For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రతిరోజూ బీట్ రూట్, ఆరంజ్ జ్యూస్ తాగడం వల్ల పొందే బెన్ఫిట్స్..!!

By Swathi
|

హాట్ కాఫీ లేదా టీతో రోజుని స్టార్ట్ చేస్తున్నారా ? వెజిటబుల్స్, ఫ్రూట్స్ అంటే.. ఇష్టపడటం లేదా ? అయితే కొన్ని లైఫ్ స్టైల్ లో మార్పులు, వెజిటబుల్స్, ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల అమేజింగ్ ఔషధ గుణాలు పొందవచ్చని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి.

మన పూర్వీకులు ఎప్పుడూ అనారోగ్యం పాలు అయ్యేవాళ్లు కాదు. అలాగే ప్రస్తుతమున్న ప్రాణాంతక వ్యాధులు కూడా అప్పట్లో కనిపించేది చాలా తక్కువ. ఎందుకు అంటే.. వాళ్లు హెర్బల్ మెడిసిన్స్, కష్టపడి పనిచేసే తత్వం, వెజిటబుల్స్, ఫ్రూట్స్ తీసుకోవడమే కారణం.

మీకు తెలుసా.. బీట్ రూట్, ఆరంజ్ కలిపి జ్యూస్ చేసే తీసుకోవడం వల్ల.. రకరకాల అనారోగ్య సమస్యలను నివారిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. మరి బీట్ రూట్, ఆరంజ్ జ్యూస్ ఎలా చేయాలి, ఎలాంటి ఫలితాలు పొందుతారో చూద్దాం..

కావాల్సిన పదార్థాలు
బీట్ రూట్ - సగం
ఆరంజ్ జ్యూస్ అరకప్పు

జ్యూస్ తయారు చేసేవిధానం
తాజాగా కట్ చేసిన బీట్ రూట్ ముక్కలను, అరకప్పు ఆరంజ్ జ్యూస్ తో కలిపి మిక్సీలో వేయాలి.
జ్యూస్ ని ఒక కప్పులోకి వడకట్టాలి.
ఈ జ్యూస్ ని ప్రతిరోజూ ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ కి ముందు తీసుకోవాలి.

ఈ బీట్ రూట్ మరియు ఆరంజ్ జ్యూస్ రెగ్యులర్ గా తాగడం వల్ల పొందే ఎఫెక్టివ్ బెన్ఫిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

బ్లడ్ ప్రెజర్

బ్లడ్ ప్రెజర్

ఈ న్యాచురల్ జ్యూస్ లో నిట్రిక్ యాసిడ్, విటమిన్ సి ఉంటాయి. ఇవి బ్లడ్ వెజెల్స్, బ్లడ్ ఫ్లోని కంట్రోల్ చేయడానికి సహాయపడి.. హై బ్లడ్ ప్రెజర్ ని తగ్గిస్తాయి.

క్యాన్సర్ నివారణకు

క్యాన్సర్ నివారణకు

బీట్ రూట్, ఆరంజ్ జ్యూస్ లో ఫైటో న్యూట్రియంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి.. క్యాన్సర్ తో పోరాడతాయి. ముఖ్యంగా ప్రొస్టేట్, బ్రెస్, పాంక్రియాటిక్ క్యాన్సర్ లను నిరోధిస్తాయి.

బర్త్ డిఫెక్స్

బర్త్ డిఫెక్స్

ఈ రెండింటి మిశ్రమాన్ని గర్భిణీ స్త్రీలు రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల.. బర్త్ డిఫెక్ట్స్ కి దూరంగా ఉంటారు. పొట్టలో శిశువుకి విటమిన్ బి, సి, ఫోలేట్ అందించి.. ఎలాంటి డిఫెక్ట్ రాకుండా కాపాడుతాయి.

అల్సర్స్

అల్సర్స్

ఈ న్యాచురల్ జ్యూస్ లో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి అల్సర్లు, లోపలి భాగంలో వచ్చే గాయాలను నివారిస్తాయి.

ఇమ్యునిటీ పెంచడానికి

ఇమ్యునిటీ పెంచడానికి

ఈ హోంమేడ్ జ్యూస్ లో విటమిన్ సి, మాంగనీస్, ఇతర పోషకాలు రిచ్ గా ఉంటాయి. ఇవి శరీరంలో కణాలను బలంగా మార్చి.. ఇమ్యునిటీని స్ట్రాంగ్ అండ్ హెల్తీగా మారుస్తాయి.

అనీమియా

అనీమియా

బీట్ రూట్, ఆరంజ్ జ్యూస్ కాంబినేషన్ రక్తం సత్తాను పెంచుతుంది. ఐరన్ ని గ్రహించే శక్తిని మరింత పెంచుతుంది. దీనివల్ల అనీమియాని అరికట్టవచ్చు.

గుండె సంబంధిత సమస్యలు

గుండె సంబంధిత సమస్యలు

ఈ మిశ్రమం తాగడం వల్ల గుండె సంబంధిత సమస్యల రిస్క్ ని తగ్గిస్తుంది. అలాగే కొలెస్ట్రాల్ చేరకుండా అరికడుతుంది. అలాగే.. కార్డియో వాస్క్యులర్ సిస్టమ్ హెల్తీగా ఉండేలా చేస్తుంది.

English summary

Why You Should Drink Beetroot And Orange Juice Every Day?

Why You Should Drink Beetroot And Orange Juice Every Day? Did you know that the juice made from beetroot and orange can treat a number of ailments? Well, learn how to prepare the juice, here.
Story first published:Friday, July 8, 2016, 16:57 [IST]
Desktop Bottom Promotion