For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కిడ్నీ సమస్యలు శాశ్వతంగా దూరం చేసుకోవాలంటే..తినాల్సిన పండ్లు

|

నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా జీవించాలంటే మనం తీసుకునే ఆహారం ముఖ్య పాత్రను పోషిస్తుంది. మనం నిత్యం తీసుకునే ఆహారాల నాణ్యత మీద కిడ్నీలు డైరెక్ట్ గా ఆధారపడుతాయి. కిడ్నీలు శరీరంలో వ్యర్థాలను తొలగించడంలో ముఖ్య పాత్రను పోషిస్తాయి. రక్తంను వడపోసి, రక్తంలోని వ్యర్థాలను బయటకు నెట్టి, మంచి రక్తం శరీరం మొత్తం వ్యాప్తి చెందడానికి సహాయపడుతుంది. అలాంటి కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారాన్ని తీసుకోవాలి. మంచి పౌష్టికాహారం తీసుకోకపోవడం వల్ల కిడ్నీల మీద ఒత్తిడి పెరుగుతుంది. జంక్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్, సాల్ట్ ఫుడ్స్, కార్బోహైడ్రేటెడ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీలకు పర్మనెంట్ గా డ్యామేజ్ అవుతుంది.

10 Fruits You Need To Eat To Fight Kidney Diseases

కాబట్టి, రెగ్యులర్ గా రోజూ ఆరోగ్యకరమైన పండ్లు, కాయగూరలు తీసుకోవడం చాలా అవసరం. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలన్నా, ఆరోగ్యంగా పనిచేయాలన్నా హెల్తీ ఫుడ్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే ఫ్రెష్ గా ఉండే వెజిటేబుల్స్, మరియు ఫ్రూట్స్ లో న్యూట్రీషియన్ వాల్యూస్ అధికంగా ఉంటాయి . కాబట్టి, ఇవి కిడ్నీలలోని హానికరమైన టాక్సిన్స్ ను తొలగిస్తుంది. కొన్ని ఆహారాలు కిడ్నీస్టోన్స్ ఏర్పడకుండా నివారిస్తుంది. మరికొన్ని ఆహారాలు యూరిన్ పిహెచ్ లెవల్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది.

కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవల్సిన జ్యూస్, సాస్ లేదా ఫ్రెష్ ఫ్రూట్. డ్రై ఫ్రూట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ తిన్నంత ఎఫెక్ట్స్ కానీ, ప్రయోజనాలు కానీ అందివ్వవు. కాబట్టి కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఈ హెల్తీ ఫ్రూట్స్ ను రెగ్యులర్ డైట్ లో తప్పనిసరిగా చేర్చుకోవాలి..

యాపిల్స్:

యాపిల్స్:

రోజుకు ఒక్క ఆపిల్ తింటే డాక్టర్స్ అవసరం ఉండదని చెబుతారు కదా అది అక్షరాల నిజం . ఇందులో అద్భుతమైన హెల్త్ బెనిఫిట్స్ దాగున్నాయి. ఒక మీడియం సైజ్ యాపిల్ ను రోజుకు ఒకటి తీసుకుంటే చాలు అందులో 158మిల్లీగ్రాములు పొటాషియం, 10 గ్రాముల ఫాస్పరస్ లు ఉంటాయి. అదే సమయంలో సోడియం కూడా మన శరీరానికి కావల్సినంత అదుతుంది.

వాటర్ మెలోన్ :

వాటర్ మెలోన్ :

వాటర్ మెలోన్ లో వాటర్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల ఇది శరీరంలోని టాక్సిన్స్ ను ఎఫెక్టివ్ గా తొలగిస్తుంది. కాబట్టి కిడ్నీలను హెల్తీగా ఉంచే వాటర్ మెలోన్ ను రెగ్యులర్ డైట్ లో తప్పనిసరిగా చేర్చుకోవాలి.

స్ట్రాబెర్రీస్ :

స్ట్రాబెర్రీస్ :

స్ట్రాబెర్రీస్ లో ఉండే యాంటీఆక్సిడెంట్స్ యాంథోసైనిస్, ఇతర పదార్థాలు ఆక్సిడేటివ్ డ్యామేజ్ నుండి కిడ్నీలను కాపాడుతుంది. ఇది శరీరంలోని హానికరమైన ఫ్రీరాడికల్స్ ను నివారిస్తుంది. లేదంటే ఫ్రీరాడికల్స్ కారణంగా కిడ్నీ డ్యామేజ్ అవుతాయి.

 చెర్రీస్:

చెర్రీస్:

సలాడ్స్ లో చెర్రీస్ ను చేర్చుకోవడం వల్ల అందులో ఉండే న్యూట్రీషియన్స్ కిడ్నీలకు రక్షణ కల్పిస్తాయి. చెర్రీస్ ను డైలీ డైట్ లో ఒక భాగంగా చేసుకోవాలి. దాంతో కిడ్నీ ఆరోగ్యానికి కావాల్సిన న్యూట్రీషియన్స్ ను పొందుతాయి.

అరటిపండ్లు:

అరటిపండ్లు:

కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి సందేహం లేకుండా అరటిపండ్లు తినాల్సిందే. ఎందుకంటే అరటిపండ్లలో పొటాషియం మరియు ఇతర న్యూట్రీషియన్స్ అధికంగా ఉన్నాయి.

అలొకాడో:

అలొకాడో:

అవొకాడో కిడ్నీ స్టోన్స్ ఏర్పడకుండా నివారిస్తుంది. ఇందులో ఉండే పొటాషియం కంటెంట్ కిడ్నీల్లో క్యాల్షియం చేరకుండా చేస్తుంది.

బొప్పాయి:

బొప్పాయి:

కిడ్నీ ఆరోగ్యానికి బొప్పాయి పాపులర్ హోం రెమెడీ. బొప్పాయిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల కిడ్నీ ఆరోగ్యానికి కావల్సిన ప్రయోజనాలన్నింటిని పొందవచ్చు.

ఆరెంజ్ :

ఆరెంజ్ :

ఆరెంజ్ జ్యూస్ లో యూరిన్ ఎసిడిటి తగ్గించే పవర్ ఉంది. అంటే యూరిన్ లో సిట్రేట్ లెవల్స్ ను పెంచుతుంది. దాంతో కిడ్నీలలో స్టోన్స్ ఏర్పడే ప్రమాదం ఉండదు.

రెడ్ గ్రేప్స్:

రెడ్ గ్రేప్స్:

ఎర్ర ద్రాక్ష కిడ్నీలు డ్యామేజ్ కాకుండా నివారిస్తుంది. మీ కిడ్నీలు హెల్తీగా ఉండాలంటే రెగ్యులర్ డైట్ లో రెడ్ గ్రేప్స్ తప్పనిసరిగా చేర్చుకోవాలి.

క్రాన్ బెర్రీస్ :

క్రాన్ బెర్రీస్ :

క్రాన్ బెర్రీ జ్యూస్ తీసుకోవడం వల్ల కిడ్నీవ్యాధులను నివారించడంలో ఇది ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. ఇది యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ నివారించడం నుండి కిడ్నీ సమస్యల నివారించడానికి డైరెక్ట్ గా సహాయపడుతుంది.

English summary

10 Fruits You Need To Eat To Fight Kidney Diseases

10 Fruits You Need To Eat To Fight Kidney Diseases,There are fruits that help to cleanse kidneys from harmful toxins which enter our body from various sources. Some others can help to reduce the risk of kidney stone formation by the action of the pH of urine.
Story first published: Wednesday, May 31, 2017, 15:55 [IST]
Desktop Bottom Promotion