, మజిల్ స్పామ్ ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. బ్యాక్ మజిల్స్ ను రిఫ్రెష్ చేయడానికి గ్రేట్ గా సహాయపడుతుంది . పుదీనా ఆకులు తినడం లేదా నొప్పిఉన్న ప్రదేశంలో మింట్ ఆయిల్ అప్లై చేయడంతో ఉపశమనం పొందవచ్చు.

కాఫీ:

కాఫీ:

ఉదయాన్నే ఒక కప్పు కాఫీ త్రాగడం వల్ల ఆ రోజంతా మీకు ఉత్సాహాన్ని అందివ్వడం మాత్రమే కాదు, అనేక ఆరోగ్యప్రయోజనాలను అందిస్తుంది . ఇందులో కెఫిన్ అధికంగా ఉండటం వల్ల బ్యాక్ పెయిన్ నివారిస్తుంది. కండరాల సలుపు తగ్గుతుంది . కాఫీ త్రాగడం వల్ల కండాల సలుపు వ్యాయామాల తర్వాత వచ్చే నొప్పులను నివారించుకోవచ్చు.

హాట్ పెప్పర్స్:

హాట్ పెప్పర్స్:

ఈ రెమెడీస్ తో కాస్త జాగ్రత్తగా ఉండాలి. నాలుక కాస్త మండుతుంది . హాట్ పెప్పర్స్ లో క్యాప్ససిన్ అధికంగా ఉంటుంది ఇది యాక్టివ్ కాంపౌండ్ . ఇందులో స్ట్రాంగ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలుండటం వల్ల సైటోకిన్స్ గ్రోత్ ను వ్యతిరేకిస్తుంది.

Story first published: Wednesday, March 2, 2016, 13:23 [IST]
Desktop Bottom Promotion