For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆకలి తగ్గించి, బరువు తగ్గడానికి సహాయపడే ఆహారాలు

By Swathi
|

బరువు తగ్గాలనే బిగ్ టాస్క్ ని రీచ్ అవ్వాలంటే.. ముందుగా ఆకలిని అదుపులో ఉండేలా జాగ్రత్త పడాలి. ఆకలి కంట్రోల్ లో ఉండాలి అంటే.. పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. ఆకలిగా ఉన్నా ఏమీ తినకుండా.. కష్టపడటం కానేకాదు. కేవలం మీరు తీసుకునే ఆహారంలో చిన్న మార్పులు చేసుకుంటే చాలు.. ఆకలి దానంతట అదే మీ కంట్రోల్ లోకి వచ్చేస్తుంది.

ఆకలి అనిపించడం లేదా? ఐతే ఈ చిట్కాలను పాలోఅవ్వండి... ఆకలి అనిపించడం లేదా? ఐతే ఈ చిట్కాలను పాలోఅవ్వండి...

బరువు తగ్గడం అనేది అందరికీ చాలా పెద్ద సమస్య ! లైఫ్ స్టైల్, ఆహారం తీసుకునే విధానమే బరువు పెరగడానికి కారణమవుతుంది. సరైన ఆహారం తీసుకోవడం, రెగ్యులర్ గా వ్యాయామం చేయడం బరువు తగ్గడానికి మంచి పద్ధతి. బరువు తగ్గడానికి ఆకలి కూడా కీలక పాత్ర పోషిస్తుందని మాత్రం మరిచిపోకండి.

గర్భధారణ సమయంలో ఆకలిని పెంచటానికి చిట్కాలు గర్భధారణ సమయంలో ఆకలిని పెంచటానికి చిట్కాలు

ఆకలి తక్కువగా ఉంటే.. బరువు తగ్గడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఆకలి తగ్గించుకోవడానికి హెల్తీ మార్గాలు ఎంచుకోవాలి. కొన్ని రకాల ఆహారాల ద్వారా ఆకలి మీరు ఊహించని విధంగా కంట్రోల్ చేయవచ్చు. అలాంటి టాప్ ఫుడ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

ఓట్ మీల్

ఓట్ మీల్

ఓట్ మీల్ లో తక్కువ క్యాలరీలు, ఎక్కువ ఫైబర్ ఉంటుంది. ఇది తిన్న తర్వాత పొట్టనిండిన ఫీలింగ్ ఉంటుంది. అది కూడా ఎక్కువసేపు ఉంటుంది. ఆకలి కలిగించడాన్ని తగ్గించడం, చిరుతిండి తీసుకోకుండా.. తగ్గిస్తుంది. అలాగే కొలెస్ట్రాల్ ని కూడా తగ్గిస్తుంది.

నట్స్

నట్స్

నట్స్ లో హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి కూడా పొట్టనిండిన ఫీలింగ్ కలిగించి.. తినాలనే ఫీలింగ్ తగ్గిస్తాయి. బాదాంలో పినోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది హార్మోన్స్ ని ఉత్పత్తి చేసి.. ఆకలిని తగ్గించి.. గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి.

గ్రీన్ టీ

గ్రీన్ టీ

గ్రీన్ టీ తీసుకోవడం వల్ల అన్ హెల్తీ స్నాక్స్ తీసుకోవడాన్ని అరికట్టవచ్చు. గ్రీన్ టీలో ఉండే క్యాటెచిన్స్ ఫ్యాట్ సెల్స్ ని నివారిస్తాయి. అలాగే గ్రీన్ టీ బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

ఫ్లాక్స్ సీడ్స్

ఫ్లాక్స్ సీడ్స్

ఫ్లాక్స్ సీడ్స్ లో ఫైబర్, ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి బరువు తగ్గడానికి సహాయపడతాయి. అలాగే ఫ్లాక్స్ సీడ్స్ ఆకలి తగ్గించి, షుగర్ ఫుడ్స్ తీసుకోకుండా అరికడతాయి.

కాఫీ

కాఫీ

ఆకలి తగ్గించడంలో కాఫీ చాలా పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. కాఫీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఆకలిని కంట్రోల్ చేస్తాయి. అయితే చక్కెర తక్కువగా ఉండే కాఫీని తక్కువ మోతాదులో తీసుకోవాలి. దీనివల్ల బరువు తగ్గడం తేలికవుతుంది.

యాపిల్స్

యాపిల్స్

యాపిల్స్ ఆకలి తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. ఇందులో ఉండే పెక్టిన్, ఫైబర్ పొట్టనిండిన ఫీలింగ్ కలిగిస్తాయి. అలాగే బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించి, కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి.

అవకాడో

అవకాడో

మధ్యాహ్న భోజనం సమయంలో అవకాడో ఫ్రూట్ ని సగం తీసుకోవడం వల్ల మధ్యాహ్నమంతా ఆకలి లేకుండా.. పొట్టనిండుగా ఉన్న ఫీలింగ్ కలిగిస్తుంది.

ఎగ్స్

ఎగ్స్

రోజుని ఎగ్స్ ప్రారంభించండి. మీకు ఇక మధ్యాహ్నం వరకు ఆకలి ఉండదు. ఇందులో ప్రొటీన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆరోగ్యానికి మంచిది.

బీన్స్

బీన్స్

బీన్స్, బఠాణీలు, కాయధాన్యాలు తీసుకోవడం వల్ల ప్రొటీన్స్ పుష్కలంగా పొందవచ్చు. వీటిల్లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ బి, ఐరన్ ఉంటాయి. అలాగే ఆకలిని కంట్రోల్ చేస్తాయి.

English summary

Top Foods That Help To Suppress The Appetite

Top Foods That Help To Suppress The Appetite. Losing weight is a tedious task! Wrong food choices and sedentary lifestyle is one of the major causes for weight gain.
Story first published: Wednesday, February 24, 2016, 11:50 [IST]
Desktop Bottom Promotion