For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

16 గంటలు ఆహారం తీసుకోకపోతే శరీరంలో జరిగే అద్భుత మార్పులు.!!

|

మీరు ఎప్పుడైనా ఒక రోజంతా ఉపవాసం ఉన్నారా? కొంత మంది పండగలనో..లేదా డైటింగ్ అనో లేదా టైమ్ లేకో...అదీ కాకుంటే ప్రయాణంలో ఉన్నామనో భోజనం చేయకుండా ఉంటారు. ఇలా గంట తరబడి ఉండటం ఆరోగ్యానికి ఎంత వరకూ మంచిది . కొన్ని గంటలు భోజనం లేకుండా ఉండటం వల్ల సాధ్యమేనా..?

అయితే ఇలా కొన్ని గంటల తరబడి భోజనం లేకుండుటం వల్ల శరీరంలో ఏం జరుగుతుంది? ఎలా ఫ్రస్టేట్ అవుతంటారు.?

ఎక్కువ సమయం ఆహారం తీసుకోకపోవడం వల్ల కంటిన్యుగా ఆకలి వేస్తుండటం, పొట్టలో పేగులు నులిపెడుతునట్లు , ఎనర్జీ తగ్గిపోవడం, అలసట, తలనొప్పి మొదలగు లక్షణాలు కనబడుతాయి. ముఖ్యంగా పూర్తిగా ఆహారపానీయాలు మానేసి ఫాస్టింగ్ చేసే వారిలో ఇలాంటి లక్షణాలు ఎక్కువగా కనబడుతుంటాయి .

పురాతన కాలంలో సన్యాసులు, బుషులు కొన్ని నెలల కొద్ది ఎక్కువ రోజులు ఆహారపానియాలు తీసుకోకుండా ఎలా జీవిస్తారు? అప్పట్లో ఆహారపు అలవాట్లు, ఆరోగ్య స్థితిగతులు అందకు సహకరించేవి. కానీ ప్రస్తుత కాలంలో మన తీసుకునే ఆహారం, నీళ్ళు, పీల్చే గాలి అన్నీ కలుషతమై, రసాయనిక ఉత్పత్తు వాడకం ఎక్కవై మనం తీసుకునే ప్రతి ఆహారం అనారోగ్యానికి గురిచేస్తుంది.

ప్రస్తుత రోజుల్లో జీవన శైలిని బట్టి ఒక్క రోజు ఫాస్టింగ్ ఉంటే చాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. సగం రోజు ఉపవాసం ఉన్రనాన చాలా ఆరోగ్యానికి కొన్ని అద్భుతాలు జరగుతాయని రీసెంట్ గా జరిపిన పరిశోధనల్లో నిపుణులు సూచిస్తున్నారు. ఫాస్టింగ్ చేయడం వల్ల బరువు తగ్గడం మాత్రమే కాదు, ఇతర అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

16గంటల ఆహారం తీసుకోకపోతే శరీరంలో ఎలాంటి మార్పులు జరగుతాయో తెలుసుకుందాం..

ఇన్సులిన్ లెవల్స్ రెగ్యులేట్ అవుతుంది:

ఇన్సులిన్ లెవల్స్ రెగ్యులేట్ అవుతుంది:

కనీసం 16 గంటలు ఆహారపానీయాలు తీసుకోకపోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ లెవల్స్ క్రమబద్దం అవుతుంది. డయాబెటిస్ నివారించుకోవచ్చు మరియు ఇతరుల్లో డయాబెటిక్ లక్షణాలను నివారించుకోవచ్చు.

మతిమరుపు వ్యాధిని తగ్గించుకోవచ్చు:

మతిమరుపు వ్యాధిని తగ్గించుకోవచ్చు:

16 గంటలు ఆహారం తీసుకోకపోవడం వల్ల శరీరంలో ట్రైగ్లిజరైడ్స్ తగ్గుతాయి . దాంతో మతిమరుపును నివారించుకోవచ్చు. ఇది హైట్రైగ్లిజరైడ్స్ తో సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి 16గంటలు భోజనం చేయకపోతే పొందే మరో హెల్త్ బెనిఫిట్ ఇది.

బరువు తగ్గడానికి సహాయడపుతుంది.

బరువు తగ్గడానికి సహాయడపుతుంది.

16 గంటలసేపు ఆహారం తీసుకోకపోతే మరో అద్భుత మార్పు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఓవర్ వెయిట్ లేదా ఓబేసిటితో బాధపడే వారికి ఇది ఒక అద్భుతమైన మార్పు.

సెల్ ఏజింగ్ ప్రొసెస్ ను ఆలస్యం చేస్తుంది:

సెల్ ఏజింగ్ ప్రొసెస్ ను ఆలస్యం చేస్తుంది:

హాఫ్ డే ఫాస్టింగ్ ఉండటం వల్ల ఫ్రీరాడికల్స్ కారణంగా సెల్స్ డ్యామేజ్ కాకుండా నిరోదిస్తుందని రీసెర్చ్ లు తెలుపుతున్నాయి . దాంతో ఏజింగ్ ప్రొసెస్ ఆలస్యమవుతుంది.

బాడీ మొత్తం డిటాక్సిఫై అవుతుంది:

బాడీ మొత్తం డిటాక్సిఫై అవుతుంది:

మీరు ఫాస్టింగ్ లో ఉన్నప్పుడు శరీరం పూర్తిగా ప్రక్షాళగావింపబడుతుంది. టాక్సిన్స్ మొత్తం శరీరం నుండి బయటకు నెట్టివేయడుతాయి. .జీర్ణవ్యవస్థ మొత్తం ఎఫెక్టివ్ గా డిటాక్సిఫై అవుతుంది.

 బ్రెయిన్ హెల్త్ మెరుగుపడుతుంది:

బ్రెయిన్ హెల్త్ మెరుగుపడుతుంది:

16గంటలు ఆహారం తీసుకోకపోవడం వల్ల బ్లడ్ ఫ్లో మెరుగుపడుతుంది. దాంతో బ్రెయిన్ షార్ప్ గా పనిచేస్తుంది. ఇంకా కొన్ని మెంటల్ ఇల్ నెసెస్ నివారించబడుతాయి.

హార్మోన్ ఉత్పత్తిని పెంచుతుంది:

హార్మోన్ ఉత్పత్తిని పెంచుతుంది:

16గంటలు ఫాస్టింగ్ లో ఉండటం వల్ల హార్మోన్ గ్రోత్ ను మెరుగుపరుస్తుంది. సెల్ డ్యామేజ్ నివారిస్తుంది. సెల్ ఏజింగ్ ప్రొసెస్ ను ఆలస్యం చేస్తుంది.

English summary

What Happens To Your Body When You Do Not Eat For 16 Hours?

Have you ever tried fasting for an entire day? Are you someone who has considered the option of going without food for a few hours, either to lose weight or simply because you had a packed schedule?
Story first published: Thursday, July 28, 2016, 13:12 [IST]
Desktop Bottom Promotion