For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పచ్చి అల్లం తినడం వల్ల శరీరంలో జరిగే అద్భుత మార్పులు..

|

అల్లం ట్రెడిషనల్‌ మెడిసిన్‌. మాంసాహారంలో అల్లం పడితే ఆ టేస్టే వేరు. అలాగే అల్లంతో టీ చేసుకుని తాగితే ఆ హాయి చెప్పనక్లర్లేదు. ఘాటుగా ఉండి వెజ్ నాన్వెజ్ తేడా లేకుండా అన్ని కూరలలో వాడేది అల్లం. అల్లం పచ్చడి గురించి చెప్పనవసరం లేదు.ఇద్లీలో, దోశలో నంచుకు తింటే అహా..!చెప్పనవసరంలేదుగా..!అల్లంలో మనకు తెలియని ఔషధీయ గుణాలు ఎన్నో పుష్కలంగా ఉన్నాయి. ఇది అనేక ఆరోగ్య సమస్యలకు చక్కటి మందులా పనిచేస్తుంది.

జింజర్ జ్యూస్(అల్లం రసం)లోని గొప్ప ఆరోగ్యప్రయోజనాలు

అల్లంలో విటమిన్, మెగ్నీషియం, పొటాషియం, కాపర్ మరియు మాంగనీస్ లు పుష్కలంగా ఉన్నాయి . ఇది ఒక హేర్బల్ మెడిసిన్ . ముఖ్యంగా ఇది ప్రేగుల్లోని గ్యాస్ ను నివారించడానికి సహాయపడుతుంది . మరియు ఇన్ టెన్షినల్ ట్రాక్ ను స్మూత్ చేస్తుంది, విశ్రాంతి పరుస్తుంది. అంతే కాదు అల్లం ఆకలిని పెంచుతుంది. లాలాజల ఉత్పత్తికి సహాయపడుతుంది మరియు జీర్ణ రసాలను ఉత్పత్తి చేస్తుంది . శ్వాస సంబంధిత సమస్యలను నివారిస్తుంది. ఎక్సెస్ గ్యాస్ ను నివారిస్తుంది . ఆర్థరైటిస్ పెయిన్ నివారిస్తుంది. అంతేకాదు వీటితో పాటు మరికొన్ని ప్రయోజనాలు ఈ క్రింది లిస్ట్ లో తెలపడం జరగింది.

డయాబెటిస్:

డయాబెటిస్:

డయాబెటిస్ ఉన్న వారు ఫ్రెష్ అల్లం నీటిని ఉదయాన్నే త్రాగడం వల్ల , బ్లడ్ షుగర్ లెవల్స్ స్థిరంగా ఉంటుంది.

బ్లడ్ సర్క్యులేషన్:

బ్లడ్ సర్క్యులేషన్:

అల్లం విటమిన్'లను, మినరల్స్ మరియు అమైనోఆసిడ్'లను కలిగి ఉండి రక్త ప్రసరణను మెరుగు పరచటం వలన గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉంచుతుంది. అల్లం టీ తాగటం వలన గుండెని ఆరోగ్యకరంగా ఉంచి గుండెపోటు మరియు ఇతరేతర గుండె సంబంధిత వ్యాధుల నుండి కాపాడుతుంది

ఆకలి పెరుగుతుంది:

ఆకలి పెరుగుతుంది:

ఆకలి కాకుండా , ఆహారం సరిగా తీసుకోనప్పుడు, ఆహారం తినడానికి అరగంట ముంది పచ్చి అల్లం ముక్కను కొద్దిగా తినాలి.

దాంతో ఆకలి పెరుగుతుంది.

తలనొప్పి తగ్గుతుంది:

తలనొప్పి తగ్గుతుంది:

ఎండిన లేదా పచ్చి అల్లాన్ని కొంచెం నీటితో కలిపి ముద్దగా తయారు చేసి దానిని నుదిటికి రాసుకుంటే తలనొప్పి తగ్గుతుంది.

దగ్గు:

దగ్గు:

జలుబు, ఫ్లూను నివారించేందుకు చికిత్స చేయటానికి కూడా అనాదిగా వైద్యులు, ఆయుర్వేద శాస్తక్రారులు అల్లాన్ని ఉపయోగించారు.

దంతాల నొప్పి:

దంతాల నొప్పి:

అల్లాన్ని ముద్దగా దంచి దంతాల మీద, చిగుళ్ల మీద కొంచెం సేపు ఉంచుకుంటే జలుబులో దంతాలు లాగటం, జివ్వుమనడం వంటి సమస్యలు తగ్గుతాయి.

వికారం తగ్గిస్తుంది:

వికారం తగ్గిస్తుంది:

వికారం నుంచి ఉపశమనం: ప్రయాణం ముందు అల్లం టీ ఒక కప్పు త్రాగటం వలన మోషన్ అనారోగ్యంతో సంబంధం కలిగిన వికారం మరియు వాంతులను నిరోధిస్తుంది. ఈ రోగలక్షణం ఉపశమనానికి వికారం వచ్చేటప్పుడు ఉండే మొదటి సంకేత సమయంలో ఒక కప్పు టీ త్రాగాలి.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:

జింజెర్ గాస్ట్రో ఇంటెస్టినల్‌ డిస్ట్రెస్‌ అంటే జీర్ణ సంబంధమైన ఇబ్బందులన్నిటికీ అల్లం రామ బాణంలా పనిచేస్తుంది.

English summary

What Happens If You Eat Raw Ginger?

Though most of us see ginger as a food, it was perceived as a medicine by the previous generation. Yes, it was used to treat many ailments.
Desktop Bottom Promotion