For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రోజూ ఒక పచ్చి అరటిపండు తినడం వల్ల పొందే సూపర్ బెన్ఫిట్స్

By Swathi
|

అరటిపండు అందరికీ అందుబాటులో ఉండే పండు. అనేక రకాల హెల్త్ బెన్ఫిట్స్ కలిగిన అద్భుతమైన పండు. పొటాషియం ఎక్కువ మోతాదులో న్యాచురల్ గా అరటిపండు ద్వారా పొందవచ్చు. దీనితినడం వల్ల చాలా ఎనర్జిటిక్ గా ఉండటమే కాదు.. ఇమ్యునిటీ పెరుగుతుంది. అయితే అరటిపండులోని ఆరోగ్య ప్రయోజనాలు అందరికీ తెలిసిందే. మరి అరటికాయ లేదా పచ్చి అరటిపండు సంగతేంటి ?

అరటిపండ్లు తినడానికి 25 ఖచ్చితమైన కారణాలు

అవును పచ్చి అరటికాయలో కూడా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల.. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే దీని ద్వారా పొందే ఫైబర్ జీర్ణ వ్యవస్థ ద్వారా వెళ్లి.. టాక్సిన్స్ ని బయటకు పంపుతుంది. ఇంతేనా.. ఒక పచ్చి అరటిపండును ప్రతి రోజూ ఒకటి తీసుకుంటే చాలు.. అనేక ప్రయోజనాలు పొందవచ్చు అని చెబుతున్నారు నిపుణులు. మరి అవేంటో చూద్దామా..

వెయిట్ లాస్

వెయిట్ లాస్

పచ్చి అరటిపండ్లు రోజూ తీసుకోవడం వల్ల.. బరువు తగ్గడానికి సహాయపడతాయి. వాటిలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల పేగులను క్లెన్స్ చేసి, అనవసర ఫ్యాట్ సెల్స్ ని శరీరం నుంచి బయటకు పంపుతాయి.

కాన్ట్సిపేషన్

కాన్ట్సిపేషన్

పచ్చి అరటిపండ్లలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల.. జీర్ణక్రియ వేగంగా జరుగుతుంది. దీనివల్ల కాన్స్టిపేషన్ సమస్య నుంచి బయటపడవచ్చు.

ఆకలి తగ్గడానికి

ఆకలి తగ్గడానికి

పచ్చి అరటిపండ్లు తినడం వల్ల పొట్ట నిండిన ఫీలింగ్ కలుగుతుంది. దీనివల్ల తరచుగా తినాలనే ఫీలింగ్ తగ్గుతుంది. దీనివల్ల బరువు పెరగడాన్ని, ఇతర అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు.

డయాబెటీస్

డయాబెటీస్

పచ్చి అరటిపండ్లు గ్లూకోజ్ పీల్చుకునే స్థాయిని తగ్గిస్తాయి. శరీరంలో ఇన్సులిన్ లెవెల్స్ ని తగ్గించడం వల్ల డయాబెటిస్ అరికట్టవచ్చు.

జీర్ణవ్యవస్థ

జీర్ణవ్యవస్థ

పచ్చి అరటిపండ్లు పేగులు, డైజెస్టివ్ ట్రాక్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇవి ప్రొబయోటిక్ బ్యాక్టీరియాను ప్రమోట్ చేస్తాయి. వీటి వల్ల ఎసిడిటీ సమస్య నివారించవచ్చు.

కోలన్ క్యాన్సర్

కోలన్ క్యాన్సర్

పచ్చి అరటిపండ్లు తినడం వల్ల కోలన్ క్యాన్సర్ రిస్క్ తగ్గుతుందని స్టడీస్ చెబుతున్నాయి. కోలన్, డైజెస్టివ్ ట్రాక్ ని ఆరోగ్యంగా ఉంచడం వల్ల టాక్సిన్స్ తొలగిపోతాయని చెబుతున్నాయి.

ఎముకలకు

ఎముకలకు

పచ్చి అరటిపండ్లలో విటమిన్స్, మెగ్నీషియం, క్యాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలు స్ట్రాంగ్ గా అవుతాయి. అలాగే జాయింట్ పెయిన్స్ నివారిస్తాయి.

మూడ్

మూడ్

పచ్చి అరటిపండ్లు తినడం వల్ల వాటిలో ఉండే ఎమినో యాసిడ్స్ ట్రైప్టోఫాన్ బ్రెయిన్ లో కెమికల్స్ ని బ్యాలెన్స్ చేస్తాయి. దీనివల్ల మూడ్ లో వచ్చే మార్పులను అరికడతాయి.

చూశారుగా పచ్చి అరటిపండ్లలో ఉన్న అమోఘమైన ప్రయోజనాలు. ఇకపై రోజుకు ఒక పచ్చి అరటిపండు తినడం మొదలుపెట్టండి.

English summary

What Happens When You Eat One Raw Banana Everyday?

What Happens When You Eat One Raw Banana Everyday? Yes, raw bananas are infused with healthy starch and antioxidants that can boost your health to a great extent.
Story first published:Wednesday, May 4, 2016, 16:44 [IST]
Desktop Bottom Promotion