For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

8 వ్యాధులతో.. ఆయుధంలా పోరాడే క్యాబేజీకి ఇకపై నో చెప్పకండి..!

క్యాబేజ్ లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీరాడికల్స్ ని తగ్గించి.. శరీరంలో రకరకాల వ్యాధులను అడ్డుకుంటాయి. వారానికి ఒకసారైనా క్యాబేజ్ తినాలి అనడానికి కారణాలు.

By Swathi
|

క్యాబేజ్ అంటే చాలా మంది ఇష్టపడరు. ఎలాంటి స్టైల్లో దీన్ని వండినా.. క్యాబేజ్ ని మాత్రం తినడానికి ఇష్టపడరు. ఇక పిల్లలైతే.. వద్దని మారాం చేస్తారు. వగరుగా ఉంటుంది కాబట్టి.. దీన్ని పెద్దగా ఉపయోగించరు. కానీ.. క్యాబేజీలో ఉండే పోషక విలువలు తెలిస్తే.. మాత్రం ఇష్టం లేకపోయినా.. కాస్తైనా తింటారు.

Use Cabbage As A Weapon Against Top 8 Health Issues

క్యాబేజీ తినడం వల్ల డయాబెటిస్, ఒబేసిటీ వంటి రకరకాల వ్యాధులు నయం అవుతాయి. చర్మంపై వాపు, మంట వచ్చినప్పుడు క్యాబేజ్ ని చాలా ఏళ్లుగా ఉపయోగిస్తారు. ఇందులో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కొన్ని వ్యాధులు నివారించడానికి క్యాబేజ్ ని న్యాచురల్ రెమెడీగా ఉపయోగిస్తారు.

క్యాబేజ్ లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీరాడికల్స్ ని తగ్గించి.. శరీరంలో రకరకాల వ్యాధులను అడ్డుకుంటాయి. మరి క్యాబేజీని తినాలి అనడానికి, క్యాబేజీ తినడం వల్ల నయం అయ్యే వ్యాధులేంటో తెలుసుకుందాం..

జీర్ణక్రియ

జీర్ణక్రియ

క్యాబేజ్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే ఫైబర్ అనేక జీర్ణ సమస్యలను నివారిస్తుంది. కాన్ట్సిపేషన్, క్రాంప్స్, బ్లోటింగ్ ని నివారిస్తుంది.

ఎనర్జీ లెవెల్స్

ఎనర్జీ లెవెల్స్

క్యాబేజ్ లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఎనర్జీ లెవెల్స్ ని మెరుగుపరుస్తుంది. ఇది బ్లడ్ సర్క్యులేషన్, మెటబాలిజంను మెరుగుపరుస్తుంది.

ఇమ్యునిటీ

ఇమ్యునిటీ

క్యాబేజ్ లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది ఇమ్యునిటీని మెరుగుపరిచి.. అనారోగ్య సమస్యలకు దూరంగా ఉంచుతుంది.

ఎముకల బలానికి

ఎముకల బలానికి

క్యాబేజ్ లో ఉండే అద్భుత ప్రయోజనాల్లో ఇది ఒకటి. క్యాబేజీలో విటమిన్ కే పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలను బలంగా మారుస్తుంది. అలాగే ప్రొటీన్ ఉత్పత్తిని మెరుగుపరిచి.. ఎముకల ఆరోగ్యానికి సహాయపడుతుంది.

గుండె ఆరోగ్యానికి

గుండె ఆరోగ్యానికి

క్యాబేజ్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గుండె సంబంధిత వ్యాధులైన హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వంటి సమస్యలకు దూరంగా ఉంచుతుంది.

కంటిచూపు

కంటిచూపు

క్యాబేజ్ లో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యాన్ని, చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే వయసు పెరిగే కొద్దీ వచ్చే సమస్యలను తేలికగా నివారించడానికి సహాయపడుతుంది క్యాబేజ్.

క్యాన్సర్

క్యాన్సర్

క్యాబేజ్ లో పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ తో పోరాడి.. క్యాన్సర్ ని అడ్డుకుంటాయి.

ఇన్ల్ఫమేషన్

ఇన్ల్ఫమేషన్

క్యాబేజ్ ఇన్ల్ఫమేషన్ ని చాలా ఎఫెక్టివ్ గా తగ్గిస్తుంది. క్యాబేజ్ లలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల.. శరీరంలో ఎక్కడ వాపు ఉన్నా వెంటనే తగ్గిస్తుంది.

English summary

Use Cabbage As A Weapon Against Top 8 Health Issues

Use Cabbage As A Weapon Against Top 8 Health Issues. Did you know that cabbages have the ability to treat several health problems? Read this article to know its top health benefits.
Desktop Bottom Promotion