For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లోబ్లడ్ ప్రెజర్ నియంత్రించే వృక్షాసనం (ట్రీ పోస్)

By Super Admin
|

వృక్షాసనం అనగా వృక్షం ఆకారంలో వేసే ఆసనం. వృక్షం మరియు ఆసనం అనే రెండు పదాల కలయిక వల్ల వృక్షాసనంగా ప్రసిద్ధి. ఈ పదం కూడా సంసృతం నుంచి తీసుకొనబడింది. ప్రాథమికంగా, ఒక వృక్షం ఆకారంలో నించోవడమే. మిగతా యోగాసనాలాలా ఈ ఆసనం వేసేటప్పుడు కళ్ళు మూసుకోకూడదు. ఒకే కలిపై బరువును మోపి వేసే ఆసనానికి కళ్ళు తెరిచి ఉంచితే శరీరాన్ని చక్కగా బాలన్స్ చేసుకోవచ్చు.

తక్కువ రక్తపోటును హైపోటెన్షన్ అని కూడా అంటారు. రక్తపోటు సరైన స్థాయిలో ఉండకపోవడంతో అవయవాలకు తగినంత మేర సరఫరా కాదు. అటు తక్కువ రక్తపోటైనా, మరోవైపు అధిక రక్తపోటైనా ఆరోగ్యకరం కాదు. వీటి వల్ల, కంటి చూపు మసకబారడం, తలనొప్పి, నలతగా ఉండటం, మూర్చ వంటి సమస్యల బారిన పడే అవకాశాలు కలవు. ఇటువంటి లక్షణాలు పడుకున్నప్పుడు లేదా కూర్చున్నప్పుడు అకస్మాత్తుగా లేచినప్పుడు ఎక్కువగా కనిపిస్తాయి.

విద్యాపరంగా, ఈ సమస్యను ఆర్తోస్టేటిక్ హైపోటెన్షన్ అని అంటారు. ఫలితంగా, రోగి గుండె పోటు, మూత్రపిండాల సమస్యలతో ఇబ్బంది పడతాడు. కొన్ని సందర్భాలలో, స్ట్రోక్ కి గాని షాక్ కి గాని గురయ్యే అవకాశాలుంటాయి. అందువల్ల, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఇటువంటి సమస్యల నుంచి దూరంగా ఉండే అవకాశాలుంటాయి.


వైద్యపరీక్షలు క్రమం తప్పకుండా చేయించుకోవడం వల్ల కలిగే మిగతా లాభమేంటంటే మొదటి దశలోనే మీరు సమస్యను గుర్తించి సరైన చికిత్స తీసుకోవడం వల్ల రోగం ముదరకుండా త్వరగా నయమయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల, క్రమబద్ధమైన రక్తపరీక్షలు, గుండె సంబంధ పరీక్షలు, రేడియాలజిక్ పరీక్షలు చేయించుకోవడం వల్ల ఎంతో ఉపయోగం.

ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆరోగ్యంపై సరైన అవగాహన కలిగి ఉండటం. పైన చెప్పబడిన ఏవైనా లక్షణాలను మీరు గుర్తించిన వెంటనే ఎటువంటి నిర్లక్ష్యం చూపించకూడదు. ఆరోగ్యంపై అశ్రద్ధ ధోరణి వల్ల అనారోగ్యం బారిన పడతారు. అందువల్ల ఎల్లప్పుడూ ఆరోగ్య స్పృహతో ఉండాలి.

ఈ ఆసనం సాధన చేసే దశలు

• నిటారుగా నించుని మీ చేతులను మీ శరీరానికి ఇరువైపులా తిన్నగా ఉంచండి.

• ఈ భంగిమలో మీరు చాలా బాలెన్స్డ్ గా ఉండాలి. మీరు సౌకర్యవంతంగా ఉండే కాలితో ఈ ఆసనాన్ని సాధన చేయండి. మీ కుడి మోకాలిని కాస్త ఒంచినట్టుగా మీ ఎడమ తొడపై ఆనించండి. ఈ క్రమంలో, మీ కుడి అరిపాదం ఎడమ కాలి తొడపై ఫ్లాట్ గా ఉండేలా చూడండి.


• మీ ఎడమ కాలితో మీ శరీర బరువును జాగ్రత్తగా బాలెన్స్ చేయండి. మీఎడమ కాలు తిన్నగా ఉండేలా చూసుకోండి.

• బాలెన్సింగ్ లో కంఫర్టబుల్ గా ఉన్నప్పుడు, శ్వాస తీసుకోండి. ఇప్పుడు, నిదానంగా, సున్నితంగా మీ రెండు చేతులను ప్రార్థన చేసే విధంగా కలపండి.

• ఇప్పుడు స్ట్రెయిట్ గా దూరంగా ఉన్న వస్తువులను చూడండి. దీని వలన మీరు బాలన్స్ ను చక్కగా మేనేజ్ చేయగలుగుతారు.

• వెన్నెముక సపోర్ట్ ను తీసుకుంటున్నారు కాబట్టి మీ వెన్నెముక నిటారుగా ఉండేలా చూసుకోండి. లోతైన శ్వాసలను తీసుకోండి. ఒకవైపు మీ శరీరం నిటారుగా, స్టిఫ్ గా ఉండేలా చూసుకుంటూనే ఇంకొకవైపు మీరు శ్వాస తీసుకుంటూ రిలాక్స్ అవ్వాలి. మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకుంటూ, చిరునవ్వును చిందిస్తూ ఈ ఆసనాన్ని సాధన చేయండి.


• మళ్ళీ సాధారణ స్థితికి చేరుకోవడానికి మీ చేతుల నుండి ప్రారంభించండి. మీ చేతులను సున్నితంగా కిందకు తీసుకునివచ్చి మీ కుడి కాలును కూడా మెల్లగా కిందకు దించండి.

• ఇదే ఆసనాన్ని ఇప్పుడు ఇంకొక కాలితో సాధన చేయండి. మళ్ళీ అవే స్టెప్స్ ను అనుసరించండి. అయితే, మీరు కళ్ళు తెరిచే ఈ ఆసనాన్ని సాధన చేయాలి. లేకపోతే, బాలన్స్ మిస్ అయ్యే ప్రమాదం ఉంది.

ప్రయోజనాలు

మీలో చైతన్యం ప్రకాశింపబడుతుంది

మీ కాళ్ళు, చేతులు, వెనుకభాగం విస్తరించబడతాయి

ఏకాగ్రత మెరుగవుతుంది

సయాటికా నరాల సమస్య నయమవుతుంది

నిలకడగా ఉండటం మెరుగవుతుంది.

హెచ్చరిక

మీరు మైగ్రైన్, హై బ్లడ్ ప్రెజర్, వెన్నెముక సమస్యలు, నిద్రలేమి మరియు స్పాండిలైటిస్ వంటి సమస్యలతో బాధపడుతున్నట్టయితే ఈ ఆసనాన్నిప్రయత్నించకండి.

English summary

Vrksasana (Tree Pose) For Curing Low Blood Pressure

Vriksha means Tree and Asana means Pose and asana is pronounced as Vrik-shah-asana. This is again borrowed from Sanskrit term, like any other Yoga asana. It is basically standing tall like a tree.
Story first published: Saturday, June 18, 2016, 15:00 [IST]