For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రోజుకు ఒక కప్పు కాఫీతో శరీరంలో జరిగే ఆరోగ్యకరమైన మార్పులు..?

|

సహజంగా కొంత మంది నిద్రలేవగానే కాఫీ త్రాగందే దినచర్య మొదలవ్వదు. లేదా కొంత మందికి ఎక్కువ స్ట్రెస్ లో ఉన్నప్పుడు, తలనొప్పితో ఉన్నప్పుడు తప్పనిసరిగా కాఫీ త్రాగుతుంటారు. 'కుదిరితే కప్పు కాఫీ లేకపోతే నాలుగు మాటలు'ఇలా కాలక్షేపానికి కాఫీ తాగేవారు కూడా లేకపోలేదు. కారణం ఏదైనా , దీని వెనుక పెద్ద విషయమే ఉంది. కాఫీ త్రాగడం వల్ల తక్షణం మూడ్ లో మార్పును తీసుకొస్తుంది. కాఫీ త్రాగిన వెంటనే ఒక రిలాక్సింగ్ ఫీలింగ్ ను ఇస్తుంది.

రోజుకు 2 కప్పుల షుగర్ లెస్ బ్లాక్ కాఫీ తాగడంతో పొందే అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్..!

మెంటల్ కాన్ సంట్రేషన్ పెరుగుతుంది మరియు శారీరకంగా అలసటను తగ్గిస్తుంది. ఉత్సాహంగా ఉండేట్లు చేస్తుంది. అలాగే ఏధైనా విషయాలను గుర్తించుకోవాలన్నా లేదా నిద్రమేల్కోవాలన్నా ఇది ఒక అలర్ట్నెన్స్ గా మనకు సహాయపడుతుంది. కాఫీని ప్రెజెంటనేషన్ కు ముందు తీసుకోవడం లేదా ఒక నమ్మకంతో ఇంటర్వ్యూ ఫేస్ చేయాలనుకొన్నప్పుడు రిఫ్రెష్ గా ఒక కాఫీ త్రాగండి..

మీరు ఉదయం 9 గంటల కంటే ముందే కాఫీ ఎందుకు త్రాగకూడదు..

అంతే కాదు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కూడా కాఫీని తయారుచేయడం మరియు తీసుకోవడం చేస్తుంటారు మరియు కాఫీలో కొన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. మనం సహజంగా తాగే డ్రింక్స్ లో కాఫీ ఒక వండర్ ఫుల్ డ్రింక్ గా భావిస్తారు . అయితే కాఫీని ఎంత పరిమాణంలో తీసుకోవాలి? ఎలాంటి కాఫీ మీ ఆరోగ్యానికి ఆరోగ్యకరమైనదని మీరు తెలుసుకోవాలి.

ఒక కప్పు కాఫీతో ఆరోగ్యానికి ఆశ్చర్యం కలిగే లాభాలు

అంతే కాదు, ఎల్లప్పుడు కాఫీ మీకు ఒక బెస్ట్ ఫ్రెండ్ వంటిది . అలాగని ఓవర్ గా తీసుకోవడం కూడా ఆరోగ్యానికి అంత మంచిది కాదు . రోజుకు కేవలం రెండు మూడు కప్పులు తీసుకుంటే సరిపోతుంది . దీనికి మించి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. అందువల్ల, మనం కాఫీ ని త్రాగడం వల్ల మన శరీరంలో ఏం జరుగుతుందన్న విషయాన్ని ఈ క్రింది స్లైడ్ ద్వారా మీకు తెలపడం జరిగింది.

పురుషాంగాన్ని ఆరోగ్యంగా ఉండేందుకు ప్రోత్సహిస్తుందిం :

పురుషాంగాన్ని ఆరోగ్యంగా ఉండేందుకు ప్రోత్సహిస్తుందిం :

ఒక రోజులో 170మిల్లీ గ్రామలు కెఫిన్ తీసుకొనే వారు, అంటే (2 నుండి 3కప్పులు)కాఫీ తీసుకొనే వారు అంగస్తంభన లోపాలను నిరోధిస్తుంది. మితంగా కాఫీ త్రాగడం వల్ల పురుషాంగానికి రక్తప్రసరణను పెంచుతుంది .మరియు సెక్సువల్ పెర్ఫామెన్స్ ను కూడా మెరుగుపరుస్తుంది.

 తలనొప్పి లేదా తలభారాన్ని తగ్గిస్తుంది :

తలనొప్పి లేదా తలభారాన్ని తగ్గిస్తుంది :

రోజుకు రెండు కప్పుల కాఫీని త్రాగడం వల్ల బ్రెయిన్ లో సంతోషాన్ని కలిగించే కెమికల్స్ ను విడుదల చేస్తుంది. మెదడులో డొపమైన్ అనే కెమికల్స్ విడుదలవుతుంది . ఈ కెమికల్స్ మంచి మూడ్ ను అందిస్తుంది .

హార్ట్ బీట్ స్లో అవుతుంది:

హార్ట్ బీట్ స్లో అవుతుంది:

రోజూ ఒక కప్పు కాఫీ త్రాగడం ల్ల హార్ట్ బీట్ ను తగ్గిస్తుంది . బ్లడ్ ప్రెజర్ లైట్ గా పెరుగుతుంది. దాంతో గుండె నార్మల్ గా కొట్టుకుంటుంది మరియు ఇది రిలాక్సేషన్ ఫీలింగ్ ను అందిస్తుంది. ఒక కప్పు కంటే ఎక్కువగా తీసుకోవడం వల్ల హార్ట్ బీట్ పెంచుతుంది.

మానసిక ప్రశాంతతను అందిస్తుంది:

మానసిక ప్రశాంతతను అందిస్తుంది:

కొందరిలో కొన్ని ఆందోళనలు, భయాలు,తమ చుట్టూ ఏదో తిరుగుతన్నట్లు, ఆలోచలను వెంటాడుతుంటాయి. అలాంటి వారు రోజుకు మూడు కప్పుల కాఫీ తీసుకోవడం ద్వారా చాలా వరకూ ఉపశమనం కలిగిస్తుంది. మూడు కప్పుల కాఫీలో 315 గ్రాముల కెఫిన్ ఉంటుంది.

మెంటల్ అండ్ ఫిజికల్ గా ఏకాగ్రతను పెంచుకోవచ్చు:

మెంటల్ అండ్ ఫిజికల్ గా ఏకాగ్రతను పెంచుకోవచ్చు:

కాఫీ బ్రెయిన్ ను క్రమబద్దం చేస్తుంది మెంటల్ కాన్ సంట్రేషన్ తగ్గిస్తుంది. ఇది బ్రెయిన్ యాక్టివ్ గా ఉంచుతుంది. బ్రెయిన్ కు విశ్రాంతి కలిగిస్తుంది.

మలబద్దకాన్ని నివారించుకోవచ్చు:

మలబద్దకాన్ని నివారించుకోవచ్చు:

మలబద్దకంతో బాధపడే వారు కాఫీని త్రాగడం వల్ల మలబద్దకం నివారించుకోవడంతో పాటు, టాయిలెట్ సమస్యలు లేకుండా నివారిస్తుంది. కాఫీలో ఉండే కెఫిన్ ప్రేగుల్లోని పెరిస్టాల్టిక్ మూమెంట్ ను పెంచుతుంది, దాంతో బౌల్ మూమెంట్ స్మూత్ గా జరగడానికి సహాయపడుతుంది . కెఫిన్ వల్ల ఇది ఒక బెస్ట్ హెల్త్ బెనిఫిట్ అని కూడా చెప్పవచ్చు.

 హార్ట్ హెల్త్:

హార్ట్ హెల్త్:

ప్రతి రోజూ రెండు కప్పులు కాఫీని త్రాగే వారిలో హార్ట్ సమస్యలు తగ్గినట్లు కనుగొన్నారు. అందువల్ల పాలు మరియు క్రీమ్ జోడించకుండా కాఫీ త్రాగడం మంచిది. కాఫీ త్రాగడం వల్ల లైఫ్ ఎక్స్పెక్టెన్సీని పెంచుతుంది. హార్ట్ అటాక్ మరియు హార్ట్ స్ట్రోక్ లను నివారిస్తుంది.

English summary

What Happens To Your Body When You Drink Coffee

Let's meet for coffee! This is a common saying among the people to know each other, or to discuss any issue. There is a big reason behind it. Drinking coffee can instantly boost your mood and can give you a relaxed feeling.
Story first published: Wednesday, January 13, 2016, 10:55 [IST]
Desktop Bottom Promotion