కిడ్నీలు శాశ్వతంగా డ్యామేజ్ అవ్వడానికి కారణమయ్యే 10 అలవాట్లు..!

Posted By:
Subscribe to Boldsky

మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం కిడ్నీలు. ఇవి చూడటానికి కిడ్నీ బీన్స్ లా ఉంటాయి. పొత్తికడుపు వెనుక భాగంలో నుడుము క్రింది బాగంలో ఉండి, శరీరంలో అత్యంత ముఖ్యమైన క్రియను చేస్తుంది. శరీరంలో టాక్సిన్స్ ను తొలగించడంలో కిడ్నీలు ప్రదాన పాత్రపోషిస్తాయి. హార్ట్, బ్రెయిన్ తర్వాత అత్యంత ముఖ్యమైన అవయవం కిడ్నీలు.

కిడ్నీలు రక్తంను వడపోసి, మంచి రక్తాన్ని శరీరం మొత్తానికి సరఫరా చేస్తుంది. అలాగే శరీరంలో ఇతర ఫ్లూయిడ్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది. ఎలక్ట్రోలైట్స్ ను రెగ్యులేట్ చేసి, యూరిన్ బ్యాలెన్స్ చేస్తుంది.

ఎప్పుడైతే శరీరంలోని వ్యర్థాలను తొలగించడంలో ఫెయిల్ అవుతాయో..అప్పుడు కిడ్రీలు, మరియు కిడ్నీల పనితీరు మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. దాంతో శరీరంలో వాపులు ప్రారంభమౌతాయి.

 10 Habits That Damage Your Kidneys

ఇటువంటి పరిస్థితి వెంటనే చికిత్స చేయించుకోకపోతే కిడ్నీ ఫెయిల్యూర్ కి దారితీస్తుంది. తర్వాత కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ ఒక్కటే మార్గం.

ముఖ్యంగా రెగ్యులర్ గా మనం తీసుకునే ఆహారం మీద ఏకాగ్రత కలిగి ఉండాలి. మనం తీసుకునే ఆహారం కిడ్నీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. కిడ్నీల సైజ్ ను బట్టి వాటి ఆరోగ్యాన్ని తెలుసుకోవడం జరగుతుంది.

కిడ్నీ డ్యామేజ్ లేదా ఏదైనా హాని జరిగక ముందే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కిడ్నీ డ్యామేజ్ కు లేదా కిడ్నీలకు హాని కలిగించేందుకు కారణమయ్యే కొన్ని అలవాట్లు ఈ క్రింది విధంగా ఉన్నాయి. వీటిని కనుకు నివారించుకొన్నట్లైతే కిడ్నీ డ్యామేజ్ లేదా హని జరగకుండా ఉంటుంది..

తగినంత హైడ్రేషన్ అందకపోవడం:

తగినంత హైడ్రేషన్ అందకపోవడం:

కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే వాటర్ ఎక్కువగా తాగాలి. అంటే హైడ్రేషన్ ను అందివ్వాలి. కిడ్నీలు శరీరంలో ఫ్లూయిడ్స్ బ్యాలెన్స్ చేయడానికి సమక్ష్ాపడుతుంది. శరీరంలో అవాచిత టాక్సిన్స్, సోడియంను తొలగిస్తుంది. దాంతో కిడ్నీ స్టోన్స్ ఏర్పడకుండా, కిడ్నీ ఫెయిల్యూర్ కాకుండా నివారిస్తుంది.

కాబట్టి రోజూ నీళ్లు ఎక్కువగా తాగడం మంచిది.

ఎక్కువ మాంసాహారాలు తీసుకోవడం వల్ల:

ఎక్కువ మాంసాహారాలు తీసుకోవడం వల్ల:

అనిమల్ ప్రోటీన్స్ అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో కిడ్నీలకు హాని కలిగించే యాసిడ్స్ అధికంగా ఉత్పత్తి అవుతాయి . ఈ ప్రొసెస్ ను అసిడోసిస్ అని పిలుస్తారు(కిడ్నీలు ఎక్సెస్ యాసిడ్స్ ను తొలగించడంలో విఫలం అవుతాయి), ఎక్సెస్ యాసిడ్స్ ప్రమాదకర పరిస్థితికి కారణమవుతుంది.

స్మోకింగ్ :

స్మోకింగ్ :

స్మోకింగ్ వల్ల లంగ్స్ లేదా హార్ట్ కు డైరెక్ట్ గా డ్యామేజ్ కలుగుతుంది. అయితే కిడ్నీల మీద కూడా ప్రభావం చూుతుంది. అందుకు కారణం స్మోకింగ్ వల్ల యూరిన్ లో ఎక్కువ ప్రోటీన్ కోల్పోవడం జరగుతుంది. అది కిడ్నీ ఆరోగ్యం మీద తీవ్రప్రభావం చూపుతుంది.

ఆల్కహాల్ :

ఆల్కహాల్ :

రోజూ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కూడా క్రోనిక్ కిడ్నీ డిసీజ్ కు కారణమవుతుంది. అంతే కాదు స్మోకింగ్ లో టుబాకో మరియు ఆల్కహాల్ కాంబినేసన్ వల్ల కిడ్నీ డ్యామేజ్ అయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి.

ప్రొసెస్ చేసిన ఆహారాలు:

ప్రొసెస్ చేసిన ఆహారాలు:

ఫాస్పరస్, సోడియం వంటి హై మినిరల్స్ కలిగిన ప్రొసెస్ చేసిన ఆహారాలను తీసుకోవడం వల్ల ఇవి నేరుగా ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇది కిడ్నీ ఆరోగ్యం మీద ఫ్లూయిడ్స్, ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ మీద తీవ్ర ప్రభావం చూపుతుంది.

నిద్రలేమి:

నిద్రలేమి:

రోజంతా అలసిన శరీరానికి తగిన విశ్రాంతి కల్పించకపోవడం వల్ల కిడ్నీల మీద ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి, రోజుకు కనీసం 8 గంటల నిద్ర అవసరం అవుతుంది. నిద్రించే సమయంలో శరీరంలో అనేక మార్పులు జరగుతాయి. ఈ సమయంలో ఆర్గాన్ టిష్యల రిపేర్ కూడా జరగుతుంది. జనరల్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది,.

ఉప్పు ఎక్కువగా తినడం వల్ల :

ఉప్పు ఎక్కువగా తినడం వల్ల :

ఉప్పులో సోడియం కంటెంట్ అధికంగా ఉండటం వల్ల ఇది డైరెక్ట్ గా బ్లడ్ పెజర్ ను పెంచుతుంది. బ్లడ్ ఫిల్టరేషన్ పనితీరులో ప్రభావం చూపుతుంది. కిడ్నీలను డీగ్రేట్ చేస్తుంది.

షుగర్ కంటెంట్ :

షుగర్ కంటెంట్ :

స్వీట్స్, షుగరీ ఫుడ్స్ ఎక్కువగా తిడం వల్ల బ్లడ్ ప్రెజర్ పెరుగుతుంది,. దాంతో డయాబెటిస్ కు కారణం అవుతుంది. తర్వాత ఈ రెండు కారణాల వల్ల డైరెక్ట్ గా కిడ్నీ ఫంక్షన్ మీద తీవ్ర ప్రభావం చూపుతుంది.

వ్యాయామలేమి:

వ్యాయామలేమి:

వ్యాయామం చేయకపోవడం వల్ల ఇది శరీరం మీద తీవ్ర ప్రభావం చూపుతుంది, అవయావాలు చురుకుగా పనిచేయకపోగా శరీరంలోని టాక్సిన్స్ బయటకు పోకపోవడం వల్ల ఫ్లూయిడ్ ఇన్ బ్యాలెన్స్ అవుతుంది. దాంతో కిడ్నీల మీద ఒత్తిడి పెరుగుతుంది. మెటబాలిజం రేటు తగ్గుతుంది.

యూరిన్ ను ఎక్కువ సమయం ఆపుకుని ఉండటం:

యూరిన్ ను ఎక్కువ సమయం ఆపుకుని ఉండటం:

యూరిన్ పాస్ చేయాలని అనిపించినా కొన్ని కారణాల వల్ల మూత్ర విసర్జన చేయకుండా ఆపుకుని ఉండటం . ఇలా కొన్ని గంటల సమయం పాటు ఉండటం వల్ల కిడ్నీల మీద యూరిన్ ప్రెజర్ పెరుగుతుంది. ఇది రీనల్ ఫెయిల్యూర్ కు దారితీస్తుంది.

English summary

10 Habits That Damage Your Kidneys

10 Habits That Damage Your Kidneys.Listed in this article are a few of the dangerous habits that can cause damage to the kidneys.