For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బగ్ బిట్స్ (నల్లులు, దోమలు, కీటకాలు కాటుకు) నుండి ఉపశమనం కలిగించే 10 హోం రెమెడీస్

By Lekhaka
|

బగ్స్ లేదా బెడ్ బగ్స్ (నల్లులు ) అంటేనే చాలా మంది భయానికి గురి అవుతుంటారు. రక్తాన్ని పీల్చే కీటకాల్లో బగ్స్ కూడా ఒకటి. అయితే అన్ని రకాల కీటకాలు హానికరం కావు! కీటకాలు(బగ్స్ ) అంటే దోమలు, పేలు, తేనెటీగలు, నల్లులు వంటి వివిధ రకాలకు సంబంధించినవి. అయితే వీటిలో హానికలిగించనివి ఉంటే, మరికొన్ని విషపూరితమైనవి. కానీ వీటిలో ఏవి కరిచినా నొప్పిగా, వాపు, మంట కలుగుతాయి.

బెడ్ బగ్స్ ను రాత్రిపూట కీటకాలు అని చెప్పవచ్చు. ఇవి మీకు నిద్ర లేకుండా చేస్తాయి. సాధారణంగా ఇవి వెచ్చని ప్రాంతాల్లో ఉండి రక్తంను ఆహారంగా తీసుకుంటాయి. అవి మీ మొత్తం ఫర్నిచర్ మరియు పరుపులకు బాగా విస్తరించి ఉంటాయి. కాబట్టి వాటిని ముందు వదిలించుకోవటం చాలా ముఖ్యం. ఒక వేల అవి కుట్టినప్పుడు వెంటనే డాక్టర్ వద్దకు పరుగు పెట్టాల్సిన అవసరం లేదు. కానీ అందుకు ప్రత్యామ్నాయంగా మాత్రం ఇంట్లోనే కొన్ని హోం రెమెడీస్ ఉన్నాయి. ఈ 10 రకాల హోం రెమెడీస్ బగ్ బిట్స్ నుండి వెంటనే ఉపశమనం కలిగిస్తాయి..అవేంటంటే..

1. తేనె:

1. తేనె:

తేనెలో యాంటీసెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలున్నాయి. తేనె బగ్ బిట్ ను స్మూత్ చేస్తుంది, ఇది ఇన్ఫెక్షన్ విస్తరించకుండా నివారిస్తుంది.

2. అరటి తొక్క:

2. అరటి తొక్క:

కీటకాలు కుట్టిన ప్రదేశంలో అరటితొక్కతో రుద్దితే వెంటనే ఉపశమనం కలుగుతుంది. అరటి తొక్కలో క్యాల్షియం అధికంగా ఉండటం వల్ల ఇది త్వరగా నయం చేస్తుంది. అయితే ఎక్కువ కీటకాలను ఆకర్షిస్తుంది కాబట్టి , కాస్త జాగ్రత్తగా ఉండాలి!

3. ఎలక్ట్రిక్ కరెంట్ :

3. ఎలక్ట్రిక్ కరెంట్ :

ఇది ఒక సైనిక వ్యూహం. సాలిపురుగులు, చీమలు, తేనెటీగలు కుట్టినప్పుడు వెంటనే కరిచిన చోట నీటితో కడగాలి. తర్వాత 9 ఓల్ట్ ల బ్యాట్రీని కరిచిన ప్రదేశంలో వేయాలి. ఇది కీటకాలు కుట్టిన ప్రదేశంలో విషపూరితం కాకుండా నివారిస్తుంది. మరియు నొప్పి, వాపు నుండి ఉపశమనం కలిగిస్తుంది.

4. ఆల్కహాల్ మర్ధన చేయడం:

4. ఆల్కహాల్ మర్ధన చేయడం:

ఆల్కహాల్ తో కీటకాలు కుట్టిన ప్రదేశంలో అప్లై చేసి మర్ధన చేయడం వల్ల వెంటనే ఉపశమనం కలిగిస్తాయి. ఎప్పుడైతే యాంటీ సెప్టిక్ లక్షణాలు కలిగిన ఆల్కహాల్ మర్ధన చేస్తారో అప్పుడు దురద నుండి ఉపశమనం కలిగిస్తుంది.

5. అలోవెర పేస్ట్ :

5. అలోవెర పేస్ట్ :

కొన్ని అలోవెర ఆకలు తీసుకుని ఫ్రిజ్ లో నిల్వ చేసుకోవాలి. తర్వాత వాటిని తీసి పేస్ట్ పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ ను కీటకాలు కుట్టిన ప్రదేశంలో అప్లై చేయాలి.కలబందలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు వల్ల నొప్పి, దురద తగ్గిస్తుంది.

6. తులసి ఆకులు:

6. తులసి ఆకులు:

తులసి ఆకుల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇది కీటకాల కాటుకు , దోమకాటుకు ఎఫెక్టివ్ గా ఉపయోగపడుతాయి. అలాగే వాపు, మంట తగ్గిస్తాయి. తిరిగి దోమలు కుట్టకుండా, చర్మం మీద వాలకుండా చేస్తాయి!

7. యాపిల్ సైడర్ వెనిగర్

7. యాపిల్ సైడర్ వెనిగర్

యాపిల్ సైడర్ వెనిగర్ ను కీటకాలు కుట్టిన చర్మానికి అప్లై చేస్తే ఇన్ఫెక్షన్ సోకకుండా చేస్తుంది. కుట్టిన ప్రదేశంలో కూలింగ్ ప్రభావం కలుగుతుంది. దురదను క్రమంగా తగ్గిస్తుంది.

8. టీట్రీ ఆయిల్ :

8. టీట్రీ ఆయిల్ :

టీట్రీ ఆయిల్లో యాంటీ సెప్టిక్ గుణాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది ఇన్ఫెక్షన్ సోకకుండా చేస్తుంది. బర్నింగ్ సెన్షేషన్ నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇంకా బగ్ బిట్స్ నుండి ఎఫెక్టివ్ గా ఉపశమనం కలిగిస్తుంది.

9. లెస్టరిన్ ఉపయోగించాలి:

9. లెస్టరిన్ ఉపయోగించాలి:

ఇది ఖచ్చితంగా అసాధారణమైనది కానీ దీనికంటే ప్రభావంతంగా మరేది పనిచేయదు. లిస్టరిన్ అనేది పుదీనాలో ఉంటుంది. ఇది చర్మాన్ని కూల్ గా మార్చతుంది. కుట్టి చోట ఉపశమనం కలిగిస్తుంది. దురద నుండి ఉపశమనం కలిగిస్తుంది.

 స్టిక్కీ టేప్ ఉపయోగించాలి:

స్టిక్కీ టేప్ ఉపయోగించాలి:

మరో ప్రికాషినరీ మెసుర్ మెంట్ . స్టిక్కీ టేప్ పెట్టడం వల్ల స్క్రాచింగ్ ను నివారిస్తుంది. స్కిన్ ఇన్ఫెక్షన్ కలగకుండా నివారిస్తుంది.

బగ్ బిట్స్ నుండి , దురద నుండి ఉపశమనం కలిగించడానికి ఈ 10 రకాల హోం రెమెడీస్ బాగా ఉపయోగపడుతాయి. అయితే ప్రమాధకరమైన, పాయిజినెస్ కీటకాలు కుట్టినప్పుడు వెంటనే డాక్టర్ ను కలవండి.

English summary

10 Effective Home Remedies For Bug Bites

there are a whole lot of natural ways of getting rid of the bug bites without having to apply chemical-rich ointments on your sensitive skin. So, read on to find out about the simple yet effective ways to naturally treat a bug bite.
Desktop Bottom Promotion